PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagadda-nede-akari-panchayithi-poru-gelupu-evariki-sonthamd2bcbf63-f34f-4584-b3c7-b150fdfe1237-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagadda-nede-akari-panchayithi-poru-gelupu-evariki-sonthamd2bcbf63-f34f-4584-b3c7-b150fdfe1237-415x250-IndiaHerald.jpgఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. నిన్న నాలుగో దశ పోలింగ్ జరగ్గా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ పోలింగ్ కు సంబంధించిన విజేతలను కూడా ప్రకటించారు. అయితే పార్టీ గుర్తులకు సంబంధం లేకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎవరికి వాళ్ళే లెక్కలు చెప్పుకుంటూ వస్తున్నారు కానీ వైసిపి హవా మాత్రం కనిపిస్తోంది. దాదాపుగా అన్ని దశల్లోనూ వైసీపీ మద్దతు దారులు అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నారు.. అధికారంలో ఉండటంతో ఇది ఎప్పుడూ జరిగే ప్రక్రియే. అయితే టీడీపీ కూడా ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు సjagan nimmagadda elections;pawan;choudary actor;dr rajasekhar;tiru;vennela;bandara;jagan;rapaka vara prasada rao;andhra pradesh;janasena;mp;panchayati;assembly;mla;minister;tdp;ycp;janasena party;rajolu;reddy;razole;party;pedakakani;kothapalli samuel jawaharజగడ్డ : బడా నేతలకు షాకిచ్చిన వోటర్లు..జగడ్డ : బడా నేతలకు షాకిచ్చిన వోటర్లు..jagan nimmagadda elections;pawan;choudary actor;dr rajasekhar;tiru;vennela;bandara;jagan;rapaka vara prasada rao;andhra pradesh;janasena;mp;panchayati;assembly;mla;minister;tdp;ycp;janasena party;rajolu;reddy;razole;party;pedakakani;kothapalli samuel jawaharMon, 22 Feb 2021 14:00:00 GMTఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. నిన్న నాలుగో దశ పోలింగ్ జరగ్గా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ పోలింగ్ కు సంబంధించిన విజేతలను కూడా ప్రకటించారు. అయితే పార్టీ గుర్తులకు సంబంధం లేకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎవరికి వాళ్ళే లెక్కలు చెప్పుకుంటూ వస్తున్నారు కానీ వైసిపి హవా మాత్రం కనిపిస్తోంది. దాదాపుగా అన్ని దశల్లోనూ వైసీపీ మద్దతు దారులు అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నారు.. అధికారంలో ఉండటంతో ఇది ఎప్పుడూ జరిగే ప్రక్రియే. అయితే టీడీపీ కూడా ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు సాధించడంతో వారు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. 

ఇక అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన జనసేన కూడా చెప్పుకోదగ్గ స్థానాలు సాధించడంతో జనసేన శ్రేణులు సైతం సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. ఈ విషయం పక్కనపెడితే బడా నేతలని భావించే కొందరికీ సొంత గ్రామాలలో షాకిచ్చారు అక్కడి ఓటర్లు. మరీ ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేలకు కొంత మందికి ఈ షాక్ తగలటం ఆసక్తికరంగా మారింది. ముందుగా కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామం ఆలూరు మేజర్ పంచాయతీలో టిడిపి బలపరిచిన అభ్యర్థి విజయం సాదించారు. అలాగే వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆయన సోదరుడు వైసీపీ ఎంపీ స్వగ్రామమైన పెదకాకాని పంచాయతీలో టిడిపి బలపరిచిన అభ్యర్థి 72 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన అంశం చర్చనీయాంశంగా మారింది.

 అలాగే పవన్ జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత జగన్ కి జై కొట్టిన రాపాక వరప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజోలులో దాదాపు 20కి పైగా గ్రామాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించడం ఆసక్తికరంగా మారింది. ఇక విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి స్వగ్రామమైన వెన్నెల పాలెం లో గత నలభై సంవత్సరాల నుంచి బండారు సత్యనారాయణమూర్తి చూపించిన అభ్యర్థిని గెలిపిస్తూ వచ్చారు అక్కడి గ్రామస్తులు.

 కానీ ఇప్పుడు వైసిపి బలపరిచిన అభ్యర్థి 663 ఓట్లు మెజార్టీతో గెలుపొందిన ఆయనకు షాకింగ్ అంశం అనే చెప్పాలి. ఇక దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి స్వగ్రామం రాయుడు పాలెంలో కూడా టిడిపి బలపరిచిన అభ్యర్థి విజయం సాదించారు. అలానే గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత మర్రి రాజశేఖర్ స్వగ్రామం తిక్కిరెడ్డిపాలెంలో టిడిపి బలపరిచిన అభ్యర్థి గెలుపొందిన ఆశ్చర్యకరంగా మారింది. ఇక మాజీ మంత్రి కే జవహర్ స్వగ్రామంలో వైసిపి గెలుపొందింది.కృష్ణాజిల్లా తిరువూరు మండలం గానుగ పాడు పంచాయతీ సర్పంచిగా వైసీపీ అభ్యర్థి విజయం సాదించారు. 


నమస్కారం పెట్టేసిన లోకేష్...!

పంచాయ‌తీ ఎఫెక్ట్‌.. జ‌న‌సేన‌కు ఆ విష‌యంలో క్లారిటీ.. ఏంటంటే...!

ఎడిటోరియల్: తెగించిన తెలంగాణ పాలకులు-ఇంత జరిగినా శాంతి భద్రలపై స్పందన కరువు-పాలన ఉన్నంతవరకు దోపిడీకి యథేచ్చేనా?

నటి లయ నేషనల్ చెస్ ఛాంపియన్ అని మీకు తెలుసా..!

పురపోరు: మంత్రులకు టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్

అదిరిపోయే సబ్జెక్ట్ తో విజయశాంతి సినిమా...?

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>