PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teachers-problemse0d68a28-8ba3-4c72-a118-ddbd1594c61d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teachers-problemse0d68a28-8ba3-4c72-a118-ddbd1594c61d-415x250-IndiaHerald.jpgస్కూళ్లు తెరిచారు.. మళ్లీ పాఠశాలలు కళకళలాడుతున్నాయి. కానీ.. ఆ పాఠశాలలకు ఆయువు పట్టయిన టీచర్ల జీవితాల్లో మాత్రం వెలుగులు కరవయ్యాయి. అయితే ఇది అన్ని పాఠశాలలకు వర్తించదు. ఇది ప్రైవేటు పాఠశాలల టీచర్ల జీవితాల్లోనే వెలుగులు కనిపించడం లేదు. కరోనా కొట్టిన దెబ్బ నుంచి విద్యారంగం ఇంకా కోలుకోలేక పోతోంది. కరోనా మహమ్మారి ప్రైవేటు టీచర్ల పాలిట పీడకలగా చెప్పుకోవచ్చు. కానీ.. ఆ పీడకల ప్రభావం ఇంకా తొలగిపోనేలేదు. కరోనా సమయంలో ప్రైవేటు పాఠశాలలు మూతబడ్డాయి. టీచర్లకు జీతాల్లేవు.. చేసేందుకు పని లేదు. కుటుంబాలను పోషteachers-problemsటీచర్ల వెతలు: ప్రైవేటు టీచర్లకు ఇంకెన్నాళ్లీ నరక యాతన..?టీచర్ల వెతలు: ప్రైవేటు టీచర్లకు ఇంకెన్నాళ్లీ నరక యాతన..?teachers-problemsTue, 23 Feb 2021 10:00:00 GMT
కరోనా సమయంలో ప్రైవేటు పాఠశాలలు మూతబడ్డాయి. టీచర్లకు జీతాల్లేవు.. చేసేందుకు పని లేదు. కుటుంబాలను పోషించేందుకు ఆధారం లేక ప్రైవేటు టీచర్లు అనుభవించిన నరక యాతన అంతా ఇంతా కాదు.. కరోనా ముందు వరకు రూ.18వేల వరకూ జీతం తీసుకున్న టీచర్లు కూడా కరోనా సమయంలో కూలి పనులకు వెళ్లాల్సి వచ్చింది. కొందరు ఉపాధి హామీ పనులు కూడా చేశారు. ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్లారు. నెల్లూరు పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు. కుటుంబ పోషణ నిమిత్తం నెల్లూరు ఆస్పత్రిలో కొవిడ్‌-19 రోగులకు సహాయకారిగా మారారు.

కరోనా రోగులకు భోజనాలు, ఆహార పదార్థాలను తీసుకువచ్చి అందించారు. టీచరుగా పాతిక వేల జీతం అందుకున్న ఆయన ఈ పని చేసి రూ.9 వేల వరకూ సంపాదించారు. చాలామంది టీచర్లది ఇదే పరిస్థితి. పిల్లల చదువులు, ఇంటి కోసం తీసుకున్న రుణం ఎలా తీర్చాలో తెలియక అల్లాడిపోతున్నారు. కొందరు ఉదయం కూరగాయల అమ్మారు. మరికొందరు ఇంటి వద్దనే కిరాణ దుకాణం నిర్వహించుకున్నారు. ఇంకొందరు మిర్చిలు, మైసూరు బజ్జీలు కూడా వేశారు.

పోనీ.. ఇప్పుడు కరోనా తగ్గింది కదా.. ఇప్పుడైనా పరిస్థితులు బాగున్నాయా.. అంటే అదీ లేదు. పాఠశాలలు ప్రారంభమైనా.. అనేక కారణాలతో జీతాలు మాత్రం ఇవ్వడం లేదు. ఇచ్చిన చోట అరాకొరా ఇస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లీ నరక యాతన అంటున్న ప్రైవేటు టీచర్ల గోస మాత్రం పట్టించుకునే వారే కనిపించడం లేదు.




మీ ఫ్రస్ట్రేషన్ తీర్చే గది.. మీరు విధ్వంసం సృష్టించొచ్చు

మంత్రి పెద్దిరెడ్డికి మ‌రో కీల‌క ప‌ద‌వి

పుర పోరు: అక్క‌డ వైసీపీ వ‌ర్సెస్ జ‌నసేన‌.. టీడీపీ ఎక్క‌డ బాబు ?

ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?

ఎమ్మెల్యే రోజా ఉగ్రరూపం! ఐదుగురు నేతలపై వేటు

పుర పోరు: గుంటూరు మేయ‌ర్‌పై ఆ టీడీపీ కుటుంబం క‌న్ను ప‌డిందే ?

పాపం బన్నీ...కొరటాల సినిమాకి కూడా ఆ బాధలు తప్పవా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>