MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/thaman087c3e88-e4f4-476c-8385-22c86dd2803c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/thaman087c3e88-e4f4-476c-8385-22c86dd2803c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న తమన్ 2020 లో ఎంత పెద్ద మ్యూజికల్ హిట్ లు అందించాడో అందరికి తెలిసిందే.. సంక్రాంతికి రిలీజ్ అయిన అల వైకుంఠపురం సినిమా పాటలు ఎవర్ గ్రీన్ హిట్లుగా మిగిలిపోగా ఆ సినిమా తో తమన్ కి ఎప్పుడు రాని పేరొచ్చింది. మొదట్లో కాపీ ట్యూన్ లని ఆరోపణలొచ్చినా ఆ ముద్ర నుంచి బయటకి వచ్చి తమన్ ఇప్పుడు నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుడు అందరి హీరోలకు తమనే కావాలి. thaman;prasad;thaman s;tollywood;cinema;2020;director;kusuma jagadish;tuck jagdish;ala vaikuntapuramlo;tuck jagadishమళ్ళీ బుక్ అయిన తమన్.. టక్ జగదీష్ లో కాపీ ట్యూన్..?మళ్ళీ బుక్ అయిన తమన్.. టక్ జగదీష్ లో కాపీ ట్యూన్..?thaman;prasad;thaman s;tollywood;cinema;2020;director;kusuma jagadish;tuck jagdish;ala vaikuntapuramlo;tuck jagadishWed, 24 Feb 2021 16:47:00 GMTటాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న తమన్ 2020 లో ఎంత పెద్ద మ్యూజికల్ హిట్ లు అందించాడో అందరికి తెలిసిందే.. సంక్రాంతికి రిలీజ్ అయిన అల వైకుంఠపురం సినిమా పాటలు ఎవర్ గ్రీన్ హిట్లుగా మిగిలిపోగా ఆ సినిమా తో తమన్ కి ఎప్పుడు రాని పేరొచ్చింది.  మొదట్లో కాపీ ట్యూన్ లని ఆరోపణలొచ్చినా ఆ ముద్ర నుంచి బయటకి వచ్చి తమన్ ఇప్పుడు నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుడు అందరి హీరోలకు తమనే కావాలి.

ఒక్కసారి గా తన మ్యూజిక్ తో ఇప్పుడున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లందరిని దాటేసిపోయాడు..  తమన్ ఉంటే సినిమా సూపర్ హిట్ అయినట్లే అన్న పరిస్థితి వచ్చేసింది.ఒకప్పుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ సిచువేషన్ లో ఉండేవాడు కానీ తమన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పటినుంచి పరిస్థితి మారిపోయింది.. ముఖ్యంగా అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ తర్వాత తమన్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం పెద్ద పెద్ద హీరోలు చేసే అన్ని సినిమాలు కూడా తమన్ చేతిలోనే ఉన్నాయి.

అయితే కాపీ క్యాట్ అని పిలిపించుకోవ‌డం ఎవ‌రికీ ఇష్టం ఉండ‌దు. కానీ త‌మ‌న్‌పై ప‌దే ప‌దే ఆ ముద్ర ప‌డిపోతోంది.  తాజాగా.. మ‌రోసారి త‌మ‌న్ కాపీ ట్యూన్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. మంగ‌ళ‌వారం `ట‌క్ జ‌గ‌దీష్‌` టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్లో ఈ సారి పాట వినిపించారు. `నిన్ను చూసి నిక‌రంగా రొమ్ము విరుచు కున్నాది` అనే పాట బ్యాక్ గ్రౌండ్ లో సాగింది. ఈ పాట చూస్తుంటే..`అల వైకుంఠ‌పుర‌ములో`... `సిత్త‌రాల సిర‌ప‌డు.. ` పాట గుర్తుకొస్తుంది. టేకింగ్ కూడా అలానే సాగింది. దాంతో.. త‌న పాట‌ని తానే కాపీ కొట్టుకున్న‌ట్టైంది. ఈ టీజ‌ర్ పై, త‌మ‌న్ పై ఇప్పుడు బోలెడ‌న్ని సెటైర్లు ప‌డుతున్నాయి. త‌మ‌న్ ఇక మార‌డా..? అంటూ సోష‌ల్ మీడియాలో ఛ‌లోక్తులు విసురుకుంటున్నారు.  


ఈ సపోర్టింగ్ యాక్టర్స్ భర్తల గురించి మీకు తెలుసా..??

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>