PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ettakelaku-schools-open-ayyayi-teachers-khusheena27c00ca9-878a-46d6-9f93-4c16cfc05846-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ettakelaku-schools-open-ayyayi-teachers-khusheena27c00ca9-878a-46d6-9f93-4c16cfc05846-415x250-IndiaHerald.jpgలాక్ డౌన్ తో మూతపడ్డ పాఠశాలలు ఇటీవలే తెరుచుకున్నాయి. ప్రస్తుతం 9, 10 తరగతులకు పాఠశాల మొదలవ్వగా బుధవారం నుండి 6,7,8 తరగతి విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభం కానున్నట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తరగతులు ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. మంగళవారం విద్యాశాఖ మంత్రి అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ...స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి బుధవారం 6,7,8 విద్యార్థులకు తరగతులు ప్రారంబించాలని వెల్లడించారు. schools;telangana;school;chief minister;december;director;minister;letter;local language;reddyరేపటి నుండి 6,7,8 విద్యార్థులకు తరగతులు..పేరెంట్స్ ఇష్టం ఉంటేనే.!రేపటి నుండి 6,7,8 విద్యార్థులకు తరగతులు..పేరెంట్స్ ఇష్టం ఉంటేనే.!schools;telangana;school;chief minister;december;director;minister;letter;local language;reddyTue, 23 Feb 2021 21:51:44 GMTలాక్ డౌన్ తో మూతపడ్డ పాఠశాలలు ఇటీవలే తెరుచుకున్నాయి. ప్రస్తుతం 9, 10 తరగతులకు పాఠశాల మొదలవ్వగా బుధవారం నుండి 6,7,8 తరగతి విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభం కానున్నట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తరగతులు ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. మంగళవారం విద్యాశాఖ మంత్రి అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ...స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి బుధవారం 6,7,8 విద్యార్థులకు  తరగతులు ప్రారంబించాలని వెల్లడించారు.  అయితే విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దని తల్లి తండ్రుల అనుమతి ఉంటేనే విద్యార్థులను తరగతులకు అనుమతించాలని చెప్పారు. అంతే కాకుండా పాఠశాలలో కోవిడ్ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని పాఠశాలల్లో సానిటైజేషన్ ప్రక్రియ చేపట్టబోతున్నట్టు మంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయంతో బుధవారం నుండి దాదాపు 17 లక్షల మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు .

 రాష్ట్రంలో ఉన్న 8,891 ప్రభుత్వ పాఠశాలలు...10,275 ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం కానున్నట్టు స్పష్టం చేశారు . తరగతుల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అంతే కాకుండా కరోనా మార్గదర్శకాలను పాటించడంలో రాజీ పడవద్దని అధికారులకు ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా షిఫ్ట్ పద్ధతిలో పాఠశాలను నడిపేందుకు అనుమతిస్తున్నట్టు చెప్పారు. ఇక ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్, డైరెక్టర్ దేవసేన, రమేష్, సత్యనారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇక డిసెంబర్ నుండి పాఠశాలలు లేఖ విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులను ఏర్పాటు చేసి పాఠాలు బోధిస్తున్నా అవి ఎంతవరకు విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయో అర్థం కావడంలేదు కావడంలేదు. కాబట్టి ప్రభుత్వ నిర్ణయానికి తల్లి తల్లి తండ్రులు ఒకే చెప్పి విద్యార్థులను పాఠశాలకు పంపే అవకాశం ఉంది . 


షాకింగ్ : బీజేపీ విష్ణు వర్ధన్ రెడ్డి మీద లైవ్ డిబేట్ లో చెప్పుతో దాడి !

దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>