PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kesineni-nani-has-offer-from-central-76d99153-ba12-4ba9-a61f-7102f4f4af9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kesineni-nani-has-offer-from-central-76d99153-ba12-4ba9-a61f-7102f4f4af9a-415x250-IndiaHerald.jpgదుర్గగుడి లో అక్రమాలపై 13 మంది సన్పెన్షన్ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనం అయింది. ఆరుగురు సూపరింటెండెంట్లు, ఏడుగురు కిందిస్ధాయి సిబ్బంది పై సస్పెన్షన్ వేటు వేసారు. దర్శనం టిక్కెట్ కౌంటర్స్, శారీస్ గోడౌన్, కౌంటర్స్, అన్నదానం స్టోర్, ప్రసాదం కౌంటర్, మెయిన్ ప్రొవిజన్ స్టోర్, టెండర్ల లో అవకతవకలు,శానిటేషన్, కీలకమైన విభాగాల కు సంబంధించి ఫైళ్లను రిజిస్టర్ లేకపోవడం, ఇతర విభాగాల్లో అక్రమాలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈఓ సురేష్ బాబు తన ఆదేశాలు పక్కన పెట్టారని సస్పెన్షన్ ఆదేశాల్లో దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున రాkesieneni nani;darshana;suresh;arjuna;ranina;telugu desam party;vijayawada;andhra pradesh;mp;telugu;minister;central government;anti-corruption bureau;partyఆ దమ్ము నాకుంది... కేశినేని నానీఆ దమ్ము నాకుంది... కేశినేని నానీkesieneni nani;darshana;suresh;arjuna;ranina;telugu desam party;vijayawada;andhra pradesh;mp;telugu;minister;central government;anti-corruption bureau;partyTue, 23 Feb 2021 20:00:00 GMTఏపీ రాజకీయాల్లో సంచలనం అయింది. ఆరుగురు సూపరింటెండెంట్లు, ఏడుగురు కిందిస్ధాయి సిబ్బంది పై సస్పెన్షన్ వేటు వేసారు. దర్శనం టిక్కెట్ కౌంటర్స్, శారీస్ గోడౌన్, కౌంటర్స్, అన్నదానం స్టోర్, ప్రసాదం కౌంటర్, మెయిన్ ప్రొవిజన్ స్టోర్, టెండర్ల లో అవకతవకలు,శానిటేషన్, కీలకమైన విభాగాల కు సంబంధించి ఫైళ్లను రిజిస్టర్ లేకపోవడం, ఇతర విభాగాల్లో అక్రమాలపై సస్పెన్షన్ వేటు  పడింది. ఈఓ సురేష్ బాబు తన ఆదేశాలు పక్కన పెట్టారని సస్పెన్షన్ ఆదేశాల్లో దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున రావు స్పష్టం చేసారు.

సెక్యూరిటీ టెండర్ల విషయంలో ఈఓ నా ఆదేశాలు పక్కన పెట్టారు అని ఆయన ఆరోపణలు చేసారు. నిబంధనలకు విరుద్ధంగా మ్యాక్స్ సంస్థకు సెక్యూరిటీ పనులను ఈఓ ఇచ్చారు అని విమర్శలు చేసారు. మూడు సింహాలు చోరీకి గురైనా ఈ సంస్థకే కాంట్రాక్టు ఇచ్చారు అని విమర్శించారు. మూడు సింహాల చోరీలో మ్యాక్స్ సంస్థ తప్పిదమే కారణం అని ఆయన అన్నారు. టెండర్ అప్రూవ్ అవకపోయినా కమిషనర్ ఆదేశాలు పక్కన పెట్టి మ్యాక్స్ సంస్థకు అడ్డదారిన భారీగా సొమ్ము చెల్లించారంటూ సస్పెన్షన్ ఆర్డర్ లో దేవాదాయశాఖ కమిషనర్ పేర్కొన్నారు.

దీనికి కారణమైన సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసారు. ఇక దీనిపై స్పందించిన విజయవాడ ఎంపీ కేశినేని నానీ... దుర్గగుడిలో చిరు ఉద్యోగులను సస్పెండ్‌ చేయటం సరికాదు అని అన్నారు. దుర్గుగుడిలో జరిగిన అవకతవకలు అవినీతికి  ప్రధాన కారకులు మంత్రి వెల్లంపల్లి, ఈఓ సురేష్‌ బాబు అని వ్యాఖ్యలు చేసారు. మంత్రి వెల్లంపల్లిని మంత్రి పదవి నుంచి తొలగించాలి అని డిమాండ్ చేసారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చెబుతూనే ఉంది అని అన్నారు. మంత్రి వెల్లంపల్లి గుడులు, దేవాలయాలను దోచుకుంటున్నారని... మూడు రోజులు జరిగిన ఏసీబీ దాడుల్లో రుజువైంది అన్నారు. విజయవాడ నగరం అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు అని స్పష్టం చేసారు. కేంద్రం నుంచి నేను నిధులు తెప్పించుకుని విజయవాడను అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చారు.


ఉదయ కిరణ్ ని గుర్తుకు తెస్తున్న డైరెక్టర్...?

దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>