PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-the-staraight-question-about-fuel-hike4f96f8e3-8df1-4219-8244-52d1e76aceae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-the-staraight-question-about-fuel-hike4f96f8e3-8df1-4219-8244-52d1e76aceae-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు రూ.100 మార్క్‌కు దగ్గరగా ఉన్నాయి. కేంద్ర సుంకాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల వాతలతో సామాన్యుల నడ్డివిరుగుతోంది. వరుసగా 12 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నా.. కేంద్రం చోద్యం చూస్తోందనే విమర్శలు వినబడుతున్నాయి. అయితే ఎట్ట‌కేల‌కు పెట్రోల్ ధ‌ర‌లు కాస్తంత శాంతించాయి. పైపైకి వెళ్లిపోతూ సామాన్యుడి చుక్కులు చూపిన ఇంధ‌నం ధ‌ర‌... ఎట్ట‌కేల‌కు మంగ‌ళ‌వారం కాస్తంత త‌గ్గుముఖం ప‌ట్ట‌డం సంతోష‌మ‌నే చెప్పాలి. 12 రోజుల త‌ర్వాత దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు త‌గ్గాయpetroal;meghalaya;rajasthan;capital;petrol;diesel;february;central governmentదెబ్బ‌కు దిగివచ్చిన పెట్రోల్ ధ‌ర‌లు... ఎందుకంటే...?దెబ్బ‌కు దిగివచ్చిన పెట్రోల్ ధ‌ర‌లు... ఎందుకంటే...?petroal;meghalaya;rajasthan;capital;petrol;diesel;february;central governmentTue, 23 Feb 2021 07:30:00 GMTపెట్రోల్ ధరలు రూ.100 మార్క్‌కు దగ్గరగా ఉన్నాయి. కేంద్ర సుంకాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల వాతలతో సామాన్యుల నడ్డివిరుగుతోంది. వరుసగా 12 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నా.. కేంద్రం చోద్యం చూస్తోందనే విమర్శలు వినబడుతున్నాయి. అయితే ఎట్ట‌కేల‌కు పెట్రోల్ ధ‌ర‌లు కాస్తంత శాంతించాయి. పైపైకి వెళ్లిపోతూ సామాన్యుడి చుక్కులు చూపిన ఇంధ‌నం ధ‌ర‌... ఎట్ట‌కేల‌కు మంగ‌ళ‌వారం కాస్తంత త‌గ్గుముఖం ప‌ట్ట‌డం సంతోష‌మ‌నే చెప్పాలి. 12 రోజుల త‌ర్వాత దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు త‌గ్గాయి. జనాలు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా మంగళవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి.


దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.90.58 ఉండగా (సోమవారం రూ.90.58 ), డీజీల్‌ రూ80.97 వద్ద కొనసాగుతోంది. సోమవారం లీటర్‌ డీజిల్‌ రూ.80.97 గా న‌మోద‌య్యాయి.ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర అత్యధికంగా రూ.97.00గా నమోదుకాగా (సోమవారం రూ.97.00గా) డీజిల్‌ రూ. 88.06 గా ఉండ‌టం విశేషం. కొంత‌కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ధరల పెరుగుదల స్పష్టంగా కనిపించింది. సోమవారం హైదరాబాద్‌లో పెట్రోల్‌ గరిష్ట ధరకు చేరుకుంది. మంగ‌ళ‌వారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.18గా ఉండగా (సోమవారం రూ.94.18), డీజిల్‌ రూ.88.31గా (ఆదివారం రూ.88.31) పల‌క‌డం విశేషం. వరంగల్‌లో మాత్రం స్వల్పంగా పెట్రోల్‌ తగ్గగా, డీజిల్‌ ధర పెరిగింది. ఇక్కడ సోమవారం లీటర్‌ పెట్రోల్‌ రూ.93.76 గా (సోమవారం రూ.93.76) ఉంది.


పెట్రోల్ ధ‌ర‌లు దిగి రాక ముందే ఓ నాలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ప‌న్నును త‌గ్గించి కాస్తంత ఊర‌ట‌నిచ్చేందుకు ప్ర‌య‌త్నించ‌డం గ‌మ‌నార్హం.  ఎన్నికలు జరగనున్న పశ్చిమ్ బెంగాల్‌లో అక్కడ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.1 వ్యాట్ తగ్గిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. రాజస్థాన్ ప్రభుత్వం జనవరిలోనే చమురు ధరలపై వ్యాట్‌ను 38 శాతం నుంచి 36 శాతానికి తగ్గించింది. అటు అసోం కూడా కరోనా కారణంగా విధించిన అదనపు పన్ను రూ.5 తగ్గిస్తూ ఫిబ్రవరి 12న నిర్ణయం తీసుకుంది. అలాగే మేఘాలయ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా తగ్గించింది.  పెట్రోల్‌పై రూ.7.40, డీజిల్‌పై 7.10 మేర తగ్గించింది. అంతకు ముందు రాయితీ రూ.2 తగ్గించిన మేఘాలయ.. పెట్రోల్‌పై విధించిన 31.62 శాతం వ్యాట్‌ను 20 శాతానికి, డీజిల్‌పై 22.95 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.




ఎడిటోరియల్: డెమాక్రసి రెండు రకాలు - రాజ్యాంగం రెండు రకాలు - గెలుపు రెండు రకాలు: టీడీపీ జాతీయ కార్యదర్శి ట్వీటేష్ నారా!

హెరాల్డ్ స్మ‌రామీ : బ‌్రహ్మ‌మొక్క‌టేన‌న్న పదకవితా పితామహుడు అన్న‌మ‌య్య‌...

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు ఏమైందబ్బా ? ఏమీటీ మాటలు ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తెలంగాణా పై షర్మిల వ్యూహాత్మక నిర్ణయం

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>