PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/goaaa5047ab-c2ea-4760-8e3e-e335a65c1933-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/goaaa5047ab-c2ea-4760-8e3e-e335a65c1933-415x250-IndiaHerald.jpgఒక యువతి తన ప్రియుడితో కలిసి గోవా వెళ్ళింది. అయితే తాను గోవా వెళ్లి ప్రియుడితో ఎంజాయ్ చేసిన విషయం ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలియ కూడదని చేసిన ఒక పని ఇప్పుడు ఆమెను కటకటాల పాలు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ముంబై కి సంబంధించిన అంధేరి ప్రాంతానికి చెందిన సయ్యద్ అనే యువతి గత మూడేళ్లుగా దుబాయిలో ఉద్యోగం చేస్తోంది. మూడేళ్ళ తరువాత ఈ యువతి జనవరిలో సెలవుల మీద ముంబై వచ్చింది. సెలవులు పూర్తి చేసుకున్న అనంతరం ఫిబ్రవరి 19న దుబాయ్ వెళ్లేందుకు ముంబై ఎయిర్ పోర్ట్ చేరుకుంది. అయితే ఎయిర్ పోర్టులో ఆమgoa;goa;mumbai;india;police;january;court;february;cheque;dubaiప్రియుడితో గోవాలో ఎంజాయ్.. ఇంట్లో దొరక్కూడని చేసిన పనికి అరెస్టయింది !ప్రియుడితో గోవాలో ఎంజాయ్.. ఇంట్లో దొరక్కూడని చేసిన పనికి అరెస్టయింది !goa;goa;mumbai;india;police;january;court;february;cheque;dubaiTue, 23 Feb 2021 09:00:00 GMTఒక యువతి తన ప్రియుడితో కలిసి గోవా వెళ్ళింది. అయితే తాను గోవా వెళ్లి ప్రియుడితో ఎంజాయ్ చేసిన విషయం ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలియ కూడదని చేసిన ఒక పని ఇప్పుడు ఆమెను కటకటాల పాలు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ముంబై కి సంబంధించిన అంధేరి ప్రాంతానికి చెందిన సయ్యద్ అనే యువతి గత మూడేళ్లుగా దుబాయిలో ఉద్యోగం చేస్తోంది. మూడేళ్ళ తరువాత ఈ యువతి జనవరిలో సెలవుల మీద ముంబై వచ్చింది. సెలవులు పూర్తి చేసుకున్న అనంతరం ఫిబ్రవరి 19న దుబాయ్ వెళ్లేందుకు ముంబై ఎయిర్ పోర్ట్ చేరుకుంది. 


అయితే ఎయిర్ పోర్టులో ఆమె పాస్ పోర్ట్ చెక్ చేసిన అక్కడి అధికారులు ఆమె పాస్ పోర్ట్ లో తప్పుడు వివరాలు నమోదు అయినట్లు గుర్తించారు.  ఆమె భారత్ కు జనవరి 14 వ తేదీన వచ్చినట్లు రికార్డుల్లో నమోదయింది. కానీ పాస్ పోర్ట్ లో మాత్రం ఆమె జనవరి 20 వ తేదీన వచ్చినట్టు స్టాంప్ ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు దీని వెనుక ఏదో కుట్ర ఉందని భావించి సదరు యువతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ముందుగా పొంతనలేని సమాధానాలు చెప్పి ఎలా అయినా వారి నుంచి తప్పించుకోవాలని యువత ప్రయత్నం చేయడంతో అధికారులు పోలీసులను  పిలిపించారు. 


ఈ దెబ్బకు ఆమె నిజం చెప్పక తప్పలేదు. తన స్నేహితుడితో కలిసి తాను గోవా వెళ్లిన విషయాన్ని కుటుంబ సభ్యుల వద్ద దాచి పెట్టేందుకు ఒక నకిలీ రబ్బర్ స్టాంప్ తో పాస్ పోర్ట్ లో తప్పుగా వివరాలు నమోదు చేశానని ఒప్పుకుంది. ఇందులో ఇంకా ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశం లేదని కేవలం కుటుంబ సభ్యుల వద్ద విషయం దాచడానికి మాత్రమే ఇలా చేశానని అని చెప్పుకొచ్చింది. అయితే ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్న పోలీసులు యువతి మీద ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆమెకు  కోర్టు రిమాండ్ విధించింది.




కరోనా భయం.. మరోసారి లాక్ డౌన్ దిశగా ఆ రాష్ట్రం..?

ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?

ఎమ్మెల్యే రోజా ఉగ్రరూపం! ఐదుగురు నేతలపై వేటు

పుర పోరు: గుంటూరు మేయ‌ర్‌పై ఆ టీడీపీ కుటుంబం క‌న్ను ప‌డిందే ?

పాపం బన్నీ...కొరటాల సినిమాకి కూడా ఆ బాధలు తప్పవా ?

జగడ్డ: 6 నియోజకవర్గాల్లోచంద్రబాబు స్కోరు జీరో..

ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌పై కేసీఆర్ ర‌హ‌స్య స‌ర్వే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>