PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay-ferojkhan04124fff-3936-42a0-9d9b-7b8273eb30af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay-ferojkhan04124fff-3936-42a0-9d9b-7b8273eb30af-415x250-IndiaHerald.jpgకూన రాజీనామాతో షాకైన కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలబోతుందని తెలుస్తోంది. హైదరాబాద్ కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉండే ముస్లిం నేత ఫిరోజ్ ఖాన్ కమలం పార్టీలో చేరబోతున్నారని సమాచారం. ఫిరోజ్ ఖాన్ తో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.bandi sanjay ferojkhan;view;feroz khan;revanth;hyderabad;bharatiya janata party;telangana;congress;assembly;mim party;medchal;josh;fighter;party;nampallyబీజేపీలోకి ముస్లిం నేత!బీజేపీలోకి ముస్లిం నేత!bandi sanjay ferojkhan;view;feroz khan;revanth;hyderabad;bharatiya janata party;telangana;congress;assembly;mim party;medchal;josh;fighter;party;nampallyMon, 22 Feb 2021 21:36:45 GMTఅసెంబ్లీ విజయం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు రావడంతో కమలదళంలో జోష్ పెరిగింది. అన్ని పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూనే... ప్రజా క్షేత్రంలో బలమనున్న నేతలను గుర్తించి వల వేస్తున్నారు కమలం నేతలు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో కీలక నేతలుగా ఉన్నవారు కాషాయ కండువా కప్పుకుంటున్నారు.

 తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరారు. కూన రాజీనామాతో షాకైన కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలబోతుందని తెలుస్తోంది. హైదరాబాద్ కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉండే ముస్లిం నేత ఫిరోజ్ ఖాన్ కమలం పార్టీలో చేరబోతున్నారని సమాచారం. ఫిరోజ్ ఖాన్ తో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. నాంపల్లి నియోజకవర్గంలో గట్టి పట్టుంది ఫిరోజ్ ఖాన్ కు.  గతంలో పీఆర్పీ, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్.. ఎంఐఎం పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. పాతబస్తీలోని మిగితా ఆరు నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించిన పతంగి పార్టీ.. నాంపల్లిలో మాత్రం కష్టపడాల్సి వచ్చింది.

                 ఎంఐఎంకు వ్యతిరేకంగా బహిరంగంగానే ప్రకటనలు చేస్తుంటారు ఫిరోజ్ ఖాన్, అసద్ బ్రదర్స్ పై ఆరోపణలు చేస్తుంటారు. ఎంఐఎంకు వ్యతిరేకంగా పని చేస్తున్నందుకు గతంలో ఫిరోజ్ ఖాన్ పై దాడి కూడా జరిగింది.అయినా తన పోరాటం ఆపలేదు. అందుకే ఓల్డ్ సిటీలో ఫిరోజ్ ఖాన్ కు ఫైటర్ గా పేరుంది. అసద్ బ్రదర్స్ కు వ్యతిరేకంగా నిలుస్తున్న ఫిరోజ్ ఖాన్ బీజేపీలో చేర్చుకుంటే.. ఓల్డ్ సిటీలో పట్టు సాధించవచ్చని బీజేపీ భావిస్తుందని తెలుస్తోంది. అందుకే ఫిరోజ్ ఖాన్ కోసం మంత్రాంగం చేస్తుందంటున్నారు. ఫిరోజ్ ఖాన్ బీజేపీలో చేరితే తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారే అవకాశం ఉంది.







పిల్లలకు మల్టీవిటమిన్ ... తప్పనిసరినా?

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>