PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgవాస్త‌వానికి ఇప్ప‌టికే ఏడాదికి పైగా రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం ఉద్య‌మం సాగుతోంది. గుంటూరులోని గ్రామాల్లో రాజ‌ధాని వేడి కొన‌సాగు తోంది. అయితే.. ఇటీవల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీనే గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. గుంటూరు కార్పొరేష‌న్ ప‌రిధిలో కొన్ని గ్రామాలు ఉండ‌డంతో ఇప్పుడు వీరు ఎలాంటి తీర్పు ఇస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. ఇక‌, విజ‌య‌వాడలోనూ రాజ‌ధాని పై ఆశ‌లు ఉన్నాయి. రాజ‌ధాని రాక‌తో.. విజ‌య‌వాడ‌లో భూముల ధ‌ర‌లు పెరగడంతోపాటు.. వ్యాపారాలు కూడా వృద్ధి చెందాయి. దీంతో రాజ‌ధానిపై ఇక్క‌డి ప్ర‌జ‌లుjagan ysrcp;view;guntur;adinarayanareddy;winner;letter;tdp;ycp;amaravathiవైసీపీకి ఆ రెండు కార్పొరేష‌న్లలో దెబ్బ త‌ప్ప‌దా... నేత‌ల్లో టెన్ష‌న్ టెన్ష‌న్ ?వైసీపీకి ఆ రెండు కార్పొరేష‌న్లలో దెబ్బ త‌ప్ప‌దా... నేత‌ల్లో టెన్ష‌న్ టెన్ష‌న్ ?jagan ysrcp;view;guntur;adinarayanareddy;winner;letter;tdp;ycp;amaravathiMon, 22 Feb 2021 08:51:00 GMTరాష్ట్రంలో ప్రారంభ‌మైన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఊపందుకుంది. నాయ‌కులు.. అభ్య‌ర్తులు.. పార్టీలు ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీలు ఈ ఎన్నిక ల‌ను ప్ర‌తిష్టాత్మంగా బావిస్త‌న్నాయి. మొత్తం 12 కార్పొరేష‌న్ల‌లో పాగా వేసేందుకు వైసీపీ, త‌న అస్తిత్వాన్ని నిల‌బెట్టుకునేందుకు టీడీపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నాయి. ఈ క్ర‌మంలో ఎవ‌రికి వారు ప‌క్కా స్కెచ్‌తో దూసుకుపోతున్నారు. అయితే.. కొన్ని చోట్ల టీడీపీ మేయ‌ర్ పీఠాల విష‌యంలో చేస్తున్న జాప్యం, ప్ర‌క‌ట‌నల కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఇదిలావుంటే, రెండు కీల‌క జిల్లాల్లో రాజ‌ధాని అమ‌రావ‌తి ఎఫెక్ట్ ప‌డుతుంద‌నే చ‌ర్చ సాగుతోంది. గుంటూ రు కార్పొరేష‌న్‌, విజ‌యవాడ కార్పొరేష‌న్ల‌పై రాజ‌ధాని అమ‌రావతి ప్ర‌భావం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల కులు. రాజ‌ధాని మార్పును ఈ రెండు జిల్లాల ప్ర‌జ‌లు రాజ‌ధాని విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది తాజా ఎన్నిక‌ల్లో స్ప‌ష్టం అవుతుంద‌ని అంటున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే ఏడాదికి పైగా రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం ఉద్య‌మం సాగుతోంది. గుంటూరులోని గ్రామాల్లో రాజ‌ధాని వేడి కొన‌సాగు తోంది. అయితే.. ఇటీవల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీనే గెలుపు గుర్రం ఎక్కింది.

అయితే.. గుంటూరు కార్పొరేష‌న్ ప‌రిధిలో కొన్ని గ్రామాలు ఉండ‌డంతో ఇప్పుడు వీరు ఎలాంటి తీర్పు ఇస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. ఇక‌, విజ‌య‌వాడలోనూ రాజ‌ధాని పై ఆశ‌లు ఉన్నాయి. రాజ‌ధాని రాక‌తో.. విజ‌య‌వాడ‌లో భూముల ధ‌ర‌లు పెరగడంతోపాటు.. వ్యాపారాలు కూడా వృద్ధి చెందాయి. దీంతో రాజ‌ధానిపై ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, వైసీపీ స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత మూడు రాజ‌ధానుల విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. దీనిని బ‌ట్టి.. వైసీపీవైపు జ‌నాలు మొగ్గుతారా ? అనేది సందేహం.

అయితే.. తాము అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల ముందు రాజ‌ధాని విష‌యం చిన్న‌దేన‌ని వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో రాజ‌ధానిపై త‌మ వాద‌న‌ను ప్ర‌జ‌లు అంగీక‌రించార‌నేది వైసీపీ నేత‌ల మాట‌. ఇక‌, టీడీపీ ఆది నుంచి అమ‌రావ‌తి వాద‌న‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తోంది. ఈ నేప‌త్యంలో గుంటూరు,విజ‌య‌వాడ కార్పొరేష‌న్ల ప‌రిధిలో ఎవ‌రు విజేత.. ఎవ‌రు మేయ‌ర్ పీఠాన్ని అందిపుచ్చుకుం టారు? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


శరీరంలో ఏర్పడిన విషపదార్ధాలను తొలగించేందుకు సులువైన మార్గాలు ఇవే..!

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!

కేసీఆర్ వ్యూహం ఫ‌లించ‌దా..? హైద‌రాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం తీర‌ని క‌లేనా..?

దృశ్యం 2 సూపర్ హిట్.. దృశ్యం 3 కూడా ఉందట..!

జగడ్డ : టీడీపీ మాజీ మంత్రికి గట్టి షాక్...?

హెరాల్డ్ సెటైర్ : పాపం..ఎల్లోమీడియా బాధ మామూలుగా లేదుగా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>