MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-will-be-seen-in-that-type-of-character-in-sarkaaru-vaari-paatae1c19304-3bca-4078-b812-934a215277e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-will-be-seen-in-that-type-of-character-in-sarkaaru-vaari-paatae1c19304-3bca-4078-b812-934a215277e2-415x250-IndiaHerald.jpgతొలిసారిగా మహానటి ​ఫేమ్ ​కీర్తి సురేష్ తో కలిసి సూపర్​ స్టార్​ మహేష్ బాబు నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట​.​ 14 రీల్స్ ప్లస్​,​ మైత్రి మూవీ మేకర్స్​, జిఎంబి​​ ఎంటర్టైన్మెం​ట్స్ ​​​​సంస్థలు కలిసి సంయుక్తంగా అత్యంత భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల దుబాయి దేశం లో ప్రారంభమైన విషయం తెలిసిందే​.​ ఇక నిన్నటితో సక్సెస్ఫుల్​ గా​ ఫస్ట్ షెడ్యూల్ మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది​.​sarkaru vaari paata;auto;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;lakshman;parasuram;ram pothineni;thaman s;bollywood;cinema;sangeetha;media;yuva;mythri movie makers;mahanati;ram-lakshman;research and analysis wingప్చ్ ... ఇవాళైనా మాకు మోక్షం లభిస్తుందా .... పాపం ఎంతో ఎదురుచూస్తున్నారు .....??ప్చ్ ... ఇవాళైనా మాకు మోక్షం లభిస్తుందా .... పాపం ఎంతో ఎదురుచూస్తున్నారు .....??sarkaru vaari paata;auto;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;lakshman;parasuram;ram pothineni;thaman s;bollywood;cinema;sangeetha;media;yuva;mythri movie makers;mahanati;ram-lakshman;research and analysis wingMon, 22 Feb 2021 22:43:45 GMTతొలిసారిగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా అత్యంత భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల దుబాయి దేశం లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక నిన్నటితో సక్సెస్ఫుల్ గా ఫస్ట్ షెడ్యూల్ మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది.

చాలా గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ సినిమాకి యువ సంగీత సంచలనం తమన్ మ్యూజిక్ అందిస్తుండగా మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రఖ్యాత ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ మాస్టర్లు ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు విలన్ పాత్ర పోషిస్తున్నాడని టాక్. బ్యాంకుల్లోని కుంభకోణాలు మోసాల నేపథ్యంలో మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగులు కలబోతగా దర్శకుడు పరశురాం ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ తో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా యొక్క కథా కథనాల విషయమై దర్శకుడు పరశురామ్ మరింత జాగ్రత్త తీసుకున్నారు అంటున్నారు. 

ఇక ఈ సినిమా యొక్క రెండవ షెడ్యూల్ అతి త్వరలో గోవాలో ప్రారంభం కాబోతున్న ట్లు తెలుస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా యొక్క ఫస్ట్ షెడ్యూల్ తాలూకు మేకింగ్ వీడియోని నిన్న రిలీజ్ చేస్తారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏంతో వైరల్ అయింది. దానితో మహేష్ బాబు అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడు ఆ వీడియో చూద్దామా అని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూడసాగారు. అయితే అది రిలీజ్ కాకపోవటం అలానే ఇప్పటివరకు దానికి సంబంధించి నిర్మాతలు వైపు నుండి ఎటువంటి అప్ డేట్ కూడా రాకపోవడంతో కనీసం ఈ రోజైనా మాకు మోక్షం లభిస్తుందా మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తారా అంటూ సర్కారు వారి పాట నిర్మాతలని ఉద్దేశించి పలువురు మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!!



ప్రతిరోజు కప్పు బ్లాక్ కాఫీ తాగితే.. పదికాలాలపాటు గుండె పదిలం..!

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>