Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand-seetimar-teaser4d653bb2-830f-4a79-a090-dba4d5512230-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand-seetimar-teaser4d653bb2-830f-4a79-a090-dba4d5512230-415x250-IndiaHerald.jpgమాస్ హీరో గోపీచంద్ కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన సక్సెస్ లు లేక వెనకపడ్డాడు. యజ్ఞం, రణం టైం లో సూపర్ మాస్ ఫాలోయింగ్ ఉండగా ఆ క్రేజ్ ను కొనసాగించడంలో వెనకపడ్డాడు గోపీచంద్. సినిమాలైతే చేస్తున్నాడు కాని అందుకు తగిన ఫలితాలను అందుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాడు. లేటెస్ట్ గా గోపీచంద్ నుండి వస్తున్న సినిమా సీటీమార్. ఈ సినిమాను సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్నారు. మాస్ డైరక్టర్.. మాస్ హీరో ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుందిgopichand-seetimar-teaser;beauty;gopichand;mani sharma;maruti;sampath;sampath nandi;tamannaah bhatia;cinema;hero;heroine;success;massసీటీమార్ టీజర్.. గోపీచంద్ ఈసారి టార్గెట్ మిస్సవ్వడేమో..!సీటీమార్ టీజర్.. గోపీచంద్ ఈసారి టార్గెట్ మిస్సవ్వడేమో..!gopichand-seetimar-teaser;beauty;gopichand;mani sharma;maruti;sampath;sampath nandi;tamannaah bhatia;cinema;hero;heroine;success;massMon, 22 Feb 2021 11:09:50 GMTమాస్ హీరో గోపీచంద్ కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన సక్సెస్ లు లేక వెనకపడ్డాడు. యజ్ఞం, రణం టైం లో సూపర్ మాస్ ఫాలోయింగ్ ఉండగా ఆ క్రేజ్ ను కొనసాగించడంలో వెనకపడ్డాడు గోపీచంద్. సినిమాలైతే చేస్తున్నాడు కాని అందుకు తగిన ఫలితాలను అందుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాడు. లేటెస్ట్ గా గోపీచంద్ నుండి వస్తున్న సినిమా సీటీమార్. ఈ సినిమాను సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్నారు. మాస్ డైరక్టర్.. మాస్ హీరో ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది.

ఈ సినిమాకు సంబందించిన టీజర్ లేటెస్ట్ గా రిలీజైంది. టీజర్ మొత్తం మాస్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమాగా ఉంది. కథ రొటీన్ గా అనిపిస్తున్నా కమర్షియల్ ఎంటర్టైనర్ కు కావాల్సిన అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్త పడ్డారు. కబడ్డి మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఇక టీజర్ లో గోపీచంద్ లుక్స్ కూడా అదిరిపోయాయి. సరైన సినిమా పడితే తన సత్తా ఏంటో చూపించాలని చూస్తున్న గోపీచంద్ కు ఈ సీటీమార్ దొరికినట్టు ఉంది.

సినిమాలో కబడ్డి కోచ్ కార్తీ పాత్రలో గోపీచంద్ కనిపిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిఉక్ అందిస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 2న రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమా టీజర్ అంచనాలు పెంచింది. ఇక ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరిగేలా ఉన్నాయి. తప్పకుండా గోపీచంద్ సీటీమార్ సత్తా చాటేలా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా మారుతి డైరక్షన్ లో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు గోపీచంద్. మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టే లెక్క సో మొత్తానికి గోపీచంద్ మళ్లీ సరైన ట్రాక్ లోకి వచ్చినట్టే అని చెప్పుకోవచ్చు.




నితిన్ ‘చెక్’ సినిమా గురించి జక్కన్న ఏమన్నాడో తెలుసా?

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>