Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sujithc0741bcb-0626-4441-bb31-304949ec880b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sujithc0741bcb-0626-4441-bb31-304949ec880b-415x250-IndiaHerald.jpgరన్ రాజా రన్ మూవీ తో డైరెక్టర్ గా పరిచమైన సుజిత్..మొదటి మూవీ తోనే ఆకట్టుకున్నాడు. 2014 లో విడుదలైన ఈ మూవీని యువి క్రియేషన్స్ వారు నిర్మించగా, శర్వానంద్ హీరోగా నటించాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో నెక్స్ట్ మూవీ ఛాన్స్ కూడా యువి క్రియేషన్స్ వారు ఇచ్చారు. అది కూడా బాహుబలి తో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ను సుజిత్ చేతిలో పెట్టారు.saaho-sujith;chiranjeevi;prabhas;editor mohan;raja;sujeeth;india;korea, south;cinema;bahubali;saaho;remake;director;box office;v creations;uv creations;vసాహో డైరక్టర్ క్రేజీ మూవీ..!సాహో డైరక్టర్ క్రేజీ మూవీ..!saaho-sujith;chiranjeevi;prabhas;editor mohan;raja;sujeeth;india;korea, south;cinema;bahubali;saaho;remake;director;box office;v creations;uv creations;vTue, 23 Feb 2021 23:18:30 GMTరాజా రన్ మూవీ తో డైరెక్టర్ గా పరిచమైన సుజిత్..మొదటి మూవీ తోనే ఆకట్టుకున్నాడు. 2014 లో విడుదలైన ఈ మూవీని యువి క్రియేషన్స్ వారు నిర్మించగా, శర్వానంద్ హీరోగా నటించాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో నెక్స్ట్ మూవీ ఛాన్స్ కూడా యువి క్రియేషన్స్ వారు ఇచ్చారు. అది కూడా బాహుబలి తో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ను సుజిత్ చేతిలో పెట్టారు. నాలుగేళ్లు కష్టపడి సాహో కథను సిద్ధం చేసాడు.

పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో నిర్మించబడిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించలేకపోయింది. నార్త్ లో పర్వాలేదు అనిపించుకున్న సౌత్ లో మాత్రం డిజాస్టర్ అయ్యింది. ప్రభాస్ ఇమేజ్ ను వాడుకోవడం లో సుజిత్ తడబడ్డాడు, నిర్మాతలు భారీ ఖర్చు పెట్టినప్పటికీ దానికి తగ్గట్లు కథ , స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ ఇప్పుడు సుజిత్ కు భారీ ఆఫర్ వచ్చినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సుజిత్ తో జీ స్టూడియోస్ వారు ఓ భారీ సినిమా చేయాలనీ అనుకుంటున్నారట. దీనికి సంబదించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వాస్తవానికి సాహో తర్వాత మెగా స్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ ను సుజిత్ చేతిలో పెట్టాడు. కానీ చిరంజీవి కి ఆకట్టుకునేలా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథ సిద్ధం చేయలేకపోయాడు. దీంతో సుజిత్ ను పక్కకు పెట్టి ఆ బాధ్యతలు మోహన్ రాజా కు ఇచ్చారు. ఒకవేళ చిరును మెప్పిస్తే సుజిత్ క్రేజ్ మరోలా ఉండేది. మరి ఇప్పుడు జీ స్టూడియో వారు సుజిత్ తో ఎలాంటి మూవీ చేయబోతున్నారో..కాస్ట్ క్రూ ఎవరు అనేది చూడాలి.             
 




బాత్ టబ్ లో ఈషా రెబ్బ.. ఈ రేంజ్ లో రెచ్చిపోయిందే..!

దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>