MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru194d0219-9c34-4e98-aac5-0c7de296885f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru194d0219-9c34-4e98-aac5-0c7de296885f-415x250-IndiaHerald.jpgసినిమాను తెలుగులో చిత్రం అంటారు. మరి చిత్ర పరిశ్రమ కూడా చిత్రాతిచిత్రమే. ఇక్కడ అనుకున్నవి జరగవు. జరిగేవి ఎవరూ అసలు ఊహించలేరు. తొంబై ఏళ్ల సినిమా చరిత్ర చూస్తే అడుగడుగునా ఇదే కనిపిస్తుంది. విషయనికి వస్తే తెలుగులో ఇపుడు హీరోల జోరు మామూలుగా లేదు. యంగ్ హీరోల నుంచి సీనియర్ల వరకూ ఒక్కొక్కరి చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. chiru;chiranjeevi;balakrishna;amitabh bachchan;vamsi;industries;cinema;telugu;history;film industry;blockbuster hit;heroబాలయ్య నో చెప్పిన సినిమాకు చిరు ఓకే అంటారా...?బాలయ్య నో చెప్పిన సినిమాకు చిరు ఓకే అంటారా...?chiru;chiranjeevi;balakrishna;amitabh bachchan;vamsi;industries;cinema;telugu;history;film industry;blockbuster hit;heroMon, 22 Feb 2021 20:30:00 GMTపరిశ్రమ కూడా చిత్రాతిచిత్రమే. ఇక్కడ అనుకున్నవి జరగవు. జరిగేవి ఎవరూ అసలు ఊహించలేరు. తొంబై ఏళ్ల సినిమా చరిత్ర చూస్తే అడుగడుగునా ఇదే కనిపిస్తుంది. విషయనికి వస్తే తెలుగులో ఇపుడు హీరోల జోరు మామూలుగా లేదు. యంగ్ హీరోల నుంచి సీనియర్ల వరకూ ఒక్కొక్కరి చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.

ఇక్కడ ఒక హీరోతో అనుకున్న కధను మరో హీరోతో తీస్తారు. స్క్రిప్ట్ రాసుకున్నపుడు ఉన్న హీరో తరువాత మారిపోతారు. అలా కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు అయిన చరిత్ర కూడా ఉంది.  ఇవన్నీ పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి అయితే ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి మరీ షూటింగ్ చేస్తున్నారు. ఆ తరువాత చేయబోయే సినిమాలు కూడా వరసగా క్యూ కట్టాయి. ఇక చిరంజీవి కొత్త డైరెక్టర్లతో పాటు సీనియర్లకు కూడా చాన్స్ ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో చాలా మంది ఆశగా మెగా కాంపౌండ్ ని ఒకసారి చుట్టేసి వస్తున్నారు.

ఇపుడు సీనియర్ దర్శకుడు క్రిష్ణ వంశీ చూపు కూడా మెగా స్టార్ మీద పడిందట. ఆయన అపుడెపుడో అంటే నాలుగైదేళ్ల క్రితం రైతు అన్న మూవీని బాలయ్యతో తీయాలని ప్లాన్ చేశారు. ఆ మూవీలో అతి ముఖ్య పాత్ర అమితాబ్ బచ్చన్ పోషిస్తారు అనుకుంటే ఆయన నో చెప్పేశారు. దాంతో అమితాబ్ ఉంటేనే తప్ప తాను ఆ సినిమా చేయను అని బాలయ్య కూడా నో చెప్పేశాడుట.

దాంతో ఆ కధ అలా ఉండిపోయింది. ఇపుడు దాన్ని చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి తగినట్లుగా మార్పులు చేర్పులు చేసి క్రిష్ణ వంశీ ఆయనకు వినిపించాలనుకుంటున్నారుట. చిరంజీవి కనుక ఓకే అంటే మాత్రం రైతు సినిమా సెట్స్ మీదకు వస్తుంది అంటున్నారు. మరి క్రిష్ణ వంశీ మీద ఆయన డైరెక్షన్ టాలెంట్ మీద మెగా స్టార్ కి మంచి గురి ఉంది. ఆయన ఓకే అంటే మాత్రం రైతుగా చిరంజీవిని చూడవచ్చు అంటున్నారు.





యూట్యూబ్ ఛానల్ పై విష్వక్ సేన్ ఫైర్..థంబ్ నెయిల్ మార్చకపోతే నీ ఇంటికి వస్తా

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో అసలు ఎన్టీఆర్, చరణ్ కాదు .... ??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>