PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/komatireddy-venkat-reddy-rajgopal-reddy9bc9bbcf-cca1-433f-a2cf-64b2ea85b064-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/komatireddy-venkat-reddy-rajgopal-reddy9bc9bbcf-cca1-433f-a2cf-64b2ea85b064-415x250-IndiaHerald.jpgబీజేపీలో చేరడమే కాదు రాజగోపాల్ రెడ్డిపై గత వారం రోజులుగా మరో ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయాలని చూస్తున్నారని కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయిkomatireddy venkat reddy rajgopal reddy;nagarjuna akkineni;tiru;bharatiya janata party;komatireddy rajgopal reddy;telangana;congress;రాజీనామా;nalgonda;mla;reddyకోమటిరెడ్డి యూ టర్న్ !కోమటిరెడ్డి యూ టర్న్ !komatireddy venkat reddy rajgopal reddy;nagarjuna akkineni;tiru;bharatiya janata party;komatireddy rajgopal reddy;telangana;congress;రాజీనామా;nalgonda;mla;reddyTue, 23 Feb 2021 08:51:33 GMTతెలంగాణ కాంగ్రెస్ లో ఆ లీడర్స్  చాలా పవర్ ఫుల్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ బ్రదర్స్ దే హవా. కోమటిరెడ్డి సోదరులది కాంగ్రెస్ లో ప్రత్యేకమైన పాత్ర. అయితే కొంత కాలంగా కోమటిరెడ్డిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. పలు సార్లు బీజేపీకి అనుకూలంగా, కాంగ్రెస్ ను విమర్శిస్తూ రాజగోపాల్ రెడ్డి మాట్లాడటంతో ఆయన కమలం గూటికి చేరడం ఖాయమనుకున్నారు. ఇటీవల తిరుమలలో కూడా బీజేపీను ప్రశంసిస్తూ మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి. దీంతో బీజేపీలో చేరేందుకు ఆయన ముహుర్తం కూడా సిద్ధం చేసుకున్నారని చర్చ జరిగింది.

                  బీజేపీలో చేరడమే కాదు రాజగోపాల్ రెడ్డిపై గత వారం రోజులుగా మరో ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయాలని చూస్తున్నారని కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. నాగార్జున సాగర్ లో గెలవడంతో పాటు.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడుకు ఉప ఎన్నిక తెచ్చి.. అక్కడ గెలిచి అధికార పార్టీకి షాకివ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తుందని కథనాలు వచ్చాయి. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం నల్గొండ జిల్లాలో సంచలనంగా మారింది.
 
          అయితే తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు  కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదనిస్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీ అభ్యర్థిగా సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నానంటూ ఓ పత్రికలో వచ్చిన న్యూస్ చూసి ఆశ్చర్య పోయానని చెప్పారు. గతంలో తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడిన మాట వాస్తవమేనని..  ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ను వీడబోనని తెలిపారు. మునుగోడు ప్రజల రుణం తీర్చుకోవడమే తన కర్తవ్యమని వ్యాఖ్యానించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.




రెండో వివాహంపై క్లారిటీ

ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?

ఎమ్మెల్యే రోజా ఉగ్రరూపం! ఐదుగురు నేతలపై వేటు

పుర పోరు: గుంటూరు మేయ‌ర్‌పై ఆ టీడీపీ కుటుంబం క‌న్ను ప‌డిందే ?

పాపం బన్నీ...కొరటాల సినిమాకి కూడా ఆ బాధలు తప్పవా ?

జగడ్డ: 6 నియోజకవర్గాల్లోచంద్రబాబు స్కోరు జీరో..

ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌పై కేసీఆర్ ర‌హ‌స్య స‌ర్వే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>