PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/visakhaee99567a-296c-4ec9-95d2-2801b14b7e77-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/visakhaee99567a-296c-4ec9-95d2-2801b14b7e77-415x250-IndiaHerald.jpgరాజకీయాలు అంటే అంతే మరి చేతి కాడ కూడు నోటి కాడకు చేరే లోగానే ఎన్నో మారిపోతాయి. ఒకనాడు చెప్పిన మాటలు మరో నాటికి అసలు ఉండవు. అయినా కూడా ఇది రాజకీయం. అన్నీ తెలిసే అటూ ఇటూ చేరుతూ మారుతూ ఉంటారు. ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ జిల్లాలో ఇపుడు మునిసిపల్ పోరు రసవత్తరంగా సాగుతోంది. visakha;shankar;scheduled caste;vishakapatnam;job;mla;minister;tdp;ycp;ayyannapatrudu;annayyaపుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?visakha;shankar;scheduled caste;vishakapatnam;job;mla;minister;tdp;ycp;ayyannapatrudu;annayyaMon, 22 Feb 2021 17:36:00 GMTవిశాఖ జిల్లాలో ఇపుడు మునిసిపల్ పోరు రసవత్తరంగా సాగుతోంది.

జిల్లాలో నర్శీపట్నం మునిసిపాలిటీ మీద అందరి దృష్టి ఉంది. ఇక్కడ గెలిచేది ఎవరు అన్న చర్చ కూడా సాగుతోంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇలాకా అయిన నర్శీపట్నంలో మునిసిపాలిటీని గెలుచుకుని తమ సత్తా చాటడానికి వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ పావులను వేగంగా కదుపుతున్నారు. అయ్యన్న సీనియారిటీని సవాల్ చేస్తున్నారు.

ఇక అయ్యన్నపాత్రుడి కుటుంబంలోనే చిచ్చు పెట్టి ఆయన తమ్ముడు మాజీ మునిసిపల్ వైఎస్ చైర్మన్ సన్యాసిపాత్రుడిని వైసీపీ వైపునకు తిప్పుకుని గెలిచిన ఎమ్మెల్యే ఆయనకు నాడు మునిసిపల్ చైర్మన్ పదవిని ఇస్తామని హామీ ఇచ్చారని ప్రచారం అయితే ఉంది. కానీ ఇపుడు చూస్తే నర్శీపట్నం మునిసిపాలిటీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దాంతో అయ్యన్న తమ్ముడు ఎటూ కాకుండా రాజకీయ అయోమయంలో పడ్డారని అంటున్నారు.

ఇదంతా కావాలనే వైసీపీ పెద్దలు చేశారని కూడా ఆయన అనుచరులు అనుమానిస్తున్నారు. మరి ఇపుడు మునిసిపల్ ఎన్నికలు పోటా పోటీగా జరుగుతున్నాయి. అన్నయ్య అయ్యన్నకు సహకరిస్తారా లేక వైసీపీ గెలుపునకు గట్టిగా కృషి చేస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. అటు వైపు చూస్తే కౌన్సిలర్లుగా వదిన, అన్నయ్య కుమారుడు పోటీలో ఉన్నారు. నర్శీపట్నం పంచాయతీగా ఉన్నప్పటి నుంచి అయ్యన్న కుటుంబం చేతుల్లోనే ఉంది. మరి ఈ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుందా అన్న టాక్ కూడా ఉంది. ఏది ఏమైనా వైసీపీకి నర్శీపట్నం మునిసిపాలిటీ గెలుపు టఫ్ జాబ్ అంటున్నారు.
 




ఏ సినిమా వర్క్ అవుట్ అవట్లేదని దాన్ని నమ్ముకున్న తేజ..?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?

బ్రేకింగ్‌: లోక్‌స‌భ ఎంపీ ఆత్మ‌హ‌త్య‌... హోట‌ల్లోనే

చర్చల్లోకి దృశ్యం - 3 కధ ?

జగడ్డ : పాపం టీడీపీ, అమరావతిలోనే ఘోర పరాభవం !

టీడీపీ విజయాల లెక్క తేలింది

పాద‌యాత్ర చేసినా.. సాయిరెడ్డిని మైన‌స్ చేసింది వీళ్లే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>