Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/government-says-lockdown-againe2af0b65-8590-40f0-a55a-8311b1b781bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/government-says-lockdown-againe2af0b65-8590-40f0-a55a-8311b1b781bb-415x250-IndiaHerald.jpgచైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ మొన్నటి వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా విజృంభించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మహమ్మారి వైరస్ పేరెత్తితే చాలు జనాలు మొత్తం బెంబేలెత్తి పోయే పరిస్థితి ఏర్పడింది. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది మహమ్మారి వైరస్. అయితే వైరస్ విజృంభిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ కొనసాగింది అన్న విషయం తెలిసిందే. తర్వాత కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఇక కరోనా వైరస్ ప్రభావం క్రమక్రమంగా తగ్గడంతో అన్ని రాష్ట్రాలలో lock down;amala akkineni;kerala;karnataka - bengaluru;maharashtra - mumbai;maharashtra;coronavirusకరోనా భయం.. మరోసారి లాక్ డౌన్ దిశగా ఆ రాష్ట్రం..?కరోనా భయం.. మరోసారి లాక్ డౌన్ దిశగా ఆ రాష్ట్రం..?lock down;amala akkineni;kerala;karnataka - bengaluru;maharashtra - mumbai;maharashtra;coronavirusTue, 23 Feb 2021 09:05:03 GMTకరోనా వైరస్ మొన్నటి వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా విజృంభించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మహమ్మారి వైరస్ పేరెత్తితే చాలు జనాలు మొత్తం బెంబేలెత్తి పోయే పరిస్థితి ఏర్పడింది.  ఎన్నో కుటుంబాల్లో  తీరని విషాదాన్ని నింపింది మహమ్మారి వైరస్. అయితే వైరస్ విజృంభిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్  కొనసాగింది అన్న విషయం తెలిసిందే.  తర్వాత కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఇక కరోనా  వైరస్ ప్రభావం క్రమక్రమంగా తగ్గడంతో అన్ని రాష్ట్రాలలో కూడా అన్లాక్ మార్గదర్శకాలు ప్రారంభం అయ్యాయి అన్న విషయం తెలిసిందే.  ఇక ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో కూడా కరోనా వైరస్ ప్రభావం తగ్గి ప్రజలందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.



 ప్రజలందరిలో కరోనా వైరస్ పై అవగాహన పెరిగిపోవడం మరోవైపు వాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో ప్రస్తుతం అంతా సాఫీగానే సాగిపోతోంది. కానీ కొన్ని రాష్ట్రాలలో మాత్రం కరోనా వైరస్ ఇప్పటికీ విజృంభిస్తు ఉండటం మళ్లీ అందరిని ఆందోళనలో ముంచేస్తుంది. మహారాష్ట్ర కేరళలో కరోనా వైరస్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దేశంలో పెరుగుతున్న కేసుల్లో  70 శాతానికి పైగా కేసులు కేవలం ఈ రెండు రాష్ట్రాల నుంచి వస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న మిగతా రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల్లో  లాక్డౌన్ విధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.



 ఈ క్రమంలోనే మరోసారి కర్ణాటకలో లాక్ డౌన్ పెట్టే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర కేరళ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది. అంతేకాకుండా వివాహాలకు హాజరయ్యే వారి సంఖ్య 500 మించ కూడదు అనే నిబంధన కూడా పెట్టింది కర్ణాటక ప్రభుత్వం. అయితే ప్రస్తుతం కర్ణాటకలో ప్రతి రోజు నాలుగు వందలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు అవుతుండటం గమనార్హం.


ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?

ఎమ్మెల్యే రోజా ఉగ్రరూపం! ఐదుగురు నేతలపై వేటు

పుర పోరు: గుంటూరు మేయ‌ర్‌పై ఆ టీడీపీ కుటుంబం క‌న్ను ప‌డిందే ?

పాపం బన్నీ...కొరటాల సినిమాకి కూడా ఆ బాధలు తప్పవా ?

జగడ్డ: 6 నియోజకవర్గాల్లోచంద్రబాబు స్కోరు జీరో..

ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌పై కేసీఆర్ ర‌హ‌స్య స‌ర్వే...

ఎడిటోరియల్: డెమాక్రసి రెండు రకాలు - రాజ్యాంగం రెండు రకాలు - గెలుపు రెండు రకాలు: టీడీపీ జాతీయ కార్యదర్శి ట్వీటేష్ నారా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>