PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections69f1d1e5-329e-4250-9d3b-074cc6496e96-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections69f1d1e5-329e-4250-9d3b-074cc6496e96-415x250-IndiaHerald.jpgముగిసిన పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విడతలో 80శాతం పైగా మంది ఒటర్లు స్వచ్చందంగా ఓటింగులో పాల్గొన్నారని, దానికి ఎన్నికల సంఘం పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తోందని అన్నారు. చాకచక్యంగా, సమర్థతతో కలెక్టర్లు ఎస్పీలు, ఇతర అధికారులు పనిచేశారన్న ఆయన సమిష్టి కృషితోనే ఇదంతా చేయగలిగామని అన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ మీడియా విశేషంగా కృషి చేసిందని ఓటర్లకు అవగాహన కల్పించడంలో మీడియా కీలకంగా వ్యవహరించిందని అన్నారు. అయితే ఎంపీటీసjagan nimmagadda elections;hari;hari music;jayaprada;media;panchayati;press;marchబ్రేకింగ్ : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పై క్లారిటీ ఇచ్చిన నిమ్మగడ్డబ్రేకింగ్ : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పై క్లారిటీ ఇచ్చిన నిమ్మగడ్డjagan nimmagadda elections;hari;hari music;jayaprada;media;panchayati;press;marchMon, 22 Feb 2021 11:00:00 GMTముగిసిన పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విడతలో  80శాతం పైగా మంది ఒటర్లు స్వచ్చందంగా ఓటింగులో  పాల్గొన్నారని, దానికి ఎన్నికల సంఘం పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తోందని అన్నారు. చాకచక్యంగా, సమర్థతతో కలెక్టర్లు ఎస్పీలు, ఇతర అధికారులు పనిచేశారన్న ఆయన సమిష్టి కృషితోనే ఇదంతా చేయగలిగామని అన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ మీడియా విశేషంగా కృషి చేసిందని ఓటర్లకు అవగాహన కల్పించడంలో మీడియా కీలకంగా వ్యవహరించిందని అన్నారు.

 అయితే ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలు  జరపాలని ముందుగా భావించామని న్యాయ స్థానాల్లో కేసుల కారణంగా ఈ ఎన్నికలకు  కొన్ని అవాంతరాలు ఉన్నాయని అన్నారు. అవరోధాలు తొలగిపోయిన అనంతరం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. మార్చి 2నుంచి పురపాలక ఎన్నికల ప్రక్రియ ఉంటుందని పట్టణ ఓటర్లు కూడా పెద్దఎత్తున ఓటింగులో పాల్గొనాలని ఆయన కోరారు.

 వీలైనంత ఎక్కువగా పోలింగ్ కేంద్రాలు,సదుపాయాలు కల్పిస్తామన్న ఆయన వీడియో కాన్ఫరెన్సులో ఒత్తిళ్ల వల్ల గతంలో  నామినేషన్ల ఉపసంహరించుకున్న వారి విజ్ణప్తులపై చర్చిస్తామని అన్నారు. పురపాలికల్లో నామినేషన్లు వేయలేక పోయిన వారు రుజువులతో సహా ఫిర్యాదు చేస్తే నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తామని ఆయన అన్నారు. పురపాలిక ల్లో నామినేషన్ల ఫిర్యాదుల స్వీకరణ అంశాన్ని సంబంధించి  23లోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికలనూ నిర్విగ్నంగా నిర్వహిస్తామని అన్నారు.

పురపాలక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని పేర్కొన్న ఆయన నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు జయప్రదంగా ముగిశాయన్నారు. అవాంఛనీయ ఘటనల వల్ల ఒక్కచోట కూడా తిరిగి పోలింగ్ జరగలేదని ఎక్కడా ఎన్నికలు వాయిదా పడలేదని అన్నారు. రాజకీయ వర్గాలు, ఓటర్లు విజ్ణతతో వ్యవహరించారని, పంచాయతీల్లో  16శాతం స్థానాలకు మాత్రమే ఏకగ్రీవాలు జరిగాయని ఆయన అన్నారు.  


వంటలక్క సంచలన నిర్ణయం. షాక్ లో ఆమె భర్త

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>