Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/pakistan-cricket-board-warned-that-they-will-push-to-t20-world-cup-relocation-from-india1344e58a-6470-49f6-8f9a-5dbc557b4c60-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/pakistan-cricket-board-warned-that-they-will-push-to-t20-world-cup-relocation-from-india1344e58a-6470-49f6-8f9a-5dbc557b4c60-415x250-IndiaHerald.jpgదాయాది దేశాలు పాకిస్తాన్-భారత్ మధ్య క్రికెట్ అంటేనే అది ఓ ఆటలా కాకుండా యుద్ధంలా సాగుతుంది. ఆ మ్యాచ్‌లో ఓడిపోతే దేశం మొత్తం ఓడిపోయినట్లు ఇరు దేశాలూ భావిస్తాయి. ఇక అదే ఏదైనా ఐసీసీ టోర్నీ అయితే, అందులోనూ ప్రపంచ కప్ అయితే ఆ హీట్ పీక్ స్టేజ్‌లో ఉంటుంది. మరికొద్ది రోజుల్లో జరగబోయే టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇలాంటి సన్నివేశాలను..icc t20 2021;cricket;india;pakistan;australia;war;icc t20మమ్మల్ని రానివ్వకుంటే భారత్‌కు నష్టం తప్పదు.. పాక్ క్రికెట్ బోర్డు తీవ్ర హెచ్చరికమమ్మల్ని రానివ్వకుంటే భారత్‌కు నష్టం తప్పదు.. పాక్ క్రికెట్ బోర్డు తీవ్ర హెచ్చరికicc t20 2021;cricket;india;pakistan;australia;war;icc t20Mon, 22 Feb 2021 17:22:00 GMTఇంటర్నెట్ డెస్క్: దాయాది దేశాలు పాకిస్తాన్-భారత్ మధ్య క్రికెట్ అంటేనే అది ఓ ఆటలా కాకుండా యుద్ధంలా సాగుతుంది. ఆ మ్యాచ్‌లో ఓడిపోతే దేశం మొత్తం ఓడిపోయినట్లు ఇరు దేశాలూ భావిస్తాయి. ఇక అదే ఏదైనా ఐసీసీ టోర్నీ అయితే, అందులోనూ ప్రపంచ కప్ అయితే ఆ హీట్ పీక్ స్టేజ్‌లో ఉంటుంది. మరికొద్ది రోజుల్లో జరగబోయే టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇలాంటి సన్నివేశాలను చూసేందుకు మరో అవకాశం లభించనుంది. కానీ ఇక్కడే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2021 టీ20 ప్రపంచకప్ భారత్‌లో జరగనుంది.

ఇరు దేశాల మధ్య ప్రస్తుతమున్న ఉద్రిక్త వాతావరణం దృష్ట్యా పాకిస్తాన్ జట్టును భారత్ రానిస్తుందా..? ఆ జట్టుతో పాటు ఆ జట్టు జర్నలిస్టులను, ఫ్యాన్స్‌ను అనుమతిస్తుందా..? అనే అనుమానాలు కలగుతున్నాయి. దీనిపైనే పాకిస్తాన్ కూడా ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎహసాన్ మని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమ జట్టును భారత్‌లో ప్రపంచ కప్ ఆడేందుకు రానివ్వకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఎహసాన్ మని భారత్‌ను హెచ్చరించారు. టీ20 ప్రపంచ కప్ 2021 భారత్‌లో జరగకుండా చూస్తామని అన్నారు. తమ ఆటగాళ్లకు, ఫ్యాన్స్‌కు, జర్నలిస్టులకు అందరికీ ఇండియా వీసాలివ్వాలని, అలా అని ముందుగా రాతపూర్వకమైన భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మార్చిలోగా ఈ రాతప్రతిని అందజేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అందుకు భారత్ ఒప్పుకోకపోతే అప్పుడు టోర్నీనే భారత్‌లో జరగకుండా ఉండేలా ప్రయత్నిస్తామని, యూఏఈలో నిర్వహించాలని ఐసీసీని కోరతామని చెప్పారు. ‘ఇప్పటికే ఐసీసీకి ఈ విషయంపై మా వాదన వినిపించాం. మార్చిలోగా వీసాలకు సంబంధించి భారత్ భరోసా ఇవ్వాలని కోరాం’ అంటూ మని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే నిజానికి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ గతేడాదిలోనే జరగాల్సి ఉంది. ఈ టోర్నీకి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వాలి. ఆ తరువాత 2022లో జరిగే టోర్నీకి భారత్‌ ఆతిథ్యమిస్తుంది. కానీ కరోనా ప్రబలడంతో ఆసీస్ చేతులెత్తేసింది. ఐసీసీ కూడా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రపంచకప్ టోర్నీని వాయిదా వేసింది. దీంతో ఈ ఏడాది టోర్నీ నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది.

అయితే ముందుగా అనుకున్నట్లు ఆస్ట్రేలియా కాకుండా ఇండియాలో ఈ టోర్నీ నిర్వహించాలని అనుకుంటోంది. దీనికి బదులుగా 2022 టోర్నీకి ఆతిథ్యమిచ్చే భాధ్యతను ఆస్ట్రేలియాకు అప్పగించింది. దీంతో ఈ ఏడాది టోర్నీ భారత్‌‌లో జరగనుంది. ఈ పిరిస్థితుల్లో భారత్-పాకిస్తాన్ మధ్య సరికొత్త వివాదం రేగుతోంది.




రాజరికపు హోదా ఎవరైనా వదులుకుంటారా..?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?

బ్రేకింగ్‌: లోక్‌స‌భ ఎంపీ ఆత్మ‌హ‌త్య‌... హోట‌ల్లోనే

చర్చల్లోకి దృశ్యం - 3 కధ ?

జగడ్డ : పాపం టీడీపీ, అమరావతిలోనే ఘోర పరాభవం !

టీడీపీ విజయాల లెక్క తేలింది

పాద‌యాత్ర చేసినా.. సాయిరెడ్డిని మైన‌స్ చేసింది వీళ్లే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>