Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/ex-team-india-selector-revealed-that-virat-kohli-is-so-humble-and-polite9f97c2bf-9a66-4f2d-a0be-a1960a1c06eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/ex-team-india-selector-revealed-that-virat-kohli-is-so-humble-and-polite9f97c2bf-9a66-4f2d-a0be-a1960a1c06eb-415x250-IndiaHerald.jpgటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. అతడితో మాటల యుద్ధానికి దిగాలంటే ఏ దేశ ఆటగాడూ ధైర్యం చేయడు. ఎందుకంటే ఆలా మాటలతో రెచ్చగొడితే కోహ్లీ మరింత పట్టుదలగా ఆడతాడు. అది తమ జట్టుకే నష్టం కలిగిస్తుందని వారికి తెలుసు. అందుకే స్లెడ్జింగ్‌కు పేరుగా..virat kohli;virat kohli;korcha;australia;wife;nijam;v;santoshamకోహ్లీ ఇంట్లో ఎలా ఉంటాడో బయటపెట్టిన మాజీ సెలెక్టర్.. ఇంత మార్పెలా..?కోహ్లీ ఇంట్లో ఎలా ఉంటాడో బయటపెట్టిన మాజీ సెలెక్టర్.. ఇంత మార్పెలా..?virat kohli;virat kohli;korcha;australia;wife;nijam;v;santoshamMon, 22 Feb 2021 19:25:00 GMTఇంటర్నెట్ డెస్క్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. అతడితో మాటల యుద్ధానికి దిగాలంటే ఏ దేశ ఆటగాడూ ధైర్యం చేయడు. ఎందుకంటే ఆలా మాటలతో రెచ్చగొడితే కోహ్లీ మరింత పట్టుదలగా ఆడతాడు. అది తమ జట్టుకే నష్టం కలిగిస్తుందని వారికి తెలుసు. అందుకే స్లెడ్జింగ్‌కు పేరుగా ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి జట్లు కూడా ఇండియాతో మ్యాచ్ అంటూ సైలెంట్‌గా ఉంటున్నాయి.

ఇటీవల జరిగిన ఆసీస్ సిరీస్‌లో, ఇప్పుడు జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్‌లోనూ అదే విషయాన్ని గమనించవచ్చు. అయితే మైదానంలో అంత సీరియస్‌గా ఉండే కోహ్లీ, బయట కూడా అలానే ఉంటాడేమోనని అంతా అనుకుంటుంటారు. అయితే అదంతా అబద్ధమని, కోహ్లీ మైదానాన్ని వీడితో మరో మనిషిగా మారిపోతాడని మాజీ సెలెక్టర్ శరన్‌దీప్ సింగ్ చెప్పుకొచ్చారు.

మైదానంలో ఎంతో  సీరియస్‌గా ఉండే కోహ్లీ బయట మాత్రం కూల్‌గా ఉంటాడని టీమిండియా మాజీ సెలెక్టర్ శరన్‌దీప్ సింగ్ చెప్పారు. కోహ్లీని తాను చాలా దగ్గరగా చూశానని, అతడు మైదానంలో ఉండే తీరుకు, బయట ఉండే తీరుకు చాలా తేడా ఉంటుందని శరన్‌దీప్ వివరించారు. ‘కోహ్లీ మైదానం బయట అడుగుపెట్టాడంటే ఓ కొత్త మనిషిగా మారిపోతాడు.

ఎదుటివారితో వినయంగా ఉంటాడు. టీం సెలెక్షన్ సమావేశాల్లో అతడి తీరును చూస్తే, ఇతడు కోహ్లీనేనా అనే అనుమానం కలగకమానదు. కోహ్లీ వచ్చాడంటే.. ఆ సమావేశం గంట నుంచి గంటన్నర వరకు సాగుతుంది. విరాట్ ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా వింటాడు. అందరితో చాలా మర్యాదగా ఉంటాడం’టూ శరన్‌దీప్ పేర్కొన్నారు.

ఇక విరాట్ ఇంట్లో తన భార్యతో కలిసి చాలా సంతోషంగా ఉంటాడని, ఎప్పుడైనా వారి ఇంటికి వెళితే ఎక్కడేలని మర్యాదలు చేస్తారని శరన్‌దీప్ చెప్పారు. ‘విరాట్ ఇంట్లో పనివారు కూడా ఉండరు. అతడు, అతడి భార్య ఇద్దరే వండి వడ్డిస్తారు. విరాట్ మనతో కలిసి కూర్చుంటాడు. మనతో ముచ్చట్లు పెడతాడు. మనం ఏం చెబుతున్నా వింటాడు. జాతీయ జట్టుకు కెప్టెన్ అయి ఉండి అతడు అంత వినయంతో ఉండడం నిజంగా గొప్ప విషయం. అందుకే అతడంటే జట్టు సభ్యులందరికీ వల్లమాలిన అభిమానం. అతడి మాటను వారంతలా గౌరవించేందుకు కూడా అదే కారణం’టూ శరన్‌దీప్ పేర్కొన్నారు.


రాసి పెట్టుకోండి ప్రభాస్ మూవీ బ్లాక్ బస్టర్ ఖాయం : నాగ అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్ .. ??

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో అసలు ఎన్టీఆర్, చరణ్ కాదు .... ??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>