BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyb48e5df1-993e-47d3-a2c5-e74ea450d9f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyb48e5df1-993e-47d3-a2c5-e74ea450d9f5-415x250-IndiaHerald.jpgసహజంగా మన చర్మం కాంతిని పుంజుకోవాలి అంటే మాత్రం ఎన్నో రోజుల నుంచి శ్రమించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో సహజ సిద్ధమైన చిట్కాలను పాటించి, సహజంగా చర్మాన్ని అందంగా మార్చుకోవాలని ఎంతోమంది ఆశిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించి, కేవలం అరగంటలోనే అందంగా మారవచ్చు. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి.. beauty;partyఅరగంటలో అందంగా మారాలంటే ఇలా చేయండి..!అరగంటలో అందంగా మారాలంటే ఇలా చేయండి..!beauty;partyMon, 22 Feb 2021 15:55:00 GMTసహజంగా మన చర్మం కాంతిని పుంజుకోవాలి అంటే మాత్రం ఎన్నో రోజుల నుంచి శ్రమించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో సహజ సిద్ధమైన చిట్కాలను పాటించి, సహజంగా చర్మాన్ని అందంగా మార్చుకోవాలని ఎంతోమంది ఆశిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించి, కేవలం అరగంటలోనే అందంగా మారవచ్చు. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి..

కంటికి ఇంపైన రంగు,నోరూరించే రుచిగల బొప్పాయి లోని పోషకాల విలువెంతో.. దీన్ని అందాన్ని మెరుగుపరచడంలో నూ,ఉపయోగిస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.. అందులో ఒకటి ఇప్పుడు చూద్దాం.. బొప్పాయిని క్లెన్సర్ గా కూడా వాడుకోవచ్చు. బొప్పాయి గుజ్జు అర కప్పు తీసుకొని,అందులో అర చెక్క నిమ్మరసం పిండి,బాగా మిశ్రమంలా కలపాలి.  ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలు ఆరిన తర్వాత శుభ్రం చేస్తే, చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది.


దుమ్ము,ధూళి చర్మం పై పేరుకున్నప్పుడు మృతకణాల సమస్య ఎక్కువ అవుతుంది. అవి చర్మాన్ని  గరకగా,మురికిగా మార్చేస్తాయి. అంతే కాకుండా త్వరగా నల్లబడతారు. ఇక ఇందుకోసం అర కప్పు బొప్పాయి గుజ్జులో, గుప్పెడు పంచదారను కలిపి,ఆ మిశ్రమంతో ముఖంపైన మెత్తగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి, చర్మం సహజంగా కాంతిని అందుకుంటుంది.

మీరు ఎప్పుడైనా పార్టీ కి వెళ్ళాలి లేదా ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, చిటికెలో తాజాగా మారాలి అని అనుకుంటారు. అలాంటప్పుడు బొప్పాయి గుజ్జులో కీరదోస రసాన్ని కలుపుకోవాలి. దానికి ఒక చెంచా తేనె,ఒక చెంచా గంధపు పొడి, ఒక చెంచా ముల్తానీ మట్టిని జతచేసి అవసరాన్ని బట్టి పాలతో మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇక ఈ మిశ్రమాన్ని  ముఖానికి, మెడకు, చేతులకు,పాదాలకు పట్టించి, పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే సరి. నిగనిగలాడే చర్మం చిటికెలో తయారవుతుంది. ఇక ఏ ఫంక్షన్ కి వెళ్ళినా,అందరూ మీ వైపు చూడటం మొదలు పెడతారు..




పుర పోరు : ఆ జంప్ జిలానీ ఎమ్మెల్యేతో రెండు పార్టీల్లోనూ చిచ్చు...?

చర్చల్లోకి దృశ్యం - 3 కధ ?

జగడ్డ : పాపం టీడీపీ, అమరావతిలోనే ఘోర పరాభవం !

టీడీపీ విజయాల లెక్క తేలింది

పాద‌యాత్ర చేసినా.. సాయిరెడ్డిని మైన‌స్ చేసింది వీళ్లే ?

ఇద్ద‌రు మంత్రుల‌ను ఢీకొట్టి గెలిచిన రోజా... ఇక తిరుగులేదా ?

పంచాయ‌తీ ఎఫెక్ట్‌.. జ‌న‌సేన‌కు ఆ విష‌యంలో క్లారిటీ.. ఏంటంటే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>