Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health-tipsc86e3fa1-f218-40f9-8da3-3eed1495d864-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health-tipsc86e3fa1-f218-40f9-8da3-3eed1495d864-415x250-IndiaHerald.jpgఅందంగా ఉన్న వాళ్ళని చూసి ఆహా ఏమి రంగు, ఏమి తేజస్సు అని అనుకుంటుంటాం. అలాంటి అందం మనకెందుకు ఉండకూడదని కొంతమంది ఎన్నో ప్రయత్నాలు, క్రీములు, ఫేస్ ప్యాక్ లు వాడినా కూడా గంగా కనబడడం లేదని బాధపడుతుంటారు. కానీ అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. ఈ చిట్కాలు వాడిన ఫలితం లేకపోగా వేరే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కారణం సమస్య మాత్రమే కాదు శరీరంలోనిది కూడా అని తెలుసుకోవాలి. అందంగా కనపడటానికి మేకప్ లు, పైపై రంగులు మాత్రమే కాకుండా అంతర్గతంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందంగా కనపడాలంటే health tips;ganga;apple;ganges;vitamin c;vitamin a;vitamin;makeupఈ పండ్లు తీసుకోవడం వల్ల, మెరిసే చర్మం మీ సొంతం...?ఈ పండ్లు తీసుకోవడం వల్ల, మెరిసే చర్మం మీ సొంతం...?health tips;ganga;apple;ganges;vitamin c;vitamin a;vitamin;makeupTue, 23 Feb 2021 03:00:00 GMTగంగా కనబడడం లేదని బాధపడుతుంటారు. కానీ అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. ఈ చిట్కాలు వాడిన ఫలితం లేకపోగా వేరే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కారణం సమస్య మాత్రమే కాదు శరీరంలోనిది కూడా అని తెలుసుకోవాలి. అందంగా కనపడటానికి మేకప్ లు, పైపై రంగులు మాత్రమే కాకుండా అంతర్గతంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందంగా కనపడాలంటే కొన్ని జ్యూస్ ను తీసుకోవడం చాలా మంచిది. మనకు అందుబాటులో ఉండే పండ్ల జ్యూస్ తీసుకోవడం వల్ల మన అందం పెరుగుతుంది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం...

 పండ్లు అన్నింటిలోకి చౌకగా దొరికే పండు జామ పండు. ఈ జామ చెట్లను ఇంటి  పెరట్లో కూడా పెంచుకోవచ్చు. జామకాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే జామకాయలు శరీరానికి  కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే జామపండు తినడం వల్ల కొన్ని అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు. అంతేకాకుండా చర్మం నిగారింపు గా రావడానికి జామపండు సహాయపడుతుంది.

 ఆపిల్ పండును రోజు తీసుకోవడం వల్ల  ఆరోగ్యానికి చాలా మంచిది. ఆపిల్ లో ఉండే గుణాలు చర్మాన్ని మెరిసే టట్లు చేస్తాయి. అలాగే అనారోగ్యాలు రాకుండా ఆపిల్ పండు కాపాడుతుంది. ఆపిల్ పండును జ్యూస్ రూపంలో అయినా తాగవచ్చు లేదా పండు మాత్రమేనా తినవచ్చు.

 టమాటాలను మిక్సీలో  వేసి జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్ లో కొంచెం ఉప్పు లేదా చక్కెర కలుపుకుని తాగడం వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి కావలసిన విటమిన్లు లభిస్తాయి. ఇంకా ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, చర్మాన్ని నిగారింపుగా  ఉంచుతుంది.

 క్యారెట్ ను చూడగానే ఎవరికైనా పచ్చిది తినాలనిపిస్తుంది. తినడానికి ఎంతో రుచిగా ఉండే ఈ క్యారెట్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిసే టట్లు చేస్తాయి. ఇంకా కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే క్యారెట్ను రోజూ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం మంచిది.

 బీట్ రూట్ ను జ్యూస్ చేసుకొని తాగడం వల్ల రక్తంలోని మలినాలను తొలగించడమే కాకుండా, ఎర్ర రక్త కణాలను పెంచడానికి, చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా లివర్ వ్యాధులకు, కిడ్నీ వ్యాధులకు మంచి మందులా పనిచేస్తుంది. చర్మాన్ని అందంగా కనబడేటట్లు చేస్తుంది.

 పుచ్చకాయను తీసుకోవడం వల్ల దాహం లేకుండా పోతుంది. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉండడం వల్ల శరీరానికి చలవ నివ్వడమే కాకుండా, అందాన్ని కూడా పెంచుతుంది. పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల చర్మం మరింత తేటగా కనిపిస్తుంది.


దర్శకుడు తేజ పరిచయం చేసిన నటీనటులు వెళ్లే?

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>