PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vsp-ycp4ce50123-9da6-43cb-8f05-de8e6719a98b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vsp-ycp4ce50123-9da6-43cb-8f05-de8e6719a98b-415x250-IndiaHerald.jpgవైసీపీకి పంచాయతీ ఎన్నికలు బాగానే కలసి వచ్చాయి. ఎక్కువ స్థానాలు ఆ పార్టీ మద్దతుదారులు కైవశం చేసుకున్నారు. దాంతో అదే ఊపుని మునిసిపల్ ఎన్నికల్లో కూడా కంటిన్యూ చేయాలనుకుంటోంది. కానీ సీన్ చూస్తే అలా జరిగే పనేనా అన్న సందేహాలు కలుగుతునాయి. విశాఖ మేయర్ పీఠం ఇపుడు వైసీపీకి అందని పండే అవుతుందా అన్న చర్చ కూడా మొదలైంది. vsp ycp;mini;vishakapatnam;panchayati;history;tdp;central government;ycp;partyపుర పోరు : విశాఖలో వైసీపీకి టఫ్ ఫైట్ ?పుర పోరు : విశాఖలో వైసీపీకి టఫ్ ఫైట్ ?vsp ycp;mini;vishakapatnam;panchayati;history;tdp;central government;ycp;partyTue, 23 Feb 2021 12:18:43 GMTపంచాయతీ ఎన్నికలు బాగానే కలసి వచ్చాయి. ఎక్కువ స్థానాలు ఆ పార్టీ మద్దతుదారులు కైవశం చేసుకున్నారు. దాంతో అదే ఊపుని మునిసిపల్ ఎన్నికల్లో కూడా కంటిన్యూ చేయాలనుకుంటోంది. కానీ సీన్ చూస్తే అలా జరిగే పనేనా అన్న సందేహాలు కలుగుతునాయి. విశాఖ మేయర్ పీఠం ఇపుడు వైసీపీకి అందని పండే అవుతుందా అన్న చర్చ కూడా మొదలైంది.

విశాఖ కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు. అలాగే అన్ని వర్గాల ప్రజనీకం కూడా ఇక్కడ నివసిస్తారు. భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లుగా మినీ భారతమే విశాఖలో ఉంటుంది. పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇక వైసీపీకి విశాఖ సిటీ ఎపుడూ పొలిటికల్ గా గట్టిగా నిలబడలేదు. 2014 నుంచి ఆ పార్టీ పోటీలో ఉన్నా కూడా విశాఖ నగరం మాత్రం టీడీపీనే ఆదరిస్తోంది.

ఇక వైసీపీ పెట్టాక తొలిసారి మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అదే సమయంలో టీడీపీకి విశేషమైన అనుభవం ఉంది. ఆ పార్టీకి చెందిన మాజీ కార్పోరేటర్లు పెద్ద ఎత్తున ఉన్నారు. ఒకసారి మేయర్ గా గెలిచిన చరిత్ర కూడా టీడీపీకి ఉంది. టీడీపీకి కొన్ని వార్డులు పెట్టని కోటగా ఉన్నాయి. అక్కడ టీడీపీని కాదనుకుని వేరే పార్టీ  గెలవడం అంటే అంత సులువు కాదు. ఇక సిటీ వరకూ వస్తే వైసీపీకి బలమైన నాయకుల కొరత కూడా ఉంది.  మొత్తానికి చూసుకుంటే టీడీపీ నుంచి జీవీఎంసీ ఎన్నికల్లో  వైసీపీకి గట్టి పోటీ తప్పదు అంటున్నరు. వైసీపీ అరవై సీట్లు గెలిస్తేనే మంచి మెజారిటీతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీలో ఒక్కసారిగా పెరిగిన వర్గ పోరు కూడా ఆ పార్టీకి ముప్పు తెచ్చేలా ఉందని అంటున్నారు.  చూడాలి మరి ఏం జరుగుతుందో నగర జనం.






ఇలా వారు అడ‌గ‌డం.. అలా బాబు త‌లూప‌డం.. ప‌రువు పోదా ?

కాపు వేద‌న‌: పంచాయ‌తీ స‌ర‌ళి చూశాకైనా.. ప‌వ‌న్ మార‌తారా ?

రకుల్ ప్రీత్ సింగ్‌ను పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన అర్హతలు ఇవే..!?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

జూనియర్ ఎన్టీఆర్ వదిలేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే..!?

పుర పోరు: ఆ టీడీపీ జంపింగ్‌కు జ‌గ‌న్ పెట్టిన అగ్ని ప‌రీక్ష‌... తేడా వ‌స్తే ఇంటికే ?

మంత్రి పెద్దిరెడ్డికి మ‌రో కీల‌క ప‌ద‌వి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>