PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/central027ebf62-0eff-4c70-8b9e-cceb7c8f2ab2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/central027ebf62-0eff-4c70-8b9e-cceb7c8f2ab2-415x250-IndiaHerald.jpgప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్ర ప్రజలు బార‌తీయ జ‌న‌తాపార్టీకి ఓటేయ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ అంటున్నారు. సోమ‌వారం హౌరాలో జ‌రిగిన బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొన్న మోడీ తృణ‌మూల్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల దాడికి దిగారు. త‌మ ప్ర‌భుత్వం ఏం చేయాల‌నుకుంటుందో, ఏం చేయ‌బోతుందో, గ‌త ప్ర‌భుత్వాలు ఏం చేయ‌లేదో చిట్టావిప్పారు. మార్పు అనేది ఇక్క‌డి ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌నేది త‌న‌కు స్ప‌ష్టంగా అర్థ‌మైంద‌ని చెబుతున్నారు. central;modi;tara;west bengal - kolkata;central governmentతూర్పు తిరిగి దండం పెట్టండితూర్పు తిరిగి దండం పెట్టండిcentral;modi;tara;west bengal - kolkata;central governmentTue, 23 Feb 2021 08:13:12 GMTప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్ర ప్రజలు బార‌తీయ జ‌న‌తాపార్టీకి ఓటేయ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ అంటున్నారు. సోమ‌వారం హౌరాలో జ‌రిగిన బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొన్న మోడీ తృణ‌మూల్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల దాడికి దిగారు. త‌మ ప్ర‌భుత్వం ఏం చేయాల‌నుకుంటుందో, ఏం చేయ‌బోతుందో, గ‌త ప్ర‌భుత్వాలు ఏం చేయ‌లేదో చిట్టావిప్పారు. మార్పు అనేది ఇక్క‌డి ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌నేది త‌న‌కు స్ప‌ష్టంగా అర్థ‌మైంద‌ని చెబుతున్నారు. అంత‌వ‌ర‌కు బాగానేఉందికానీ స‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించిన స‌మ‌స్య‌ల‌కు, రాష్ట్ర ప్ర‌భుత్వానికి సంబంధం లేనివి. అవి కేంద్ర ప్ర‌భుత్వం మాత్ర‌మే ప‌రిష్క‌రించాల్సిన స‌మ‌స్య‌ల‌ను. వాటిని కూడా రాష్ట్ర ప్ర‌భుత్వంపై వేసేసి నెపం మొత్తం తృణ‌మూల్ పై నెట్టి చేతులు దులుపుకునే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారేమోన‌ని బెంగాల్ ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.

మార్పుకు బెంగాల్ ప్రజలు సంసిద్ధులుగా ఉన్నారన్న విషయం అర్థం చేసుకోండి అని  ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు. హౌరా ప్రాంతంలో రైల్వేకి సంబంధించిన అన్ని  మౌలిక సదుపాయాలను కల్పించడానికి త‌మ ప్ర‌భుత్వం  సిద్ధంగా ఉంద‌ని, ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంత ప్ర‌జ‌ల ఆర్థికాభివృద్ధికి తాము అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నామన్నారు. దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఇప్పటి వరకు ఇక్క‌డి ప్ర‌భుత్వాలు అలా చేయ‌లేద‌ని విమర్శించారు. రైల్వే శాఖ రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తుందా?  కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తుందా? అనే విష‌యం ఎవ‌రిని అడిగినా స్ప‌ష్టంగా చెబుతారు. 2014 నుంచి అధికారంలో ఉంటూ ప‌రిష్క‌రించాల్సిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌కుండా త‌మ‌కు అనుకూలంగా ఉండే ప్ర‌భుత్వాలు లేవ‌ని, త‌మ కూట‌మిలో లేని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల‌పై స‌వ‌తిప్రేమ చూపారంటూ ఇప్ప‌టికే ఎన్డీయేపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ప‌శ్చిమ బెంగాల్ రైల్వేకి సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ్యాస్ క‌నెక్ష‌న్లు ఇవ్వాల‌న్నా కేంద్రం, రాష్ట్రం స‌మ‌న్వ‌యం చేసుకొని ముందుకు వెల్లాలి. కానీ కేంద్ర ప్ర‌భుత్వంకానీ, రాష్ట్ర ప్ర‌భుత్వంకానీ కీచులాడుకున్నారేకానీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టిపెట్ట‌లేదు.


బెంగాల్‌కు కావల్సిన  నిధులు కూడా విడుదల చేస్తున్నామ‌ని ప్ర‌ధాన‌మంత్రి ప్రకటించారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయికాబ‌ట్టి అభివృద్ది ప‌నులు చేసి ఓట్లు కొల్ల‌గొట్టాల‌నే ఆలోచ‌న‌తో ఇలా చేస్తున్నార‌ని, ఇన్ని సంవ‌త్స‌రాల నుంచి ఎందుకు నిధులు విడుద‌ల చేయ‌లేద‌ని అక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. కేంద్రం ప్రకటించిన పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని,  పేదలకు, రైతులకు కేంద్రం నేరుగా వారి వారి అకౌంట్లలోకే డబ్బులు వేస్తోందని, అయితే ఈ డబ్బులు ప్రజలకు చేరడం లేదని ప్ర‌ధాని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యం కేంద్రం దృష్టికి వ‌చ్చిన‌ప్పుడు త‌మ ప‌థ‌కాలను నేరుగా ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌కు తీసుకువెళ్లే బాధ్య‌త వారే తీసుకుంటే బాగుండేద‌ని, ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న‌వేళ లోపాలు ఎత్తిచూప‌కుండా ఏం చేయ‌గ‌ల‌ర‌నేది చెబితే బాగుంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.


నాగార్జున సాగ‌ర్‌లో జానారెడ్డే కింగ్‌.... ఎందుకంటే కార‌ణాలివే...

జగడ్డ: 6 నియోజకవర్గాల్లోచంద్రబాబు స్కోరు జీరో..

ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌పై కేసీఆర్ ర‌హ‌స్య స‌ర్వే...

ఎడిటోరియల్: డెమాక్రసి రెండు రకాలు - రాజ్యాంగం రెండు రకాలు - గెలుపు రెండు రకాలు: టీడీపీ జాతీయ కార్యదర్శి ట్వీటేష్ నారా!

హెరాల్డ్ స్మ‌రామీ : బ‌్రహ్మ‌మొక్క‌టేన‌న్న పదకవితా పితామహుడు అన్న‌మ‌య్య‌...

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు ఏమైందబ్బా ? ఏమీటీ మాటలు ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తెలంగాణా పై షర్మిల వ్యూహాత్మక నిర్ణయం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>