PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-fix-target-for-his-cabinet-ministersa8b0509c-582e-47c8-911a-0734b42087c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-fix-target-for-his-cabinet-ministersa8b0509c-582e-47c8-911a-0734b42087c5-415x250-IndiaHerald.jpgపంచాయతీ నాలుగు దశల్లో వైసీపీదే విజయం కావొచ్చు, కానీ టీడీపీ మాత్రం తన ఉనికి చాటుకుంది. ఇంకా చెప్పాలంటే, బీజేపీ, జనసేన కూడా అధికార పక్షానికి ఎదురొడ్డి ఒకటీ అరా సీట్లు దక్కించుకున్నాయి. పంచాయతీ సర్పంచ్ లు, వార్డు మెంబర్లు పెద్దగా ఫోకస్ అయ్యే అవకాశం లేదుకాబట్టి అధికార పార్టీ పెద్దగా ఆందోళన చెందట్లేదు. ఇక మున్సిపాల్టీల విషయానికొస్తే.. మున్సిపల్ సమావేశం పెట్టుకున్నప్పుడల్లా ప్రతిపక్ష కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఎదుర్కోవడం అధికార పార్టీకి తలకు మించిన భారంగా మారుతుంది. పొరపాటున ఎక్కడైనా అధికార పార్టీ ఓడjagan on municipal elections;amala akkineni;bharatiya janata party;koshta;jagan;janasena;district;yv subbareddy;rayalaseema;panchayati;tdp;ycp;janasena party;march;y v subbareddy;party;sajjala ramakrishna reddy;mantraపురపోరు: మంత్రులకు టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్పురపోరు: మంత్రులకు టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్jagan on municipal elections;amala akkineni;bharatiya janata party;koshta;jagan;janasena;district;yv subbareddy;rayalaseema;panchayati;tdp;ycp;janasena party;march;y v subbareddy;party;sajjala ramakrishna reddy;mantraMon, 22 Feb 2021 12:00:00 GMTపంచాయతీ నాలుగు దశల్లో వైసీపీదే విజయం కావొచ్చు, కానీ టీడీపీ మాత్రం తన ఉనికి చాటుకుంది. ఇంకా చెప్పాలంటే, బీజేపీ, జనసేన కూడా అధికార పక్షానికి ఎదురొడ్డి ఒకటీ అరా సీట్లు దక్కించుకున్నాయి. పంచాయతీ సర్పంచ్ లు, వార్డు మెంబర్లు పెద్దగా ఫోకస్ అయ్యే అవకాశం లేదుకాబట్టి అధికార పార్టీ పెద్దగా ఆందోళన చెందట్లేదు. ఇక మున్సిపాల్టీల విషయానికొస్తే.. మున్సిపల్ సమావేశం పెట్టుకున్నప్పుడల్లా ప్రతిపక్ష కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఎదుర్కోవడం అధికార పార్టీకి తలకు మించిన భారంగా మారుతుంది. పొరపాటున ఎక్కడైనా అధికార పార్టీ ఓడిపోతే పరిస్థితి మరింత దిగజారినట్టే. అందుకే పంచాయతీ ఎన్నికలని పెద్దగా పట్టించుకోని సీఎం జగన్ పురపోరుపై మంత్రులకు టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది.

జిల్లా మంత్రులు, జిల్లా ఇన్ చార్జి మంత్రులు కలసి మున్సిపాల్టీలలో పట్టు సాధించాలని టార్గెట్ పెట్టారట సీఎం జగన్. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంద్ర ఇన్ చార్జిలకు ఈ బాధ్యతలు అప్పగించారట. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలకు మున్సిపల్ బాధ్యతలు అప్పగించారు. ఈ ముగ్గురూ రంగంలోకి దిగి.. మంత్రులు, ఇన్ చార్జి మంత్రులను సమన్వయం చేసుకుంటూ పురపోరుకి సిద్ధం చేస్తారట. మార్చి 10న పురపాలక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 14వతేదీ ఫలితాలు విడుదలవుతాయి.

పంచాయతీ ఎన్నికల ఫలితాలతో పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నట్టు వైసీపీ చెబుతున్నా.. టీడీపీకి ఆమాత్రం సీట్లు కూడా రాకుండా ఉండాల్సిందని అధినేత అభిప్రాయంగా చెబుతున్నారు. పంచాయతీల్లో ఆ లోటు కనిపిస్తున్నా మున్సిపాల్టీల్లో మాత్రం క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ పెట్టారట. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో వైసీపీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు మరింత అవగాహన పెంచాలని, ప్రచార పర్వంలో ఎక్కడా వెనక్కు తగ్గకూడదని సూచించారట. ఆర్థిక కష్టాలున్నా, సంక్షేమ పథకాల అమలులో వైసీపీ సర్కారు ఎక్కడా వెనకడుగు వేయలేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మార్గనిర్దేశనం చేశారట. మున్సిపాల్టీల్లో క్లీన్ స్వీప్ సాధ్యమయితే, దాని ప్రభావం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఉంటుందని, పరిషత్ ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధిస్తుందని, దానికి మున్సిపాల్టీలనుంచే తొలి అడుగు పడాలని చెప్పారట జగన్. 


గాలి సంపత్ కధ చెప్పేసిన అనిల్ రావిపూడి !

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>