- Megastar Surprise Gift To Rockstar (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
- Megastar Surprise Gift To Rockstar (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
- Megastar Surprise Gift To Rockstar (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
- Megastar Surprise Gift To Rockstar (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
రాక్‌స్టార్ కి మెగాస్టార్ సర్ ప్రైజ్ గిఫ్ట్.
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్‌గా ఈ సినిమా విడుదలై సూపర్‌సక్సెస్‌ని సాధించిన విషయం తెలిసిందే. ఓ జంట ప్రేమప్రయాణానికి అద్భుతమైన దృశ్యరూపంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం ఒక హైలెట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌ని అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి దేవిశ్రీ ప్రసాద్‌కి ఒక మ్యూజికల్ గిఫ్ట్‌తో పాటు ఒక లేఖని పంపారు. ఆ లేఖలో..
Dear DSP,
ఎగిసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్స్ చిత్రాలకి ఎంత ప్యాషన్ తో సంగీతాన్నిస్తావో, చిత్ర రంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్ కి అంతే ప్యాషన్‌తో మ్యూజిక్ నిస్తావ్. నీలో వుండే ఈ ఎనర్జీ, సినిమాలకి నీ మ్యూజిక్ ఇచ్చే ఎనర్జీ ఎప్పటికీ ఇలాగే వుండాలని కోరుకుంటూ, నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. God Bless Devi! You Truly are a Rock Star!..ప్రేమతో చిరంజీవి.
ఈ ప్రశంసకు మెగాస్టార్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ దేవి శ్రీ ప్రసాద్ ఒక వీడియో పోస్ట్‌చేశారు.
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.