Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/sunrisers-hyderabad37c99a65-917f-4661-897c-1062b3484bb7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/sunrisers-hyderabad37c99a65-917f-4661-897c-1062b3484bb7-415x250-IndiaHerald.jpgఐపీఎల్ ఇంకా మొదలు కాక ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలేలా ఉంది. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఐపీఎల్‌లో పాల్గొనే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌కు ఓ డాషింగ్ ఓపెనర్‌ను కోల్పోనుంది. కొన్ని నెలలుగా తొడ కండరాల గాయంతో..sunrisers hyderabad;yajamanya;cricket;australia;interview;icc t20ఐపీఎల్ ముందు సన్‌రైజర్స్‌కు షాక్.. స్టార్ బ్యాట్స్‌మన్ దూరం కానున్నాడా..?ఐపీఎల్ ముందు సన్‌రైజర్స్‌కు షాక్.. స్టార్ బ్యాట్స్‌మన్ దూరం కానున్నాడా..?sunrisers hyderabad;yajamanya;cricket;australia;interview;icc t20Mon, 22 Feb 2021 21:44:00 GMTఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ ఇంకా మొదలు కాక ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలేలా ఉంది. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఐపీఎల్‌లో పాల్గొనే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌కు ఓ డాషింగ్ ఓపెనర్‌ను కోల్పోనుంది. కొన్ని నెలలుగా తొడ కండరాల గాయంతో బాధపడుతున్న వార్నర్ ఇంకా కోలుకోలేదు. అతడు పూర్తి స్థాయిలో కోలుకునేందుకు కనీసం 9 నెలల సమయం పడుతుందని జట్టు వైద్యులు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంతే కాకుండ ఆ విషయాన్ని వార్నర్ వార్నర్ స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. వార్నర్ ఈ విషయాన్ని కావాలనే చెప్పాడా..? ఐపీఎల్‌లో తాను అందుబాటులో ఉండననే విషయాన్ని సన్‌రైజర్స్‌కు చూచూయగా తెలియజేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా..? అనే అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో కలుగుతున్నాయి.

ఇదిలా ఉంటే గతేడాది ఇండియాతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా వార్నర్‌కు గాయమైంది. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా తొడకండరాలు పట్టేసి నడవలేని స్థితికి చేరాడు. దీంతో ఫిజియో సిబ్బంది వచ్చి అతడిని తమతో తీసుకెళ్లారు. అయితే టెస్టు సిరీస్‌లో జట్టు ఓడిపోతుండడంతో తిరిగి జట్టులోకొచ్చాడు. కానీ అంత గొప్ప ప్రదర్శన ఏమీ చేయలేదు. అయితే గాయం మాత్రం మళ్లీ తిరగబెట్టింది. దీంతో అతడు మళ్లీ వైద్యుల సూచనల మేరకు తిరిగి విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఈరోజు(సోమవారం) నుంచి న్యూజిల్యాండ్‌తో ప్రారంభమైన టీ20 సిరీస్‌లో కూడా వార్నర్ ఆడడం లేదు. జట్టు యాజమాన్యం కూడా అతడిని జట్టుకు ఎంపికచేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతడిని ఐపీఎల్‌కు ఆడేందుకు కూడా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు.. సీఏ(క్రికెట్ ఆస్ట్రేలియా) అనుమతించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే మరో రెండు నెలల్లో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్-2021 సీజన్లో ఎస్‌ఆర్‌హెచ్ జట్టు వార్నర్ లేకుండానే బరిలోకి దిగాల్సి ఉంటుంది. అప్పుడు కెప్టెన్‌గా ఎవరు ఉంటారనే దానిపై కూడా ప్రస్తుతం అనేక సందేహాలు కలుగుతున్నాయి.


జామ పండు తినడం వల్ల రక్తపోటును నియంత్రించవచ్చా?

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>