PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-tdpe8f23f88-764b-4cf7-a5a0-6f288b1fb7bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-tdpe8f23f88-764b-4cf7-a5a0-6f288b1fb7bd-415x250-IndiaHerald.jpg2014లో 37 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లోనూ 13 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా మండ‌పేట‌లో జోగేశ్వ‌ర రావు జోరుకు ఎదురు లేదు. అయితే ఇప్పుడు అక్క‌డ డేరింగ్ లీడ‌ర్‌, అమ‌లాపురం వైసీపీ పార్లమెంట‌రీ పార్టీ అధ్య‌క్షుడు తోట త్రిమూర్తులు పార్టీ ఇన్ చార్జ్ గా ఉన్నారు. రామ‌చంద్రాపురం లో గ‌త ఎన్నిక‌ల‌లో పోటీ చేసి ఓడిన త్రిమూర్తులు వైసీపీలో చేరాక జ‌గ‌న్ ఆయ‌న‌కు అమ‌లాపురం పార్టీ ప‌గ్గాలు ఇవ్వ‌డంతో పాటు మండ‌పేట ప‌గ్గాలtdp jagan mohan reddy;andhra pradesh;2019;district;east;mla;letter;thota chandrasekhar;tdp;ycp;partyపుర పోరు: ఆ టీడీపీ జంపింగ్‌కు జ‌గ‌న్ పెట్టిన అగ్ని ప‌రీక్ష‌... తేడా వ‌స్తే ఇంటికే ?పుర పోరు: ఆ టీడీపీ జంపింగ్‌కు జ‌గ‌న్ పెట్టిన అగ్ని ప‌రీక్ష‌... తేడా వ‌స్తే ఇంటికే ?tdp jagan mohan reddy;andhra pradesh;2019;district;east;mla;letter;thota chandrasekhar;tdp;ycp;partyTue, 23 Feb 2021 09:56:00 GMTఏపీ మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో చాలా చోట్ల ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారాయి. ఈ క్ర‌మంలోనే తూర్పు గోదావ‌రి జిల్లా మండ‌పేట మునిసిప‌ల్ ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే ఆస‌క్తిగా మారింది. ఈ మునిసిపాలిటీ టీడీపీకి కంచుకోట‌. పైగా మండ‌పేట‌లో గ‌త మూడు సార్లు టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వ‌ర రావు వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న హ్యాట్రిక్ కొట్టేశారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు నాడు వైఎస్ టైంలో త‌ర్వాత 2014 మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ మండ‌పేట మునిసిపాల్టీలో టీడీపీ జెండాయే ఎగిరింది.

ఇక 2009 లో వైఎస్ ప్ర‌భంజ‌నంలో ఇక్క‌డ జోగేశ్వ‌ర‌రావు తొలిసారి భారీ మెజార్టీతో గెలిచారు. 2014లో 37 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లోనూ 13 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా మండ‌పేట‌లో జోగేశ్వ‌ర రావు జోరుకు ఎదురు లేదు. అయితే ఇప్పుడు అక్క‌డ డేరింగ్ లీడ‌ర్‌, అమ‌లాపురం వైసీపీ పార్లమెంట‌రీ పార్టీ అధ్య‌క్షుడు తోట త్రిమూర్తులు పార్టీ ఇన్ చార్జ్ గా ఉన్నారు.

రామ‌చంద్రాపురం లో గ‌త ఎన్నిక‌ల‌లో పోటీ చేసి ఓడిన త్రిమూర్తులు వైసీపీలో చేరాక జ‌గ‌న్ ఆయ‌న‌కు అమ‌లాపురం పార్టీ ప‌గ్గాలు ఇవ్వ‌డంతో పాటు మండ‌పేట ప‌గ్గాలు ఇచ్చారు. అయితే ఆయ‌న మ‌న‌సంతా రామంచంద్రాపురం మీదే ఉంది. అయితే మండ‌పేట మీద ఆయ‌న‌కు ఇప్ప‌ట‌కీ గ్రిప్ లేదు. తూర్పులో టీడీపీ గ‌ట్టి పోటీ ఇస్తుంద‌న్న అంచ‌నాలు ఉన్న మునిసిపాలిటీల్లో మండ‌పేట ఫ‌స్ట్ ప్లేసులో ఉంది. మ‌రీ ఇక్క‌డ గెల‌వ‌క పోతే త్రిమూర్తుల‌ను జ‌గ‌న్ సైడ్ చేసినా ఆశ్చ‌ర్య పోన‌క్క‌ర్లేదు. మ‌రి ఈ అగ్ని ప‌రీక్షలో ఆయ‌న గెలుస్తాడో ?  లేదో ?  చూడాలి.




నేడే కేబినేట్ భేటీ... ఏం జరుగుతుంది...?

మంత్రి పెద్దిరెడ్డికి మ‌రో కీల‌క ప‌ద‌వి

పుర పోరు: అక్క‌డ వైసీపీ వ‌ర్సెస్ జ‌నసేన‌.. టీడీపీ ఎక్క‌డ బాబు ?

ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?

ఎమ్మెల్యే రోజా ఉగ్రరూపం! ఐదుగురు నేతలపై వేటు

పుర పోరు: గుంటూరు మేయ‌ర్‌పై ఆ టీడీపీ కుటుంబం క‌న్ను ప‌డిందే ?

పాపం బన్నీ...కొరటాల సినిమాకి కూడా ఆ బాధలు తప్పవా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>