PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/there-are-always-clashes-with-border-countries19a941f7-57af-4390-8a7f-2d1d6bf09cc9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/there-are-always-clashes-with-border-countries19a941f7-57af-4390-8a7f-2d1d6bf09cc9-415x250-IndiaHerald.jpgఎల్‌ఏసీ.. లైన్‌ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్‌. ప్రాంతంలోనే సరిహద్దుపై క్లారిటీ లేదు. ఎత్తైన పర్వతాలపై సాగే ఎల్‌ఏసీపై భారత్‌, చైనా సేనలు పహరా కాస్తుంటాయి. కొన్ని చోట్ల ఇండోటిబెటన్‌ సరిహద్దు భద్రతా దళం గస్తీ నిర్వహిస్తుంటుంది. ఐతే లద్దాఖ్‌ తూర్పుభాగంలోని పాంగాంగ్‌ లేక్‌, ఎల్‌ఏసీ పక్కనే ఉన్న గాల్వాన్‌ నదీ ప్రాంతాలపై చైనా, భారత్ మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. పంగాంగ్‌ సరస్సులో మూడింట రెండు వంతులు మనదేశం అధీనంలో ఉంటే, మిగతా భూభాగం చైనా అక్రమించింది. there are always clashes with border countries;view;nithya new;india;east;article 370;arabian sea;contract;sea;central government;march;pangaసరిహద్దు దేశాలతో ఎప్పుడూ ఘర్షణలే !సరిహద్దు దేశాలతో ఎప్పుడూ ఘర్షణలే !there are always clashes with border countries;view;nithya new;india;east;article 370;arabian sea;contract;sea;central government;march;pangaMon, 22 Feb 2021 15:00:00 GMTభారత్ మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. పంగాంగ్‌ సరస్సులో మూడింట రెండు వంతులు మనదేశం అధీనంలో ఉంటే, మిగతా భూభాగం చైనా అక్రమించింది. చైనా ఫింగర్‌ 4ను ఎల్‌ఏసీగా గుర్తిస్తే...భారత్‌ ఫింగర్‌ 8ను ఎల్‌ఏసీగా భావిస్తోంది.

ఈ వివాదం సద్దుమణగకముందే శ్యోక్ న‌ది వెంబ‌డి దౌల‌త్ బెగ్ ఒల్డీ... డీబీవో వ‌ర‌కు భా‌ర‌త్ రోడ్డు మార్గం నిర్మిస్తోంది. ల‌ద్దాఖ్‌లోని ఎల్ఏసీ వెంబ‌డి అత్యంత మారుమూల, దాడికి అనువైన‌ ప్రాంతం కావడంతో చైనా అలర్టయ్యింది. ఈ రోడ్డుకు దగ్గర్లోని ఫింగర్‌ 4లో చైనా సైనికులు మోహరించడంతో డీబీఓ రోడ్డు భద్రత ప్రమాదంలో పడింది. మన సైన్యానికి గల్వాన్‌ లోయ కీలకమైన ప్రాంతం.
గల్వాన్‌ వెనుక భాగంలోనే అక్సాయ్‌చిన్‌ ఉంటుంది. కాబట్టి చైనాకూ ఈ లోయ అత్యంత ప్రాధాన్యమైనది. ఎల్‌ఏసీ వెంబడి గస్తీ కాసే భారత సైనికులకు ఈ లోయలోని డీబీఓ రోడ్డు ద్వారా సరఫరాలు అందుతాయి. ఏవైనా ఘ‌ర్షణ‌లు జరిగితే వేగంగా సైన్యాన్ని, సైనిక సామ‌గ్రిని స‌రిహ‌ద్దుల‌కు త‌ర‌లించేందుకు రోడ్డు ఉపయోగపడనుంది. అందుకే ఈ లోయను తమ అదుపులోకి తీసుకోవాలని చూస్తోంది చైనా.

గ‌తేడాది క‌శ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన కేంద్రం... అక్సాయ్‌చిన్‌తోపాటు ల‌ద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. అక్సాయ్ చిన్.. చైనా నియంత్రణ‌లో ఉంది. ప‌శ్చిమ టిబెట్‌ను షిన్‌జియాంగ్‌తో అనుసంధానించ‌డంలో చైనాకు ఈ ప్రాంతం కీల‌కం. ఈ ప్రాంతం మీదుగా వ్యూహాత్మక కారాకోరం హైవే వెళ్తోంది. ఇది చైనా, పాక్‌ల‌ను అనుసంధానం చేస్తోంది. సిపెక్‌పై భారత్ ఎన్నిసార్లు ఆందోళన వ్యక్తం చేసినా చైనా అస్సలు పట్టించుకోలేదు.

సరిహద్దు వివాదాలు చెలరేగడంతో 1993లో చర్చలు జరిగాయి. భారత్‌, చైనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏ దేశం బలప్రయోగం చేయద్దని, సరిహద్దు వివాదం శాంతియుతంగా, స్నేహపూర్వక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఎల్‌ఎసికి రెండు కిలోమీటర్ల పరిధిలో ఏ దేశమూ కాల్పులు జరపొద్దు. జీవరసాయన ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, తుపాకులతో దాడులకు దిగొద్దని ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. ఐతే ఈ ఒప్పందాలకు చైనా తూట్లు పొడుస్తూనే ఉంది. నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సున్నితమైన ప్రాంతాల్లోకి చొరబాట్లతో భారత్‌ను రెచ్చగొడుతోంది. ఎక్కడో అరేబియా సముద్రంపై పట్టుకోసం చైనా ప్రయత్నిస్తే తప్పుకానిది, భారత్‌ తన భూభాగంలో రోడ్లను నిర్మిస్తే మాత్రం ఓర్చుకోవడం లేదు. 


ఐపీఎల్‌లో కొనకపోవడం మంచిదేలే.. ఫించ్ షాకింగ్ కామెంట్స్

టీడీపీ విజయాల లెక్క తేలింది

పాద‌యాత్ర చేసినా.. సాయిరెడ్డిని మైన‌స్ చేసింది వీళ్లే ?

ఇద్ద‌రు మంత్రుల‌ను ఢీకొట్టి గెలిచిన రోజా... ఇక తిరుగులేదా ?

పంచాయ‌తీ ఎఫెక్ట్‌.. జ‌న‌సేన‌కు ఆ విష‌యంలో క్లారిటీ.. ఏంటంటే...!

ఎడిటోరియల్: తెగించిన తెలంగాణ పాలకులు-ఇంత జరిగినా శాంతి భద్రలపై స్పందన కరువు-పాలన ఉన్నంతవరకు దోపిడీకి యథేచ్చేనా?

నటి లయ నేషనల్ చెస్ ఛాంపియన్ అని మీకు తెలుసా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>