PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cbi-issues-notices-to-cms-nephews-wifefc842046-a913-4134-b71f-4bf991eceb3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cbi-issues-notices-to-cms-nephews-wifefc842046-a913-4134-b71f-4bf991eceb3e-415x250-IndiaHerald.jpg పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్‌ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఈ రెండు పార్టీలు నువ్వా..? నేనా..? అంటున్నాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం మరింత ముదిరింది. కేసుల పరంపర కొనసాగుతోంది. డ్రగ్స్‌ కేసులో బీజేపీ నేతలు అడ్డంగా బుక్కైతే.. ఇప్పుడు మమత మేనల్లుడే టార్గెట్‌గా సీబీఐ రంగంలోకి దిగింది. దీంతో కోల్‌ స్కాం కేసులో అభిషేక్‌ బెనర్జీ భార్య రుజురా బెనర్జీకి సీబీఐ నుంచి నోటీసులు వచ్చాయి. విచారణలో పాల్గొనాలని సీబీఐ ఆమెను ఆదేశించింది.cbi issues notices to cms nephews wife;mamata benerjee;benarjee;mamatha;bharatiya janata party;chief minister;cbi;wife;yuva;research and analysis wingముఖ్యమంత్రి మేనల్లుడి భార్యకు సీబీఐ నోటీసులు..!ముఖ్యమంత్రి మేనల్లుడి భార్యకు సీబీఐ నోటీసులు..!cbi issues notices to cms nephews wife;mamata benerjee;benarjee;mamatha;bharatiya janata party;chief minister;cbi;wife;yuva;research and analysis wingTue, 23 Feb 2021 20:00:00 GMTసీబీఐ ఎంట్రీ హాట్‌ టాపిక్‌గా మారింది. బీజేపీ యువ మోర్చా నేత డ్రగ్స్‌ కేసులో దొరకడం.. సంచలనంగా మారింది. ఈ కేసులో మరికొందరు బీజేపీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై రగడ సాగుతుండగానే.. మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ భార్యకు సీబీఐ నోటీసులు అందాయి.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్‌ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఈ రెండు పార్టీలు నువ్వా..? నేనా..? అంటున్నాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం మరింత ముదిరింది. కేసుల పరంపర కొనసాగుతోంది. డ్రగ్స్‌ కేసులో బీజేపీ నేతలు అడ్డంగా బుక్కైతే.. ఇప్పుడు మమత మేనల్లుడే టార్గెట్‌గా సీబీఐ రంగంలోకి దిగింది. దీంతో కోల్‌ స్కాం కేసులో అభిషేక్‌ బెనర్జీ భార్య రుజురా బెనర్జీకి సీబీఐ నుంచి నోటీసులు వచ్చాయి. విచారణలో పాల్గొనాలని సీబీఐ ఆమెను ఆదేశించింది.

బెంగాల్‌లో కోల్‌ మాఫియా.. అభిషేక్‌ బెనర్జీకి భారీ మొత్తంలో లంచాలు కుమ్మరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్దంగా అక్రమార్కులు యధేచ్చగా తవ్వుకుపోయి.. దాన్ని ఇతర దేశాల్లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అభిషేక్‌ బెనర్జీపై బీజేపీ మండిపడుతోంది. టీఎమ్‌సీ నేత వినయ్‌ మిశ్రా ద్వారా అభిషేక్‌ బెనర్జీకి లంచాలు చేరుతున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే వినయ్‌ మిశ్రా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.

బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పమేల గోస్వామి కొకైన్‌ తరలిస్తూ పట్టుబడ్డారు. అయితే ఈ కేసులో బీజేపీ సీనియర్‌ నేత కైలాష్‌ విజయ్‌ వర్గీయ అనుచరుడు రాకేష్‌సింగ్‌ పేరు తెరమీదికి వచ్చింది. అయితే ఇది జరిగిన మర్నాడే సీబీఐ నుంచి అభిషేక్‌ బెనర్జీ భార్యకు నోటీసులు రావడం హాట్‌ టాపిక్‌గా మారింది. గతేడాది నవంబర్‌లో సీబీఐ కేసు నమోదైతే.. తాజాగా నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

నోటీసులు వచ్చిన విషయాన్ని అభిషేక్‌ బెనర్జీ ధృవీకరించారు. చట్టం పట్ల తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇలాంటి చర్యలతో తమను బెదిరిద్దామని చూస్తే పొరపాటే అన్నారు. మొత్తంగా ఈ రెండు కేసులు ఇప్పుడు బెంగాల్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. 


అమరావతిపై జగన్ యూ టర్న్!

దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>