SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/annamayya4b099eb3-3cc4-4f1b-93af-aa0f04d9dd22-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/annamayya4b099eb3-3cc4-4f1b-93af-aa0f04d9dd22-415x250-IndiaHerald.jpgవేదాదుల నుండి ఆగమాల వరకు విస్తరించిన భక్తి సామ్రాజ్యానికి పదకవితా పితామహుడు అన్నమాచార్యులవారి కీర్తనలే నిలయాలు. శ్రీవేంకటాచలపతి కీర్తనలతో జీవితాన్ని ధన్యం చేసుకున్న పుణ్యచరితుడాయన!”సమసమాజ నిర్మాణం కోసం సంఘ సంస్కరణ భావాలతో సాంఘిక ప్రయోజనాన్ని ఆశించిన అన్నమయ్య, తన ఆస్తినంతా వెంకన్నకు దానం చేశాడు. “బ్రహ్మ మొక్కటే, పరబ్రహ్మ మొక్కటే" అన్న సత్యాన్ని అందరికీ తెలియజేసి, “మెండయిన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే, చండాలుడుండేటి సరిభూమి యొకటే” అన్న సమతావాదాన్ని శాశ్వతంగా చరిత్రపుటల్లో లిఖించిన ఈ దివ్యసామ్యవాద annamayya;bhavana;geetha;jeevitha rajaseskhar;tiru;karnataka - bengaluru;sangeetha;tirupati;village;music;manam;thyagayya;petta;annamayya;tyagayya;rajampetహెరాల్డ్ స్మ‌రామీ : బ‌్రహ్మ‌మొక్క‌టేన‌న్న పదకవితా పితామహుడు అన్న‌మ‌య్య‌...హెరాల్డ్ స్మ‌రామీ : బ‌్రహ్మ‌మొక్క‌టేన‌న్న పదకవితా పితామహుడు అన్న‌మ‌య్య‌...annamayya;bhavana;geetha;jeevitha rajaseskhar;tiru;karnataka - bengaluru;sangeetha;tirupati;village;music;manam;thyagayya;petta;annamayya;tyagayya;rajampetTue, 23 Feb 2021 06:30:00 GMTఅన్నమయ్య, తన ఆస్తినంతా వెంకన్నకు దానం చేశాడు. “బ్రహ్మ మొక్కటే, పరబ్రహ్మ మొక్కటే" అన్న సత్యాన్ని అందరికీ తెలియజేసి, “మెండయిన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే, చండాలుడుండేటి సరిభూమి యొకటే” అన్న సమతావాదాన్ని శాశ్వతంగా చరిత్రపుటల్లో లిఖించిన ఈ దివ్యసామ్యవాద సిద్ధాంతకర్త మనందరికీ ముక్తిమార్గం చూపాడు.  


ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏదీలేదని, ఈ నిజాన్నీ తెలుసుకుంటే నీకు సంతోషం కల్గిస్తుందన్న ప్రతి విషయం ఎంత భయంకరమైందో గుర్తించగల్గుతారని ఆయన అంటాడు. జీవితం క్షణికమైందని, ఒక ఆకులాగా, పండి రాలిపోతుందని అన్నమయ్య ప్రభోదిస్తాడు. ఇంతటి దానికి ఈ స్వార్దపూరిత చింతన ఎందుకని ప్రశ్నిస్తూ, దైవచింతనలో కాలంగడపమని సందేశమిస్తాడాయన. భగవంతుడు ఒక్కడే శాశ్వత నిజం అని ఆయన అంటాడు. అలాగే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వాలని ఒంటరిగా పనిలేనివాడు సాదించేది ఏమి ఉండదని సంభొదిస్తాడాయన. ప్రస్తుత పరిస్తితిలో అన్నమయ్య పదవికవితలు ఎంతో అవసరం.


కర్ణాటక సంగీతంలో 32 వేల కృతులను అన్నమాచార్య విరచించి ఆలపించాడు. ఈ కీర్తనలలో చాలా వరకూ రాగి ఫలకాలపై చెక్కారు. ఇప్పటికీ ఈ ఫలకాలు తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉన్నాయి. అలాంటి మహనీయుడు కడపజిల్లా రాజంపేట తాలూక తాళ్ళపాక గ్రామంలో క్రీ.శ.1408లో లక్కమాంబ, నారాయణసూరులకు పుణ్య ఫలంగా, ఏడుకొండలవాని వరప్రసాదంగా జన్మించాడు. అన్నమయ్య 95 ఏళ్లు జీవించారని చారిత్రాక‌కారులు చెబుతున్నదాన్ని బ‌ట్టి తెలుస్తోంది. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. 


ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?

బ్రేకింగ్‌: లోక్‌స‌భ ఎంపీ ఆత్మ‌హ‌త్య‌... హోట‌ల్లోనే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>