MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balafc33130a-3962-4a79-9aac-c814773868bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balafc33130a-3962-4a79-9aac-c814773868bc-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోల్లో బాలయ్య ఒకరు. ఆయన ఏడాదికి వీలైతే రెండు మూడు కూడా సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 2019లో బాలయ్య నటించిన సినిమాలు మూడు రిలీజ్ అయ్యాయి. 2020లో మాత్రం కరోనా కారణంగా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కానీ ఈ ఏడాది కచ్చితంగా బాలయ్య నుంచి రెండు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. bala;business;balakrishna;gopichand;boyapati srinu;santhosh;vaishno devi;dargah sharif;tollywood;cinema;director;father;santhossh jagarlapudi;god father;krackబాలయ్యకు ఒక్కసారిగా డిమాండ్...?బాలయ్యకు ఒక్కసారిగా డిమాండ్...?bala;business;balakrishna;gopichand;boyapati srinu;santhosh;vaishno devi;dargah sharif;tollywood;cinema;director;father;santhossh jagarlapudi;god father;krackTue, 23 Feb 2021 19:30:00 GMTటాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోల్లో బాలయ్య ఒకరు. ఆయన ఏడాదికి వీలైతే రెండు మూడు కూడా సినిమాలు చేసిన సందర్భాలు   ఉన్నాయి. 2019లో బాలయ్య నటించిన సినిమాలు మూడు రిలీజ్ అయ్యాయి. 2020లో మాత్రం కరోనా కారణంగా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కానీ ఈ ఏడాది కచ్చితంగా బాలయ్య నుంచి రెండు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

బాలయ్య బోయపాటి మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ మూవీని మే 28న రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేశారు. ఇక ఈ మూవీకి గాడ్ ఫాదర్ అన్న టైటిల్ కూడా దాదాపుగా ఎంపిక చేశారు. ఇక ఈ సినిమా విషయంలో బాలయ్యకు, బోయపాటికి కూడా మంచి నమ్మకం ఉంది. ఇద్దరి ట్రాక్ రికార్డ్ చూసినా బొమ్మ బ్లాక్ బస్టరే అంటున్నారు. బాలయ్య డ్యూయల్  రోల్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీ బిజినెస్ కూడా యమ జోరుగా సాగుతోంది.  ఈ మూవీతో పాటుగా బాలయ్య లేటెస్ట్ అంగీకరించిన మరో సినిమా క్రాక్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో అంటున్నారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ మూవీకి అన్నీ కరెక్ట్ గానే కుదురుతున్నాయి. బాలయ్య కోసం గోపీ పవ‌ర్ ఫుల్ స్టోరీ రాసి ఓకే అనిపించుకున్నాడుట. మే నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు.

ఇక ఈ మూవీతో పాటుగా బాలయ్యతో సినిమాలు చేసేందుకు మరింతమంది డైరెక్టర్లు క్యూ కట్టడమే విశేషం. బాలయ్యతో సినిమా తీయడానికి సీనియర్ డైరెక్టర్ బీ గోపాల్ ఒక కధ పట్టుకుని రెడీగా ఉన్నారుట‌. బాలయ్య ఓకే అనాలి కానీ సినిమా తీస్తాను అంటున్నారుట. ఇక మరో వైపు చూస్తే యంగ్ డైరెక్టర్  సంతోష్ కూడా బలరామయ్య బరిలోకి దిగితే అన్న మూవీని తీయడానికి రెడీ అంటున్నారు. వీరు కాకుండా మరో ఇద్దరు సినియర్ డైరెక్టర్లు కూడా బాలయ్యతో సినిమా అంటున్నారు. మొత్తానికి బాలయ్య బాబు ఎవరికి ఓకే చెబుతాడో తెలియదు కానీ ఆయనకు ఇంత డిమాండ్ ఒక్కసారిగా రావడం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది అంటున్నారు.




సర్కారు వారి పాట లో మహేష్ రోల్ అదే .... తెలిస్తే నిజంగా షాకే ....??

దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>