PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-chandra-babu235e08e4-8294-4c77-aee0-6555e18b23ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-chandra-babu235e08e4-8294-4c77-aee0-6555e18b23ba-415x250-IndiaHerald.jpgఅస‌లు ప్ర‌తిప‌క్ష టీడీపీకి చెందిన మ‌ద్ద‌తుదారులు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా స‌ర్పంచ్ స్థానం గెలుచుకోలేదు. చివ‌ర‌కు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ .. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఇన్ చార్జ్ బీటెక్ ర‌వి స్వ‌గ్రామం అయిన కసనూరులో సైతం టీడీపీ మద్దతుదారుడు అధికార పార్టీ అభిమానికి పోటీ కూడా ఇవ్వ‌కుండా ఓడిపోయాడు. టీడీపీ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చాలా చోట్ల పోటీ పెట్ట‌లేని ప‌రిస్థితి. పులివెందుల నియోజకవర్గంలో 108 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 16వ తేదీ ఉపసంహరణ గడువు నాటికి ఏకంగా 90 పంచాయతీలను chandra babu jagan;minister;alla ramakrishna reddy;letter;tdp;pulivendula;ycp;reddy;party;nandyalaజ‌గ‌న్ ఇలాకాలో టీడీపీ సైకిల్‌కు త‌ప్పు పట్టింది... చ‌రిత్ర‌లో ఘోర అవ‌మానం ?జ‌గ‌న్ ఇలాకాలో టీడీపీ సైకిల్‌కు త‌ప్పు పట్టింది... చ‌రిత్ర‌లో ఘోర అవ‌మానం ?chandra babu jagan;minister;alla ramakrishna reddy;letter;tdp;pulivendula;ycp;reddy;party;nandyalaMon, 22 Feb 2021 09:40:00 GMTఏపీలో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌లు నాలుగు విడ‌త‌ల్లో ముగిశాయి. అధికార వైసీపీ నాలుగు విడ‌త‌ల్లోనూ స‌త్తా చాటింది. టీడీపీ మాత్రం ఎన్నిక‌లు యేడాది పాటు వాయిదా ప‌డ‌డంతో అంచ‌నాల‌కు మించి పుంజుకున్న మాట వాస్త‌వం. అయితే ఏపీలో మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం వైసీపీ పూర్తిగా స్వీప్ చేసేసింది. మంత్రి పెద్ది రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం పుంగ‌నూరుతో పాటు విప్ పిన్మెల్లి రామ‌కృష్ణా రెడ్డి మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలోనూ... సీఎం జ‌గ‌న్ పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో అస్స‌లు టీడీపీ చోటే ఇవ్వ‌లేదు.

ఆదివారం జరిగిన చివరి విడత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం సర్పంచ్‌ స్థానాలను అధికార వైసీపీ సానుభూతి ప‌రులు ద‌క్కించుకున్నారు. అస‌లు ప్ర‌తిప‌క్ష టీడీపీకి చెందిన మ‌ద్ద‌తుదారులు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా స‌ర్పంచ్ స్థానం గెలుచుకోలేదు. చివ‌ర‌కు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ  .. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఇన్ చార్జ్ బీటెక్ ర‌వి స్వ‌గ్రామం అయిన కసనూరులో సైతం టీడీపీ మద్దతుదారుడు అధికార పార్టీ అభిమానికి పోటీ కూడా ఇవ్వ‌కుండా ఓడిపోయాడు.

టీడీపీ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చాలా చోట్ల పోటీ పెట్ట‌లేని ప‌రిస్థితి. పులివెందుల నియోజకవర్గంలో 108 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 16వ తేదీ ఉపసంహరణ గడువు నాటికి ఏకంగా 90 పంచాయతీలను వైసీపీకి చెందిన మ‌ద్ద‌తు దారులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు.  5 మండలాల్లోని 18 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా అన్నింటిలోనూ వైఎస్సార్‌సీపీ అభిమానులే ఘ‌న‌విజ‌యం సాధించారు.

కేవ‌లం 8 చోట్ల మాత్ర‌మే టీడీపీ సానుభూతిప‌రులు ఎన్నిక‌ల్లో పోటీ చేసినా ఒక్క‌టంటే ఒక్క చోట కూడా గెల‌వ‌లేదు. నంద్యాలంపల్లి, పైడిపాలెం, దుగ్గనగారిపల్లె పంచాయతీలలో మొత్తంగా కేవలం 6 వార్డులే ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులకు దక్కడం గమనార్హం. దీనిని బ‌ట్టి పులివెందుల‌లో టీడీపీ ప‌రిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుస్తోంది. 


ఆయుర్వేదం ప్రకారం పాటించాల్సిన ఆహార నియమాలు ఇవే..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!

కేసీఆర్ వ్యూహం ఫ‌లించ‌దా..? హైద‌రాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం తీర‌ని క‌లేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>