PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/oh-my-god-this-much-of-speed-really-superb-news-for-pawan-kalyan-fans8a13b49f-e435-46bc-a29a-1ea9db2128ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/oh-my-god-this-much-of-speed-really-superb-news-for-pawan-kalyan-fans8a13b49f-e435-46bc-a29a-1ea9db2128ae-415x250-IndiaHerald.jpgతూర్పుగోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రంలో ఉప్పూడి పంచాయ‌తీ, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గోపాల‌పురంలో ద్వారకాతిరుమ‌ల పంచాయ‌తీ స‌హా మ‌రో ఆరు పంచాయ‌తీల‌ను జ‌న‌సేన కైవ‌సం చేసుకుంది. ఇక‌, ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరులోని తుడిమెళ్ల పంచాయ‌తీని కూడా జ‌న‌సేన కైవ‌సం చేసుకుంద‌ని ఆ పార్టీ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లి గూడెంలోని ఆరుబోయిన, ద‌ర్శిప‌ర్రు స‌హా అత్య‌ధిక స్థానాలు కైవ‌సం చేసుకుంది. తూర్పుగోదావ‌రిజిల్లాలోని అమ‌లాపురంలో బొక్క‌సుర్రు గ్రామం(మ‌త్స్యకార గ్రామం)లోనూ పార్టీ మ‌ద్ద‌తు janasena pawan kalyan;ramaraju;janasena;district;east;nellore;letter;janasena party;partyఆ రెండు జిల్లాల్లో జ‌న‌సేన దూకుడు మామూలుగా లేదే ?ఆ రెండు జిల్లాల్లో జ‌న‌సేన దూకుడు మామూలుగా లేదే ?janasena pawan kalyan;ramaraju;janasena;district;east;nellore;letter;janasena party;partyTue, 23 Feb 2021 10:14:00 GMTతాజాగా ముగిసిన పంచాయ‌తీ ఎన్నిక‌ల నాలుగు ద‌శ‌ల ఫ‌లితాల‌ను విశ్లేషిస్తే.. రెండు ప్ర‌ధాన పార్టీల‌ను ప‌క్క‌న పెట్టి మ‌రో కీల‌క పార్టీగా ఉన్న జ‌న‌సేన దూకుడు ఎలా ఉంద‌నే చ‌ర్చ సాగుతోంది. రాష్ట్రంలో జ‌న‌సేన దూకుడు బాగుంద‌ని నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఉభ‌య గోదావ‌రి జిల్లాలు స‌హా నెల్లూరులో నూ తాజాగా వ‌చ్చిన పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో జ‌న‌సేన ఆశించిన మేర‌కు దూకుడు చూపించింది. ముఖ్యంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో మాత్రం అనూహ్యంగా పార్టీ దూసుకుపోయింది.

తూర్పుగోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రంలో ఉప్పూడి పంచాయ‌తీ, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గోపాల‌పురంలో ద్వారకాతిరుమ‌ల పంచాయ‌తీ స‌హా మ‌రో ఆరు పంచాయ‌తీల‌ను జ‌న‌సేన కైవ‌సం చేసుకుంది. ఇక‌, ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరులోని తుడిమెళ్ల పంచాయ‌తీని కూడా జ‌న‌సేన కైవ‌సం చేసుకుంద‌ని ఆ పార్టీ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లి గూడెంలోని ఆరుబోయిన, ద‌ర్శిప‌ర్రు స‌హా అత్య‌ధిక స్థానాలు కైవ‌సం చేసుకుంది. తూర్పుగోదావ‌రిజిల్లాలోని అమ‌లాపురంలో బొక్క‌సుర్రు గ్రామం(మ‌త్స్యకార గ్రామం)లోనూ పార్టీ మ‌ద్ద‌తు దారులు విజ‌యం సాధించారు.

దీనిని బ‌ట్టి ప‌శ్చిమ‌, తూర్పుగోదావ‌రి జిల్లాల్లో పార్టీకి గ‌ట్టి అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, నె‌ల్లూరు రూర‌ల్ కెమిదెల పాలెం రెండు వార్డుల్లో విజ‌యం సాధించిన జ‌న‌సేన త‌న ఉనికిని చాటుకుంది. నాలుగో విడ‌త‌లో జనసేన 20కి పంచాయ‌తీల‌ను ద‌క్కించుకుంది. మ‌రీ ముఖ్యంగా  తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజకవర్గంలో   పడమటిపాలెం, టెకిశెట్టిపాలెం, కేశవదాసు పాలెం, కాట్రేనిపాడు, ఈటుకూరు, మేడిచర్ల పాలెం, బట్టేలంక, రామరాజులంక, కత్తిమండ, కూనవరంలో జనసేన మ‌ద్ద‌తు దారులు గెలుపు గుర్రం ఎక్కారు.

దీంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.  మొత్తంగా చూస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌కు భిన్నంగా జ‌న‌సేన పుంజుకోవ‌డం గ‌మ‌నార్హం. తాజాగా పార్టీ నాయ‌కుడు, మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ తూర్పుగోదావ‌రిలో స‌ర్పంచ్ అభ్య‌ర్థుల‌ను అభినందించ‌డ‌మే కాకుండా.. గ‌ట్టి వాయిస్ వినిపించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి వ‌చ్చే మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతారో లేదో చూడాలి. 


ఆటో రాంప్రసాద్ సంచలన వ్యాఖ్యలు.. ఆ అమ్మాయిలకు బ్లాక్ మెయిల్ కాల్స్...?

మంత్రి పెద్దిరెడ్డికి మ‌రో కీల‌క ప‌ద‌వి

పుర పోరు: అక్క‌డ వైసీపీ వ‌ర్సెస్ జ‌నసేన‌.. టీడీపీ ఎక్క‌డ బాబు ?

ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?

ఎమ్మెల్యే రోజా ఉగ్రరూపం! ఐదుగురు నేతలపై వేటు

పుర పోరు: గుంటూరు మేయ‌ర్‌పై ఆ టీడీపీ కుటుంబం క‌న్ను ప‌డిందే ?

పాపం బన్నీ...కొరటాల సినిమాకి కూడా ఆ బాధలు తప్పవా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>