PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dogf8ffc9b2-19fd-4ff2-a100-297479d23be4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dogf8ffc9b2-19fd-4ff2-a100-297479d23be4-415x250-IndiaHerald.jpgప్రపంచంలో రోజుకో వింత ఘటన చూస్తుంటాము. సాధారణంగా ఒక్క బిడ్డకు ఆకలి వేస్తుందంటే మరో తల్లి పాలు ఇస్తుంది. ఎందుకంటే ఆ తల్లికి బిడ్డ ఆకలి తీర్చడమే ముఖ్యం. అలాగే ఆకలితో ఉన్న ఓ లేగ దూడను అక్కున చేర్చుకొని తన చనుపాలు పట్టి ఓ శునకం ఆ లేగ దూడ ఆకలి తీర్చుతోంది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో చోటు చేసుకుంది.dog;manu;prema;district;hushaaru;mandalam;love;cow slaughter;central government;dogs;adilabad;ee rojullo;v;fidaaమైమరిపిస్తున్న ప్రేమ: లేగ దూడకు పాలు ఇస్తున్న శునకం..!?మైమరిపిస్తున్న ప్రేమ: లేగ దూడకు పాలు ఇస్తున్న శునకం..!?dog;manu;prema;district;hushaaru;mandalam;love;cow slaughter;central government;dogs;adilabad;ee rojullo;v;fidaaTue, 23 Feb 2021 10:02:30 GMTఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో చోటు చేసుకుంది.

అయితే కొద్ది రోజుల క్రితం తల్లిని కోల్పోయిన లేగ దూడను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ‘జై శ్రీరాం’ గోశాలలో వదిలిపెట్టారు. కనీసం ఇతర ఆవుల పాలు తాగి పెరుగుతుందని అనుకున్నారు. కానీ ఆ లేగదూడ ఏ ఆవు దగ్గర పాలు తాగలేదు. డబ్బా పాలు కూడా తాగలేదు. పాలు తాగకపోయినా ఆ లేగ దూడ హుషారుగా కనిపించడంతో ఆశ్చర్యపోయారు. అయితే గోశాలలో ఉన్న ఓ కుక్క పాలు తాగుతూ లేగదూడ కనిపించింది. కొన్ని రోజుల నుంచి ఆ లేగ దూడ కుక్కలతో కలిసి తిరగడం, వాటితోనే కలిసి పడుకోవడం చేస్తోంది.

అదేవిధంగా కుక్క కూడా జాతి వైరం మరిచి ఆ తల్లి లేని లేగ దూడను అక్కున చేర్చుకొని తన పాలతో కడుపు నింపుతూ సఖ్యతగా మెలుగుతున్నాయి. అన్నీ తెలిసిన మనిషి బంధాలను తెంపుకుంటున్న ఈ రోజుల్లో ‘నీదే జాతి.. నాదే జాతి’ అని కూడా పట్టించుకోకుండా పాలుపట్టి లేగదూడ ఆకలి తీర్చుతున్న కుక్కలో ఉన్న తల్లి మనసుకు అందరూ ఫిదా అయ్యారు. గతంలో కూడా ఇలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది.

ఇక కుక్క పిల్లలకు జన్మనిచ్చిన తల్లి కుక్క చనిపోవడంతో ఆ పిల్లలన్నీ ఆవు పొదుగు చెంతకు చేరాయి. తన లేగ దూడలు కాకపోయినప్పటికీ ఆకలితో అలమటిస్తున్న కుక్క పిల్లలను చూసి ఆ గోమాత మనసు కరిగిపోయింది. వాటిని ఏమాత్రం కసురుకోకుండా పాలిచ్చి ఆకలి తీర్చింది. జంతువులు జాతి వైరాన్ని మరిచి ఇలా అన్యోన్యంగా మెలుగుతుంటే మనుషులు మాత్రం కులాల పేరుతో, వర్గాల పేరుతో వైరం పెంచుకుంటున్నారని, ఇలాంటివి చూసైనా.. ఇకనైనా మారాలని జంతు ప్రేమికులు పిలుపునిస్తున్నారు.


నేడే కేబినేట్ భేటీ... ఏం జరుగుతుంది...?

మంత్రి పెద్దిరెడ్డికి మ‌రో కీల‌క ప‌ద‌వి

పుర పోరు: అక్క‌డ వైసీపీ వ‌ర్సెస్ జ‌నసేన‌.. టీడీపీ ఎక్క‌డ బాబు ?

ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?

ఎమ్మెల్యే రోజా ఉగ్రరూపం! ఐదుగురు నేతలపై వేటు

పుర పోరు: గుంటూరు మేయ‌ర్‌పై ఆ టీడీపీ కుటుంబం క‌న్ను ప‌డిందే ?

పాపం బన్నీ...కొరటాల సినిమాకి కూడా ఆ బాధలు తప్పవా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>