PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dead-body-on-the-road-old-woman-in-tearsf146a076-29be-4147-a7ac-3af9a04dfe54-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dead-body-on-the-road-old-woman-in-tearsf146a076-29be-4147-a7ac-3af9a04dfe54-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో మనుషుల్లో మానవత్వం అనేది కరువైపోతుంది. సాటి మనిషికి అండగా నిలబడాల్సింది పోయి వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సాలురుకి చెందిన వృద్ధుడు దాసరి పైడయ్య అతడి భార్య పార్వతీపురం నుంచి బస్సులో సాలూరుకు వెళ్తున్నారు. అయితే మార్గం మధ్యలో బస్సులో ఉండగానే వృద్ధుడు మృతి చెందాడు. భర్త అపాస్మారక స్థితిలో పడిపోవడం చూసి ఆ వృద్ధమహిళ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. old woman;women;manu;smart phone;bus;conductor;driver;husband;wife;woman;letter;local languageనడిరోడ్డుపై మృతదేహం.. కన్నీరు పెట్టుకున్న వృద్ధురాలు..!నడిరోడ్డుపై మృతదేహం.. కన్నీరు పెట్టుకున్న వృద్ధురాలు..!old woman;women;manu;smart phone;bus;conductor;driver;husband;wife;woman;letter;local languageTue, 23 Feb 2021 08:01:41 GMTనేటి సమాజంలో మనుషుల్లో మానవత్వం అనేది కరువైపోతుంది. సాటి మనిషికి అండగా నిలబడాల్సింది పోయి వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సాలురుకి చెందిన వృద్ధుడు దాసరి పైడయ్య అతడి భార్య పార్వతీపురం నుంచి బస్సులో సాలూరుకు వెళ్తున్నారు. అయితే మార్గం మధ్యలో బస్సులో ఉండగానే వృద్ధుడు మృతి చెందాడు. భర్త అపాస్మారక స్థితిలో పడిపోవడం చూసి ఆ వృద్ధమహిళ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ వృద్ధుడు చనిపోయాడని బస్సులో వారు నిర్ధారించారు. వెంటనే కనికరం చూపించకుండా బస్సులోంచి కిందకు దిగిపోవాలని కండక్టర్, డ్రైవర్ దిగిపోమని చెప్పారు.

అయితే తనకు ఎక్కడికి వెళ్లాలో తెలీదని సాలూరులో దించేయాలని ఆ వృద్ధురాలు వేడుకున్నా వినలేదు. బస్సులోంచి దించేయాలి అనుకున్పప్పుడు కనీసం వేరే వాహనం మాట్లాడడం లేదంటే కనీసం 108 ఫోన్ చేసి రప్పించే ప్రయత్నం కూడా చేయలేదు. ఆమె వృద్ధురాలు అనే జాలి కూడా చూపించలేదు.. డ్రైవర్, కండెక్టర్ సంగతి పక్కన పెడితే.. ఆ బస్సులో ఉన్నవారు సైతం ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు.. అంతా కలిసి ఆ మృతదేహాంతో సహా వృద్ధురాలను కిందకు దింపేశారు.

దీంతో ఏం చేయాలో తెలియక.. పైడయ్య మృతదేహాన్ని పక్కన పెట్టుకొని నడి రోడ్డుపై రోధించింది ఆ వృద్ధురాలు.. ఆ రోడ్డుపై ఆమె ఆవేదన చూసిన వారికైనా జాలి కలగాలి..  ఆమె అలా రోధిస్తుంటే కనీసం కన్నీరు కార్చాలి. కానీ చాలామంది పట్టించుకోకుండా అలా వెళ్లిపోయారు.  దీంతో ఎవరైనా వచ్చి సాయం చేయండి బాబు అంటూ ఏడుస్తూ వేడుకుంది వృద్ధ మహిళ.  కాసేపటి తరువాత అటువైపు వెళ్తున్న స్థానిక యువత, జర్నలిస్టులు ఆ ఘటనను చూసి చలించారు.

ఇక వెంటనే కొంత మొత్తంలో డబ్బు సేకరించి మృతదేహాన్ని సాలూరుకు తరలించే ప్రయత్నం చేశారు. లేదంటే పూర్తిగా చీకటి పడేది.. దానికి తోడు చలి పెరిగి.. దోమల కాటు.. కుక్కల బెడదతో పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కూడా కష్టమే..  అసలు బస్సులో అంతమంది ఉండి కూడా కనీసం కనికరం చూపించకపోవడం దారుణం. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మనిషి అన్నవాడు  మాయమైపోతున్నాడు అనిపిస్తుంది.


హెరాల్డ్ స్మ‌రామీ : బ‌్రహ్మ‌మొక్క‌టేన‌న్న పదకవితా పితామహుడు అన్న‌మ‌య్య‌...

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు ఏమైందబ్బా ? ఏమీటీ మాటలు ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తెలంగాణా పై షర్మిల వ్యూహాత్మక నిర్ణయం

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>