PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/minister1ef94618-a2be-4d57-999d-3c62341de096-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/minister1ef94618-a2be-4d57-999d-3c62341de096-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో ఒక్క పూట తిండి లేకుండా అయినా ఉంటారేమో కానీ ఫోన్ చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. అలాంటిది ఫోన్ కి సిగ్నల్ లేకుంటే ఇక వారికీ ప్రాణాలు పోయినట్లే ఉంటారు. ఇక ఫోన్ కి సిగ్నల్ కోసం నానా తిప్పలు పడుతుంటారు. అయితే సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో ఓ మంత్రి ఏకంగా జెయింట్ వీల్ ఎక్కారు. మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. minister;ashok;korcha;smart phone;huzur nagar;village;minister;local languageవైరల్ : ఫోన్ సిగ్నల్స్ కోసం ఏకంగా జైంట్ వీల్ ఎక్కిన మంత్రి...!వైరల్ : ఫోన్ సిగ్నల్స్ కోసం ఏకంగా జైంట్ వీల్ ఎక్కిన మంత్రి...!minister;ashok;korcha;smart phone;huzur nagar;village;minister;local languageMon, 22 Feb 2021 10:00:00 GMTఫోన్ చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. అలాంటిది ఫోన్ కి సిగ్నల్ లేకుంటే ఇక వారికీ ప్రాణాలు పోయినట్లే ఉంటారు. ఇక ఫోన్ కి సిగ్నల్ కోసం నానా తిప్పలు పడుతుంటారు. అయితే సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో ఓ మంత్రి ఏకంగా జెయింట్ వీల్ ఎక్కారు. మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అశోక్ నగర్ జిల్లాలోని ఆంకో గ్రామంలో భగవత్ కథ అనే సాంస్కృతి కార్యక్రమం నిర్వహించారు. అలాగే, శ్రీరామ మహాయజ్ఞం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు. చుట్టూ కొండల మధ్య ఉండే ఆ ఊరికి మంత్రి బ్రజేంద్ర సింగ్ కూడా వెళ్లారు. అక్కడకు వెళ్లిన మంత్రికి అంకో గ్రామస్తులు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. చాలా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి వెంటనే వారి ముందు సెల్ ఫోన్ తీసి అధికారులతో మాట్లాడాలని అనుకున్నారు. కానీ, సెల్ ఫోన్ సిగ్నల్ రావడం లేదు.

ఇక ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే.. ఆయనకు అక్కడ ఊళ్లో ఏర్పాటు చేసిన 50 అడుగుల ఎత్తయిన జెయింట్ వీల్ కనిపించింది. దీంతో వెంటనే మంత్రి ఆ జెయింట్ వీల్ ఎక్కి తాను కూర్చున్న క్యాబిన్ పూర్తిగా పైకి వెళ్లిన తర్వాత అక్కడ జెయింట్ వీల్ ఆపేసి.. అధికారులకు ఫోన్ చేశారు. తాను అంకో గ్రామంలో ఉన్నానని.. ఈ గ్రామస్తులు ఏకరువు పెట్టిన సమస్యలు అన్నిటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో స్థానిక న్యూస్ పేపర్లో ప్రచురితం అయింది. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ విషయంపై మంత్రి బ్రజేంద్ర సింగ్ యాదవ్ స్పందించారు. ‘స్థానికుల సమస్యల గురించి అధికారులకు చెప్పేందుకు ట్రై చేస్తే సెల్ ఫోన్ సిగ్నల్ రాలేదని తెలిపారు. దీంతో జెయింట్ వీల్ ఎక్కా. భగవత్ కథ, శ్రీరామ యజ్ఞం కార్యక్రమాలకు ఆయనే చేయిస్తున్నట్లు తెలిపారు. అక్కడ తొమ్మిది రోజులు ఉన్నా అని మంత్రి బ్రజేంద్ర సింగ్ వెల్లడించారు.


ఆయుర్వేదం ప్రకారం పాటించాల్సిన ఆహార నియమాలు ఇవే..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!

కేసీఆర్ వ్యూహం ఫ‌లించ‌దా..? హైద‌రాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం తీర‌ని క‌లేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>