PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/hot-topic-on-greater-mayor-vijayalakshmi-cast-behind-intercast-marriage31ac5b52-63b3-4eed-80ca-73b0c9d85ea7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/hot-topic-on-greater-mayor-vijayalakshmi-cast-behind-intercast-marriage31ac5b52-63b3-4eed-80ca-73b0c9d85ea7-415x250-IndiaHerald.jpgగ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి సోమ‌వారం ఉద‌యం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్లలో ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక పూజలు చేసి.., అనంతరం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సిబ్బంది జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఏడో అంతస్తులో చాంబర్‌ను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజర‌వుతార‌ని చెప్పినా.. ఎందుక‌నో ఆయ‌న దూరంగా ఉన్నారు. ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డmayar;srilatha;vijayalakshmi;mumbai;hyderabad;minister;aquaజీహెచ్ఎంసీ మేయ‌ర్ స‌వాళ్లు... ఆ ప‌ద‌వి ఈ సారి ముళ్ల కిరీట‌మేనా...?జీహెచ్ఎంసీ మేయ‌ర్ స‌వాళ్లు... ఆ ప‌ద‌వి ఈ సారి ముళ్ల కిరీట‌మేనా...?mayar;srilatha;vijayalakshmi;mumbai;hyderabad;minister;aquaMon, 22 Feb 2021 10:15:00 GMTహైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి సోమ‌వారం ఉద‌యం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్లలో ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక పూజలు చేసి.., అనంతరం బాధ్యతలు చేప‌ట్టారు. ఈ మేరకు సిబ్బంది జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఏడో అంతస్తులో చాంబర్‌ను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజర‌వుతార‌ని చెప్పినా.. ఎందుక‌నో ఆయ‌న దూరంగా ఉన్నారు. ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో   మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి ఎన్నికైన విష‌యం తెలిసిందే.


ఎంఐఎం మద్దతుతో కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి మేయర్‌గా, మోతె శ్రీలత ఉప మేయర్‌గా ఎన్నికయ్యారు. ఒకేసారి ఇద్దరు మహిళలకు గ్రేట‌ర్ బాధ్య‌తలు ద‌క్క‌డం చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి. బంజారాహిల్స్ నుంచి విజ‌య‌ల‌క్ష్మి కార్పొరేటర్‌గా ఎన్నికవ్వగా… డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన మోతె శ్రీలత తార్నాక డివిజన్‌ నుంచి గెలుపొందారు. ఇద్ద‌రు అతివ‌ల‌కు గ్రేట‌ర్‌లోని అనేక స‌మ‌స్య‌లు ఇప్పుడు స‌వాళ్లు విసురుతున్నాయి. ఘ‌న‌మైన ప్ర‌గ‌తి సాధించిన స‌మ‌యంలోనూ హైద‌రాబాద్ క‌ఠిన‌మైన తీర్పును టీఆర్ ఎస్ ముందు పెట్టిన విష‌యం తెలిసిందే.


ప్ర‌ధానంగా వ‌ర‌ద‌లు, పారిశుధ్య స‌మ‌స్య‌, తాగునీరు, రోడ్ల నిర్మానం వంటి ప్రాథ‌మిక అవ‌స‌రాల‌ను తీర్చాల‌నే డిమాండ్‌ను మేయ‌ర్‌కు గుర్తు చేస్తున్నారు. అలాగే హైద‌రాబాద్‌ను అంత‌ర్జాతీయ న‌గ‌రంగా మ‌ల్చాల్సిన అవ‌స‌రాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మ‌హాన‌గ‌రాల్లో ముంబై త‌ర్వాత హైద‌రాబాదే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇక్క‌డ ఐటీతో పాటు ఫార్మా రంగం దూసుకెళ్తోంది. పారిశ్రామిక ప్ర‌గ‌తిని కాపాడుతూనే జ‌నాల అసౌక‌ర్యాల‌ను తీర్చాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. అస‌లే లోటు బ‌డ్జెట్‌తో, క‌నీసం జీతాల చెల్లింపుల‌కే ఇబ్బంది ప‌డిపోతున్న కార్పోరేష‌న్‌ను ఎలా గాడిన పెడుతారోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.విజ‌య‌ల‌క్ష్మీ రాజ‌కీయంగా నిల‌దొక్కుకోవ‌డానికి కూడా మంచి అవ‌కాశంగా కూడా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.




వైరల్ : కరోనా వైరస్ నుంచి కాపాడే యాంటీ వైరల్ కోటింగ్ మాస్క్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!

కేసీఆర్ వ్యూహం ఫ‌లించ‌దా..? హైద‌రాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం తీర‌ని క‌లేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>