PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections176078f4-b457-4466-8283-619de78e43c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections176078f4-b457-4466-8283-619de78e43c9-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ లోని పురపాలక, నగరపాలక, నగ ర పంచాయతీలకు తాజాగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని సీనియర్‌ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, పి.వీరారెడ్డి అభ్యర్థించారు..ఈ మేరకు ఎక్కడ ఎన్నికలు ఆగాయో.. అక్కడే ప్రారంభించాలని ఆయన కోరారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల కు నామినేషన్లు వేసే వెసులుబాటును కల్పిస్తే బాగుంటుందని అన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈ నెల 15న ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ వ్యవహారంలో ఎస్‌ఈసీ వాదనలు వినేందుకు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీjagan-nimmagadda-elections;andhra pradesh;district;kadapa;high court;panchayati;qualification;marchపుర పోరు: ఎక్కడ అగిందో.. అక్కడ నుంచే ప్రారంభించాలి: హైకోర్టుపుర పోరు: ఎక్కడ అగిందో.. అక్కడ నుంచే ప్రారంభించాలి: హైకోర్టుjagan-nimmagadda-elections;andhra pradesh;district;kadapa;high court;panchayati;qualification;marchTue, 23 Feb 2021 10:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ లోని పురపాలక, నగరపాలక, నగ ర పంచాయతీలకు తాజాగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని సీనియర్‌ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, పి.వీరారెడ్డి అభ్యర్థించారు..ఈ మేరకు ఎక్కడ ఎన్నికలు ఆగాయో.. అక్కడే ప్రారంభించాలని ఆయన కోరారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల కు నామినేషన్లు వేసే వెసులుబాటును కల్పిస్తే బాగుంటుందని అన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈ నెల 15న ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ వ్యవహారంలో ఎస్‌ఈసీ వాదనలు వినేందుకు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు..


పురపాలక ఎన్నికలు నిర్వహించేందుకు నిరుడు మార్చి 9న ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేయడం.. నామినేషన్ల ఉపసంహరణ దశలో కొవిడ్‌ కారణంగా మార్చి 15న ఎన్నికలను వాయిదా వేయడం తెలిసిందే. నిలిచిపోయిన సదరు ఎన్నికలను ఆగిన దగ్గర నుంచే కొనసాగించేందుకు ఈ నెల 15న ఎస్‌ఈసీ నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటిని సవాల్‌ చేస్తూ కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన యశోధ, మధుసూధన్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు ఎస్‌ఈసీ నిర్ణయంతో పోటీచేసే అవకాశం కోల్పోవాల్సి వస్తుందని జమ్మలమడుగు నగర పంచాయతీ, తాడిపత్రి మున్సిపాలిటీలోని పలువురు అత్యవసర వ్యాజ్యాలు దాఖలు చేశారు..



ఇక కరోనా కారణంగా నిలిచిపోయినఎన్నికల ప్రక్రియ కొనసాగింపు నోటిఫికేషన్‌ ఇవ్వడాన్ని ఎలా తప్పుపట్టగలమని ప్రశ్నించారు. న్యాయవాదులు బదులిస్తూ.. 'కరోనా కారణంగా నిరుడు మార్చి 15న ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం 2021 ఫిబ్రవరిలో ఉన్నాం. ఎన్నికలు వాయిదాపడి ఏడాది గడుస్తోంది. ఈ మధ్య కాలంలో చాలామంది యువతకు ఓటు హ క్కు వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అర్హత సాధించారు. వారికి అవకాశం కల్పించకుండా ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేయడం భావిసున్నట్లు తెలుస్తుంది. రాజ్యాంగంలోని అధికారణ 243(కె) ప్రకారం నిలిచిపోయిన దగ్గర నుంచి ప్రక్రియను ప్రారంభించే అధికారం ఎస్‌ఈసీకి లేదు.. అందరినీ సమానంగా చూసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలను ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది..


నేడే కేబినేట్ భేటీ... ఏం జరుగుతుంది...?

మంత్రి పెద్దిరెడ్డికి మ‌రో కీల‌క ప‌ద‌వి

పుర పోరు: అక్క‌డ వైసీపీ వ‌ర్సెస్ జ‌నసేన‌.. టీడీపీ ఎక్క‌డ బాబు ?

ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?

ఎమ్మెల్యే రోజా ఉగ్రరూపం! ఐదుగురు నేతలపై వేటు

పుర పోరు: గుంటూరు మేయ‌ర్‌పై ఆ టీడీపీ కుటుంబం క‌న్ను ప‌డిందే ?

పాపం బన్నీ...కొరటాల సినిమాకి కూడా ఆ బాధలు తప్పవా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>