TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/akhil15b9e16b-006b-425c-abc5-4c778af8b2eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/akhil15b9e16b-006b-425c-abc5-4c778af8b2eb-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై బిగ్ బాస్ షోకి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో వియవంతగా నాలుగు సీజన్స్ ని పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ నాలుగో సీజన్ విజేతగా అభిజిత్ నిలవగా, రన్నరప్ గా అఖిల్ నిలిచాడు. రన్నరప్ ట్రోఫీతో ఇంటికి వచ్చాడు. బిగ్ బాస్ 4 తెలుగు పుణ్యమా అని ప్రేక్షకులకు చేరువైన నటుడు అఖిల్ సార్థక్. akhil;abhijith;akhil akkineni;jeevitha rajaseskhar;prema;gujarat - gandhinagar;bigboss;love;girlక‌న్న క‌ల‌ను నెర‌వేర్చుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్‌..!?క‌న్న క‌ల‌ను నెర‌వేర్చుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్‌..!?akhil;abhijith;akhil akkineni;jeevitha rajaseskhar;prema;gujarat - gandhinagar;bigboss;love;girlTue, 23 Feb 2021 16:03:44 GMTబిగ్ బాస్ షోకి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో వియవంతగా నాలుగు సీజన్స్ ని పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ నాలుగో సీజన్ విజేతగా అభిజిత్ నిలవగా, రన్నరప్ గా అఖిల్ నిలిచాడు. రన్నరప్ ట్రోఫీతో ఇంటికి వచ్చాడు. బిగ్ బాస్ 4 తెలుగు పుణ్యమా అని ప్రేక్షకులకు చేరువైన నటుడు అఖిల్ సార్థక్. అంతకుముందు కొన్ని సీరియల్స్, సినిమాలు చేసినా కూడా ఎవరూ ఈయన్ని గుర్తు పట్టలేదు. బిగ్ బాస్ తరువాత అఖిల్ కి మంచి గుర్తింపు దొరికింది.

బిగ్ బాస్ షో చాలా మంది జీవితాన్ని మార్చేసింది. వచ్చిన తర్వాత తన కెరీర్ చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు అఖిల్.ఈ షో త‌ర్వాత కంటెస్టెంట్స్ కొంద‌రు ఇళ్లు కొట్టుకోగా, మ‌రికొంద‌రు ల‌గ్జ‌రీ కార్స్ కొనుగోలు చేసి త‌మ క‌ల‌ల‌ను నిజం చేసుకున్నారు. బిగ్ బాస్ సీజ‌న్ 3 కంటెస్టెంట్ శివ‌జ్యోతి ఖ‌రీదైన ఇంటితో పాటు కారు కూడా కొనుగోలు చేసింది. ఇక  సీజ‌న్ 4 కంటెస్టెంట్స్ లాస్య‌, సోహెల్‌లు కారు కొన్న‌ట్టు రీసెంట్‌గా త‌మ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ఇక ఇప్పుడు సీజన్ 4 ర‌న్న‌రప్ అఖిల్ సార్ధ‌క్  త‌న క‌న్న క‌ల‌ను నెర‌వేర్చుకున్నాడు. 25 ఏళ్ల‌లోపు కారు కొనుక్కుంటాన‌ని ప్రామిస్ చేసిన అత‌ను అది నిజం చేశాడు. ఇది అంత తన కష్టం,  హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైందంటూ చెప్పుకొచ్చాడు.  అమ్మనాన్న ప్రేమ లేకుండా ఇది సాధ్యం అయ్యేది కాద‌ని చెప్పుకొచ్చాడు. అఖిల్ కారు కొన్న సంద‌ర్భంగా మోనాల్‌, సోహెల్‌తో పాటు ప‌లువురు ప్రముఖులు, నెటిజ‌న్స్ ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ప్రస్తుతం మోనాల్ గజ్జర్‌తో కలిసి వెబ్ సిరీస్ చేస్తున్నాడు. తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి అంటూ సాగే ఈ ప్రేమకథను త్వరలోనే విడుదల చేయనున్నారు కూడా. అచ్చంగా తమ జీవితం మాదిరే ఈ కథ ఉంటుందని చెప్పారు అఖిల్, మోనాల్.


పీ జీ చదువుతున్నారా..? అయితే మీకో శుభవార్త..?

సమంత కి చేదు అనుభవం..అసలు ఏమైందో తెలుసా..?

‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్‌ను ప్రకటించేశారు.. విడుదల ఎప్పుడో తెలుసా?

పుర పోరు : విశాఖలో రెబెల్స్... పార్టీలకు షాక్...?

ఎన్టీఆర్ తదుపరి సినిమా అదే... మిగతావన్నీ పుకార్లేనట !

ఈ 9 సినిమాలు వదిలేసి జూనియర్ ఎన్టీఆర్ తప్పు చేశాడా

పుర పోరు : విశాఖలో వైసీపీకి టఫ్ ఫైట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>