MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh-nandi-theatrical-rights-3249f044-a099-472b-8a58-bd0fb960e74e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh-nandi-theatrical-rights-3249f044-a099-472b-8a58-bd0fb960e74e-415x250-IndiaHerald.jpgదివంగత ప్రఖ్యాత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చిన్న తనయుడు అల్లరి నరేష్ తొలిసారిగా రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అల్లరి మూవీ ద్వారా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే సూపర్ హిట్ తో పాటు నటుడిగా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు సంపాదించిన నరేష్ ఆ తర్వాత నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగారు. ఆపై కామెడీ స్టార్ గా ఎన్నో మంచి చిత్రాల సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుని మరింత మంచి క్రేజ్ దక్కించుకున్న అల్లరినరేష్ లేటెస్ట్ గా నటించిన సినిమా నాంది. naandhi movie;allari naresh;naresh;kumaar;allari naresh;maharshi;sarath kumar;sathish;sharath;sricharan pakala;surya sivakumar;varalaxmi sarathkumar;vijay;tollywood;cinema;satish vegesna;maharshi 1;audience;comedy;success;joseph vijay;yuva;nijam;sharrath marar1;allari;anandamనిజంగా అరుపులే .... అదరగొట్టావ్ పో ....??నిజంగా అరుపులే .... అదరగొట్టావ్ పో ....??naandhi movie;allari naresh;naresh;kumaar;allari naresh;maharshi;sarath kumar;sathish;sharath;sricharan pakala;surya sivakumar;varalaxmi sarathkumar;vijay;tollywood;cinema;satish vegesna;maharshi 1;audience;comedy;success;joseph vijay;yuva;nijam;sharrath marar1;allari;anandamTue, 23 Feb 2021 21:07:34 GMTఅల్లరి నరేష్ తొలిసారిగా రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అల్లరి మూవీ ద్వారా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే సూపర్ హిట్ తో పాటు నటుడిగా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు సంపాదించిన నరేష్ ఆ తర్వాత నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగారు. ఆపై కామెడీ స్టార్ గా ఎన్నో మంచి చిత్రాల సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుని మరింత మంచి క్రేజ్ దక్కించుకున్న అల్లరినరేష్ లేటెస్ట్ గా నటించిన సినిమా నాంది.

మంచి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా యువ దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో సతీష్ వేగేశ్న నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో నడుస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ముఖ్య పాత్రలో కనిపించిన ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించగా సిద్ ఫోటోగ్రఫీ అందించారు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ నటనకు ఆడియన్స్ తో పాటు పలువురు సినిమా ప్రముఖులు నుంచి కూడా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎక్కువగా కామెడీ సినిమాల్లో నటించి ఆడియెన్స్ ను అలరించిన నరేష్ గతంలో తన కెరీర్ లో నటించిన గమ్యం, నేను, మహర్షి  సినిమాల ద్వారా తనలోని మరొక కోణాన్ని కూడా ఆవిష్కరించి అలరించారు.

అయితే వాటన్నిటినీ మించే విధంగా నాంది లో అల్లరి నరేష్ పోషించిన సూర్య ప్రకాష్ పాత్రకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుతున్నాయి. ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన సుడిగాడు సినిమా సూపర్ హిట్ తర్వాత మళ్ళి ప్రస్తుతం నాంది రూపంలో హిట్ రావడం నిజంగా ఎంతో ఆనందంగా ఉందని ఇకపై తన నుంచి తప్పకుండా ఆడియన్స్ తో పాటు అభిమానులని కూడా అలరించేలా మంచి చిత్రాలు వస్తాయని, మా సినిమాని ఎంతో ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు ఈ మూవీ సక్సెస్ మీట్ లో భాగంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అల్లరి నరేష్.....!!


వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటే ఆధార్ ఉన్నట్టే... ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్

దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>