PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rebels-are-ready-to-defeat-original-candidates-b64fd892-a4db-453a-a4b1-0f7e8af38475-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rebels-are-ready-to-defeat-original-candidates-b64fd892-a4db-453a-a4b1-0f7e8af38475-415x250-IndiaHerald.jpgవారి పేరే రెబెల్స్. అభ్యర్ధుల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగించేస్తున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆశావహులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. అభ్యర్ధులను కూడా ఉన్నఫళంగా సెలెక్ట్ చేశారు. దీంతో కొందరికి అన్యాయం జరిగింది. ఈ నేపధ్యంలో కడుపు మండిన వారు రెబెల్స్ అయ్యారు. వారు కూడా అధికారిక అభ్యర్ధులకు ధీటుగా ఇపుడు ప్రచారం చేస్తూండడంతో అసలైన వారి గుండెల్లో కలవరం రేగుతోంది. rebels;kumaar;korea, south;ganesh kumar vasupalli;vishakapatnam;mla;tdp;ycp;dookudu;partyపుర పోరు : విశాఖలో రెబెల్స్... పార్టీలకు షాక్...?పుర పోరు : విశాఖలో రెబెల్స్... పార్టీలకు షాక్...?rebels;kumaar;korea, south;ganesh kumar vasupalli;vishakapatnam;mla;tdp;ycp;dookudu;partyTue, 23 Feb 2021 13:36:48 GMT
విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో రెబెల్స్ బెడత అన్ని పార్టీలకు ఉంది. అయితే అధికార వైసీపీకి ఈ బాధ ఇంకా ఎక్కువగా ఉంది. ఆ పార్టీ తరఫున ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో నాడు అందరికీ కూర్చోబెట్టి నచ్చచెప్పలేకపోయారు. ఇక ఏడాది అయినా కూడా వారిని దారికి తెచ్చే పనిని పార్టీ పెద్దలు ఎవరూ చేపట్టలేదు. సడెన్ గా మునిసిపల్ ఎన్నికలు వచ్చేశాయి. దాంతో రెబెల్స్ తాము ఎవరికీ తీసిపోము అంటూ దూకుడుగానే ముందుకు సాగుతున్నారు.

ఈ పరిణామంతో మేయర్ పీఠం మీద ఆశలు పెట్టుకున్న వైసీపీకి ఎక్కువగా ఇబ్బంది ఎదురవుతుంది అంటున్నారు. విశాఖ సౌత్ లో ఇపుడు రెబెల్స్ చాలా జోరు చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ కి మద్దతుదారులుగా ఉన్న కొందరు రెబెల్స్ అవతారం ఎత్తడంతో అక్కడంతా మొత్తం గందరగోళంగా సీన్ తాయారైంది. విశాఖ సౌత్ లో 13 వార్డులు ఉన్నాయి. ఇక్కడ విజయావకాశాలు ఎమ్మెల్యే రాకతో అధికం అవుతాయని భావిస్తూంటే రెబెల్స్ రంగంలోకి దిగిపోవడంతో ఇపుడు వైసీపీకి కొత్త కంగారు మొదలైంది.

నాడు నామినేషన్లు పెద్ద ఎత్తున వేసిన వారంతా ఇపుడు ఎమ్మెల్యేను ఆశ్రయించి తమకే బీ ఫారం ఇవ్వమంటున్నారు. ఎమ్మెల్యే సైతం తన మద్దతుదారులే అధికార అభ్యర్ధులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో రెబెల్స్ చేత నామినేషన్ల ఉపసంహరణకు వైసీపీ పెద్దలు గట్టిగానే పనిచేయాల్సి ఉంటుంది అంటున్నారు. వారు ససేమిరా అంటే మాత్రం గట్టి షాక్ తప్పదు. ఇదే పరిస్థితి టీడీపీలో కూడా ఉంది. దాంతో ఈ రెండు పార్టీలు ఇరకాటంలో పడుతున్నాయి.






హైపర్ ఆదిలో ఇలాంటి కోణం కూడా ఉందా..?. సాయం చేస్తున్నాడా ? లేక సంపాదిస్తున్నాడా ?

ఎన్టీఆర్ తదుపరి సినిమా అదే... మిగతావన్నీ పుకార్లేనట !

ఈ 9 సినిమాలు వదిలేసి జూనియర్ ఎన్టీఆర్ తప్పు చేశాడా

పుర పోరు : విశాఖలో వైసీపీకి టఫ్ ఫైట్ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బెజ‌వాడ బ్రాహ్మ‌ణులు ఎటు ? వైసీపీలో సెగ..!

ఈ సినిమాలను శృతిహాసన్ వదిలేసి ఉండకపోతే ఆమె కెరీర్ మరోలా ఉండేది..?

ఇలా వారు అడ‌గ‌డం.. అలా బాబు త‌లూప‌డం.. ప‌రువు పోదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>