MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anil7a0c3321-72a1-446b-aa3d-5f3bb12fc238-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anil7a0c3321-72a1-446b-aa3d-5f3bb12fc238-415x250-IndiaHerald.jpgతెలుగులో అపజయమే లేని దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు తెచ్చుకున్నాడు. చివరిగా మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ కొట్టిన ఆయన ఇప్పుడు వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరితో కలిసి ఒక మల్టీస్టారర్ చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో ఎఫ్2 అనే సినిమా రాగా ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తిగా వచ్చిందని చెబుతున్నారు. ఇక అనిల్ రావిపూడి సమర్పణలో గాలి సంపత్ అనే సినిమా వస్తోంది.. ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కdrusyam;cbn;mahesh;venkatesh;anil music;anil ravipudi;krishna;mahesh babu;prasad;rajendra prasad;sampath;varun;varun sandesh;varun tej;hyderabad;cinema;telugu;f2;producer;event;air;comedy;press;producer1;hero;posters;march;babu rajendra prasadగాలి సంపత్ కధ చెప్పేసిన అనిల్ రావిపూడి !గాలి సంపత్ కధ చెప్పేసిన అనిల్ రావిపూడి !drusyam;cbn;mahesh;venkatesh;anil music;anil ravipudi;krishna;mahesh babu;prasad;rajendra prasad;sampath;varun;varun sandesh;varun tej;hyderabad;cinema;telugu;f2;producer;event;air;comedy;press;producer1;hero;posters;march;babu rajendra prasadMon, 22 Feb 2021 12:00:00 GMTతెలుగులో అపజయమే లేని దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు తెచ్చుకున్నాడు. చివరిగా మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ కొట్టిన ఆయన ఇప్పుడు వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరితో కలిసి ఒక మల్టీస్టారర్ చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో ఎఫ్2 అనే సినిమా రాగా ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తిగా వచ్చిందని చెబుతున్నారు. ఇక అనిల్ రావిపూడి సమర్పణలో గాలి సంపత్ అనే సినిమా వస్తోంది.. ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన కథ మొత్తం చెప్పేశాడు అనిల్ రావిపూడి. 

గాలి సంపత్ అంటే గాలికి తిరిగే వాడు అని చాలామంది అనుకుంటున్నారని కానీ ఈ సినిమాలో గాలి సంపత్ అంటే అది కాదని చెప్పుకొచ్చాడు. గాలి సంపత్ గా టైటిల్ రోల్ లో నట కిరీటి రాజేంద్రప్రసాద్ నటించగా ఆయన కొడుకుగా హీరో శ్రీ విష్ణు నటించారు. అనీష్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహించిన ఈ సినిమాని సైన్స్ స్క్రీన్ సంస్థతో కలిసి ఇమేజెస్ పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ రావిపూడి స్నేహితుడు రైటర్ కృష్ణ నిర్మాత నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే అందించడం గమనార్హం.. 

నిన్న హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో ఈ యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించగా అందులోనే అనిల్ రావిపూడి ఈ సినిమా కథ చెప్పుకొచ్చాడు. గాలి సంపత్ అంటే అందరూ గాలికి తిరిగే వాడు అనుకుంటారని కానీ ఈ సినిమాలో కథ అది కాదని చెప్పుకొచ్చారు..పోస్టర్ ను సరిగ్గా గమనిస్తే రాజేంద్ర ప్రసాద్ గారి గొంతు కింద ఒక చిన్న కట్ లాగా ఉంటుందని అంటే ఆయన గొంతుకు ప్రమాదం కావడంతో ఆయన నోటినుంచి మాట రాదు అని ఆయన చెప్పుకొచ్చారు.. మాట రాకుండా గాలి వస్తుందని అందుకే ఆయనను గాలి సంపత్ అని పిలుస్తారు అని చెప్పుకొచ్చాడు. బాహుబలిలో కిలికిలి భాష లాగ ఇందులో ఫిఫిఫి లాంగ్వేజ్ ఉంటుందని ఆ ఫిఫిఫి లాంగ్వేజ్ ను అందంగా ట్రాన్ స్లేట్ చేస్తూ బోలెడన్ని కామెడీ సీన్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు.




పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!

కేసీఆర్ వ్యూహం ఫ‌లించ‌దా..? హైద‌రాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం తీర‌ని క‌లేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>