Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime97a3dc6d-ccaa-4ff9-a2ac-17842e600af2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime97a3dc6d-ccaa-4ff9-a2ac-17842e600af2-415x250-IndiaHerald.jpgపెళ్లి చేసుకుందామని మాయ మాటలు చెప్పిన ఓ కిలేడి ఓ వ్యాపారి నుంచి ఏకంగా రూ.11 కోట్లు లూటీ చేసింది. ఘరానా మోసానికి పాల్పడిన ఈ కి ‘లేడీ’ని పోలీసులు కటకటాలకు తరలించారు. ఈ ఘటన హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రుతి సిన్హా అనే యువతి పూర్తిగా జల్సాలకు బానిసగా మారింది. కూర్చొని మనీ సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కడం ప్రారంభించింది. ఈ ప్రాసెస్ లో ఏకంగా ఐఏఎస్ అధికారిగా అవతారమెత్తేసింది. బాగా డబ్బులున్న వీరారెడ్డి అనే వ్యాపారిపై కన్నేసింది. crime;maya;hyderabad;police;marriage;police station;traffic police;research and analysis wing;bachupallyఘరానా మోసం: పెళ్లి చేసుకుందాం రా అంటూ.. రూ.11 కోట్లకు లూటీఘరానా మోసం: పెళ్లి చేసుకుందాం రా అంటూ.. రూ.11 కోట్లకు లూటీcrime;maya;hyderabad;police;marriage;police station;traffic police;research and analysis wing;bachupallyWed, 24 Feb 2021 17:57:40 GMTపెళ్లి చేసుకుందామని మాయ మాటలు చెప్పిన ఓ కిలేడి  ఓ వ్యాపారి నుంచి ఏకంగా రూ.11 కోట్లు లూటీ చేసింది. ఘరానా మోసానికి పాల్పడిన ఈ కి ‘లేడీ’ని పోలీసులు కటకటాలకు తరలించారు. ఈ ఘటన హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రుతి సిన్హా అనే యువతి పూర్తిగా జల్సాలకు బానిసగా మారింది. కూర్చొని మనీ సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కడం ప్రారంభించింది. ఈ ప్రాసెస్ లో ఏకంగా ఐఏఎస్ అధికారిగా అవతారమెత్తేసింది. బాగా డబ్బులున్న వీరారెడ్డి అనే వ్యాపారిపై కన్నేసింది.  
ఆ వ్యాపారికి అచ్చిక బుచ్చిక చెప్పి అతడిని మంచిగా మచ్చిక కూడా చేసుకుంది. మాయ మాటలు చెప్పి అతడిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికింది. శ్రుతి మాయ మాటల్లో పూర్తిగా మునిగిన ఆ వ్యాపారి.. అప్పటి నుంచి శ్రుతికి అడిగినంత డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకునే అమ్మాయే కదా అని వీరారెడ్డి శ్రుతి అడిగినంత డబ్బులు ఇచ్చేవాడు. అతడి నుంచి శ్రుతి ఏకంగా రూ. 11 కోట్లనే కాజేసింది పెళ్లి పేరుతో. ఇక తనకు కావాల్సిన డబ్బు చేతికొచ్చిన శ్రుతి అసలు రూపం మెల్లిమెల్లిగా బయట పెట్టసాగింది. ఆమె ప్రవర్తనతో విషయం అర్థం చేసుకున్న వీరారెడ్డి పెళ్లి పేరుతో నిలువునా మోసపోయానని లబోదిబో మని గుండెలు బాదుకున్నాడు.

ఇక వెంటనే ఆలస్యం చెయ్యకుండా పోలీసులను ఆశ్రయించి తన గోడును వెల్లబోసుకున్నాడు. బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకున్న బాచుపల్లి పోలీసులు వెంటనే రంగంలోకి దూకారు. ఈ దారుణం పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగ వంతం చేసి.. ఆ కిలేడీని అరెస్టు చేశారు. ఇక శ్రుతి కి సహకరించిన మరో ముగ్గురిని కూడా ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. కాగా శుత్రి నుంచి బాచుపల్లి పోలీసులు కోట్ల విలువ చేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.6 కోట్ల విలువైన ఆస్తులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, విల్లా, ఖరీదైన కార్లను కూడా శ్రుతి నుంచి స్వాధీనం చేసుకున్నారు.


చంద్రబాబుకి నిద్ర లేకుండా చేసిన జనసేన

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>