HealthParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/covid-more-effective-on-men-reproductive-systemd75a329b-4f41-4eb8-a9a6-203b87968007-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/covid-more-effective-on-men-reproductive-systemd75a329b-4f41-4eb8-a9a6-203b87968007-415x250-IndiaHerald.jpgపురుషుల్లో వీర్యకణాల నాణ్యతను కొవిడ్ దెబ్బతీస్తుందని, దీనివల్ల సంతానోత్పత్తి శక్తిని తగ్గిస్తుందని తాజా అధ్యయనాల్లో తేలింది. 2.2 మిలియన్ల మందిని బలిగొన్న కరోనా వైరస్ పురుషుల్లో వీర్యకణాల నాణ్యత, పరిమాణంను దెబ్బతీసి, పురుషుల్లో సంతానోత్సత్తి సామర్ధ్యాన్ని దెబ్బ తీస్తాయ. వీర్యకణాల వృద్ధి, నాణ్యతను కరోనా దెబ్బ తీస్తుందని జర్మనీ జస్లస్ లైబిగ్ విశ్వవిద్యాలయానికి చెందిన ‘బెహ్లాద్ హజీజాదే మాలెకి’ చెప్పారు.covid more effective on men reproductive system;auto;education;bindu;bindhu;hyderabad;india;germany;patna;director;heart;aqua;letter;shakti;coronavirusకరోనా సోకితే షాకింగే: పురుషుల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గటం గ్యారెంటీ - ఇంకెత నష్టమో తెలుసా?కరోనా సోకితే షాకింగే: పురుషుల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గటం గ్యారెంటీ - ఇంకెత నష్టమో తెలుసా?covid more effective on men reproductive system;auto;education;bindu;bindhu;hyderabad;india;germany;patna;director;heart;aqua;letter;shakti;coronavirusMon, 22 Feb 2021 18:00:00 GMTకరోనా మహమ్మారి ప్రభావంతో ఏయే శరీరాంగాలు దెబ్బతింటాయి? అని అడిగితే,  ఠకీమని వచ్చే సమాధానం “ఊపిరి తిత్తులు గుండె ” అని. ఇక జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు ఇవన్నీ దాని లక్షణాలు.


ఇటీవల భారతీయ పరిశోధకుల బృందం, హైదరాబాద్ సహా, 5 నగరాల్లో, కరోనా వల్ల ఏయే శరీర భాగాలు దెబ్బతింటా యి అనే విషయంపై పరిశోధన జరిపింది.


ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్” (ఎయిమ్స్), ఇందులో “శరీర నిర్మాణాన్ని పరిశీలించే విభాగం” అనాటమీ వారున్నారు. అలాగే, “నాగపూర్, పాట్నా, దేవఘర్ యూనిట్లు, హైదరాబాదులోని ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ & హాస్పిటల్, ఛండీగఢ్‌లోని ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌’ వీటికి సంబంధించిన పరిశోధకులు అంతాకలిసి 45 రీసెర్చ్ పబ్లికేషన్లను డీటెయిల్డ్ గా విశ్లేషించారు.


షాకింగ్ ఫలితం ఏ మంటే - ప్రధానంగా కరోనా వైరస్, శ్వాస అవయవాలు, వ్యాధి నిరోధక శక్తిపై దాడి చేస్తోంది. అలాగే మిగతా బాగాలైన గుండె, యురినరీ, పేగులు, పునరుత్పత్తి  అవయవాలు, మెదడు, జుట్టు, చర్మం, గోళ్లు, ఎండోక్రిన్ గ్లాండ్స్ వంటి వాటిపైనా ప్రభావం చూపు తోంది. ముసలివాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిపై కరోనా ఎక్కువ ప్రభావం చూపుతోంది - అని తేలింది. అధ్యయన వివరాల్ని ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ పాథోలజీ’ లో ప్రచురించారు.



కొవిడ్ తో శ్వాసకోశ అనారోగ్యానికి కారణమవడంతో పాటు వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని వెల్లడైంది. శ్వాసకోశ బిందువుల ద్వారా కరోనా వైరస్ ఊపిరి తిత్తులు, మూత్రపిండాలు, పేగులు, గుండెపై దాడి చేస్తాయని తేల్చారు. వైరస్ పరిమాణం, ప్రభావం తక్కువ ఉన్నవారికి మాత్రం ఈ వైరస్, గొంతు నొప్పి, జ్వరం, అసౌకర్యం, శ్వాస సంబంధిత సమస్యలు తెస్తోందని గుర్తించారు. కొన్ని సందర్భాల్లో ఊపిరి ఆడక చని పోతున్నారని గుర్తించారు. మహిళల్లో కంటే మగవాళ్లలో కరోనావల్ల కిడ్నీల వైఫల్యం ఎక్కువ అని చెబుతున్నారు.




పురుషుల్లో వీర్యకణాల నాణ్యతను కొవిడ్ దెబ్బతీస్తుందని, దీనివల్ల సంతానోత్పత్తి శక్తిని తగ్గిస్తుందని తాజా అధ్యయనాల్లో తేలింది. 2.2 మిలియన్ల మందిని బలిగొన్న కరోనా వైరస్ పురుషుల్లో వీర్యకణాల నాణ్యత, పరిమాణంను దెబ్బతీసి, పురుషుల్లో సంతానోత్సత్తి సామర్ధ్యాన్ని దెబ్బ తీస్తాయ. వీర్యకణాల వృద్ధి, నాణ్యతను కరోనా దెబ్బ తీస్తుందని జర్మనీ జస్లస్ లైబిగ్ విశ్వవిద్యాలయానికి చెందిన ‘బెహ్లాద్ హజీజాదే మాలెకి’ చెప్పారు.




కొవిడ్ ప్రభావానికి గురైన రోగులు 84 మంది పురుషులను 60 రోజుల పాటు విశ్లేషించగా, పురుషుల్లో కరోనా వల్ల వీర్య ఉత్పత్తి తక్కువ అవడంతో పాటు, నాణ్యత కూడా తగ్గి సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని తగ్గిస్తుందని తేలినట్లు పరిశోధకులు వివరించారు. కాగా కరోనా వల్ల వీర్యకణాల్లో నాణ్యత తగ్గిందని, అయినా సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గిందని పురుషులు భయపడ వద్దని బ్రిటన్ లోని “ఫెర్టిలిటీ గ్రూప్ పిండాలజీ” డైరెక్టర్"  కాంప్ బెల్ చెప్పారు.


మొత్తం మీద తెలిసేదేమంటే కరోనా మహమ్మారి వైరస్ మనకి సోకకుండా చూసుకోవడమే ముఖ్యం. కరోనా వైరస్‌ను ఏడాదైనా, సరిగా అంచనా వెయ్యలేక పోతున్నారు. అందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. పొరపాటున సోకితే, వెంటనే చికిత్స తీసుకోవడం అత్యవసరం. గతవారం రోజుల నుంచి దేశంలో కరోనా మళ్లీ తిరగ బెడుతుందని తెలుస్తుంది. వెంట్రుకలో వెయ్యో వంతు ఉండే కరోనా వైరస్ ‌ను ఏడాదైనా, సరిగా అంచనా వెయ్యలేక పోతున్నారు. అందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 

కాబట్టి - 1. సామాజిక దూరం పాటించటం 2. మాస్కులు ధరించటం, 3. శానిటైజర్ల వాడకం - తప్పని సరి అంటున్నారు నిపుణులు.

 




రాజరికపు హోదా ఎవరైనా వదులుకుంటారా..?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?

బ్రేకింగ్‌: లోక్‌స‌భ ఎంపీ ఆత్మ‌హ‌త్య‌... హోట‌ల్లోనే

చర్చల్లోకి దృశ్యం - 3 కధ ?

జగడ్డ : పాపం టీడీపీ, అమరావతిలోనే ఘోర పరాభవం !

టీడీపీ విజయాల లెక్క తేలింది

పాద‌యాత్ర చేసినా.. సాయిరెడ్డిని మైన‌స్ చేసింది వీళ్లే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>