PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఒక ఛానల్ ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయనే ప్రచారం గత కొంతకాలంగా ఎక్కువగా జరుగుతూనే ఉంది. తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని భావిస్తున్న పార్టీ ఇప్పుడు అమరావతి కేంద్రంగా పార్టీ ఆఫీసులో కూడా నిర్మించే ఆలోచనలో ఉంది. దక్షిణాదిలో అతి పెద్ద పార్టీ ఆఫీస్ ని అమరావతిలో నిర్మించే అవకాశాలున్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. విజయవాడ లేదా మంగళగిరిలో ఈ పార్టీ ఆఫీస్ నిర్మాణం జరిగే అవకాశాలు ఉన్నాయి అని చాలామంది అంచనా వేశారు. అయితే అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయడాbjp;bharatiya janata party;amaravati;vijayawada;andhra pradesh;tamilnadu;central government;office;partyఏపీలో బిజెపి ఛానల్ నిర్మాణం...?ఏపీలో బిజెపి ఛానల్ నిర్మాణం...?bjp;bharatiya janata party;amaravati;vijayawada;andhra pradesh;tamilnadu;central government;office;partyMon, 22 Feb 2021 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఒక ఛానల్ ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయనే ప్రచారం గత కొంతకాలంగా ఎక్కువగా జరుగుతూనే ఉంది. తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని భావిస్తున్న పార్టీ ఇప్పుడు అమరావతి కేంద్రంగా పార్టీ ఆఫీసులో కూడా నిర్మించే ఆలోచనలో ఉంది. దక్షిణాదిలో అతి పెద్ద పార్టీ ఆఫీస్ ని అమరావతిలో నిర్మించే అవకాశాలున్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. విజయవాడ లేదా మంగళగిరిలో ఈ పార్టీ ఆఫీస్ నిర్మాణం జరిగే అవకాశాలు ఉన్నాయి అని చాలామంది అంచనా వేశారు.

అయితే అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి రెడీ అన్నట్లుగా కూడా ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఒక ఛానల్ నిర్మాణానికి సంబంధించి విజయవాడలో ఇప్పుడు చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇప్పటికే ఛానల్ ని కొనుగోలు చేయడానికి భారతీయ జనతా పార్టీ రెడీ అయినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు జరిపారని త్వరలోనే దీనిపై క్లారిటీ కూడా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల మీద భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.

 ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీ ఆఫీస్ తో పాటు ఛానల్ నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేస్తే తమకు భవిష్యత్తులో మంచి మేలు చేకూరుతుందని ఆలోచనలో భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు అని అంటున్నారు. కర్ణాటకలో కూడా భారతీయ జనతా పార్టీ మంచి బలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెడితే తమిళనాడులో కూడా ఫలితం ఉంటుంది అనే భావనలు కూడా ఉన్నాయి. అయితే తమిళనాడు ఎన్నికలు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఛానల్ నిర్మాణానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. మరి దీనిపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూడాలి.


శరీరంలో ఏర్పడిన విషపదార్ధాలను తొలగించేందుకు సులువైన మార్గాలు ఇవే..!

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!

కేసీఆర్ వ్యూహం ఫ‌లించ‌దా..? హైద‌రాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం తీర‌ని క‌లేనా..?

దృశ్యం 2 సూపర్ హిట్.. దృశ్యం 3 కూడా ఉందట..!

జగడ్డ : టీడీపీ మాజీ మంత్రికి గట్టి షాక్...?

హెరాల్డ్ సెటైర్ : పాపం..ఎల్లోమీడియా బాధ మామూలుగా లేదుగా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>