PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/disha-ravi-gets-relief-in-tool-kit-case248d8506-fad9-472c-9863-7a0da066f005-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/disha-ravi-gets-relief-in-tool-kit-case248d8506-fad9-472c-9863-7a0da066f005-415x250-IndiaHerald.jpgటూల్ కిట్ కేసులో దిశారవికి ఢిల్లీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై ఆమెకు బెయిల్ లభించింది. ఖలిస్థాన్ అనుకూల గ్రూప్.. పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ ద్వారా ఆమె భారత వ్యతిరేక ప్రచారానికి పూనుకొందని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. దిశా రవి.. టూల్ కిట్.. ఈ రెండు పేర్లూ... మన చట్టాలని, పోలీసు వ్యవస్థని అవహేళన చేస్తున్నాయి. ఎలాంటి సాక్ష్యాలూ, ఆధారాలూ లేకుండా ఓ ఇరవై ఏళ్ళ అమ్మాయిని అరెస్టు చేసిన పోలీసులు.. అసలు ఆధారాలు లేకపోవడం కూడా ఆమె తప్పే అంటున్నారు. disha ravi gets relief in tool kit case;maya;naga chaitanya;ravi anchor;delhi;whatsapp;police;media;court;bengaluru 1;girl;chaitanya 1టూల్ కిట్ కేసులో దిశా రవికి ఊరట..!టూల్ కిట్ కేసులో దిశా రవికి ఊరట..!disha ravi gets relief in tool kit case;maya;naga chaitanya;ravi anchor;delhi;whatsapp;police;media;court;bengaluru 1;girl;chaitanya 1Tue, 23 Feb 2021 19:00:00 GMTఢిల్లీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై ఆమెకు బెయిల్ లభించింది. ఖలిస్థాన్ అనుకూల గ్రూప్.. పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ ద్వారా ఆమె భారత వ్యతిరేక ప్రచారానికి పూనుకొందని  ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. దిశా రవి.. టూల్ కిట్.. ఈ రెండు పేర్లూ... మన చట్టాలని, పోలీసు వ్యవస్థని అవహేళన చేస్తున్నాయి. ఎలాంటి సాక్ష్యాలూ, ఆధారాలూ లేకుండా ఓ ఇరవై ఏళ్ళ అమ్మాయిని అరెస్టు చేసిన పోలీసులు.. అసలు ఆధారాలు లేకపోవడం కూడా ఆమె తప్పే అంటున్నారు.

దిశారవి.. బెంగళూరులో చదువుకుంటున్న అమ్మాయి. దేశంలో జరుగుతున్న అన్యాయాలకు, అరాచకాలకు స్పందించే చైతన్యం ఉన్న అమ్మాయి. పుస్తకాల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజంలో ఆచరణలో పెట్టాలనుకున్న అమ్మాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది రైతులు చేస్తున్న ఉద్యమం ఈ అమ్మాయిని కూడా కదిలించింది. ఈ ఉద్యమానికి ఎలా సాయపడాలి.. సోషల్ మీడియా తోపాటు ఇతరత్రా వేదికలపై ఎలా విస్తరించాలి.. అనే అంశాలకు సంబంధించిన ఒక పోస్టుని దిశా రవి సోషల్ మీడియాలలో  షేర్ చేసింది. ఇదే ఇప్పుడు పోలీసులు గోరంతలు కొండంతలు చేస్తున్న టూల్ కిట్.. అసలు టూల్ కిట్ అనే పదమే ఒక దేశద్రోహంగా పోలీసులు చిత్రీకరిస్తున్నారు.

అనేక రంగాల్లో తమ భావాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన పద్ధతి మీద రాసుకున్న రాతలే... ఈ టూల్ కిట్. ఇందులో దేశద్రోహమూ లేదు.. అసలు ఆ అమ్మాయికి వేరే ఏ ఇతర రాజకీయ పార్టీలతో, సంఘాలతో సంబంధమూ లేదు. కానీ, అధికారంలో ఉన్న వారిని సంతృప్తి పెట్టడానికి పోలీసులు ఈ అమ్మాయిని అరెస్టు చేశారు. దీనిపై ఇప్పుడు దేశంలో బుర్ర ఉన్న ప్రతి వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ సాక్ష్యం లేకుండా అరెస్టు చేయడమే కాక, మూడు రోజులు తమ కస్టడీలో ఉంచుకుని కూడా పోలీసులు ఏ సాక్ష్యాన్ని సంపాదించలేదు. అయినా, కస్టడీని పొడిగించాలంటూ మళ్లీ కోర్టుకెళ్ళారు పోలీసులు. మరి సాక్ష్యాల మాటేంటని కోర్టు అడిగింది. దానికి పోలీసులు చెప్పిన సమాధానం ఇంకా విడ్డూరంగా వుంది.

సాక్ష్యాలు దొరకలేదని, దానికి కూడా కారణం ఆ అమ్మాయే అని అంటున్నారు... పోలీసులు. తనకి ఖలిస్తాన్ ఉద్యమకారులతో సంబంధాలున్నాయని బుకాయిస్తున్న పోలీసులు.. అందుకు ఆధారాలు మాత్రం చూపించలేదు. ఆ ఆధారాలన్నీ దిశ మాయం చేసిందంటున్నారు. పైగా సాక్ష్యాలు లేకుండా చేసిందంటే, ఆ అమ్మాయి ఎంతటి చేయి తిరిగిన నేరస్తురాలో అర్థం చేసుకోవాలని కోర్టుకే ఉచిత సలహాలు ఇస్తున్నారు. దిశ ఫోన్‌లో నేరమయమైన వాట్సప్ సందేశాలు, ఈ-మెయిల్స్‌ను డిలీట్ చేసిందంట. ఆమె దగ్గర దొరకకపోతే, అవి ఆమె డిలీట్ చేసినట్టే అని తీర్మానించుకున్న పోలీసులు.. డిలీట్ చేసింది కాబట్టి.. ఆమె నేరస్తురాలే అని విచిత్రమైన సిద్ధాంతాన్ని కోర్టు ముందు పెట్టారు. 


పదివేలు మీతో ఉంటే లక్షలు లాభం వస్తుంది.. ఎలాగంటే?

దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>