MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan32f3af17-17b3-4f04-93d4-fb895f0ffbd0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan32f3af17-17b3-4f04-93d4-fb895f0ffbd0-415x250-IndiaHerald.jpgఒక సినిమా హిట్ కావడానికి చాలా లెక్కలు ఉంటాయి. హీరో ఇపుడు అతి ముఖ్యమైన ఫ్యాక్టర్. అలాగే డైరెక్టర్. ఈ ఇద్దరి కాంబోని సెట్ చేసే భారీ నిర్మాణ సంస్థ. ఇక మిగిలిన టాప్ టెక్నీషియన్లు అంతా కలిస్తే అద్భుతమే జరుగుతుంది. తెలుగు సినీ సీమ ఇలాంటి అద్భుతాలను గతంలో చాలా చూసింది. కానీ అలాంటిది మరొకటి జరగాలని కోరుకుంటోంది. pawan;pawan;cbn;mahesh;deva;kalyan;mahesh babu;pawan kalyan;rajamouli;india;rrr movie;cinema;telugu;rajani kanth;rayalaseema;blockbuster hit;director;hero;allu sneha;panjaaపవన్ తో అరుదైన కాంబో...అదే నిజమైతేనా...?పవన్ తో అరుదైన కాంబో...అదే నిజమైతేనా...?pawan;pawan;cbn;mahesh;deva;kalyan;mahesh babu;pawan kalyan;rajamouli;india;rrr movie;cinema;telugu;rajani kanth;rayalaseema;blockbuster hit;director;hero;allu sneha;panjaaMon, 22 Feb 2021 11:00:00 GMTసినిమా హిట్ కావడానికి చాలా లెక్కలు ఉంటాయి. హీరో ఇపుడు అతి ముఖ్యమైన ఫ్యాక్టర్. అలాగే డైరెక్టర్. ఈ ఇద్దరి కాంబోని సెట్ చేసే భారీ నిర్మాణ సంస్థ. ఇక మిగిలిన టాప్ టెక్నీషియన్లు అంతా కలిస్తే అద్భుతమే జరుగుతుంది. తెలుగు సినీ సీమ ఇలాంటి అద్భుతాలను గతంలో చాలా చూసింది. కానీ అలాంటిది మరొకటి  జరగాలని కోరుకుంటోంది.

అదేంటి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్. ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా ఉండే ఈ కాంబో కనుక మెటీరియలైజ్ అయితే మాత్రం రికార్డులకే కొత్త పదాలు వెతుక్కోవాల్సి వుంటుందని అంటారు. పవన్ ఇమేజ్ కి ఆకాశమే హద్దు అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ నటించిన ఒక ఫ్లాప్ సినిమా కూడా అరవై డెబ్బై కోట్ల దాకా వసూల్ చేస్తుంది. కేవలం తెలుగులోనే పవన్ స్టామినా ఇది.

ఇక పవన్ తో పాన్ ఇండియా లెవెల్ సినిమా తీస్తే దానికి రాజమౌళి లాంటి వారు డైరెక్షన్ బాధ్యతలు నిర్వహిస్తే ఇక కలెక్షన్లు ఎలా ఉంటాయి అన్నది అసలు ఊహించగలమా అన్న టాక్  అయితే  ఉంది. నిజానికి పవన్ రాజమౌళిల మధ్య మంచి స్నేహం ఉంది. అపుడెపుడో పవన్ పంజా మూవీ ఫంక్షన్ ని రాజమౌళి వచ్చి  పవన్ గురించి చాలానే గొప్ప‌మాట్లాడారు. పవన్ సైతం తమ కాంబో  ఆ దేవుడే సెట్ చేయాలని అంటూ రాజమౌళి తో కలసి పనిచేయాలన్న ఆకాంక్షను ఆనాడే  వ్యక్తం చేశారు.

ఇక ఇపుడు చూస్తే బాహు బలి వన్ టూ తీసి రాజమౌళి ఎక్కడో ఉన్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ మూవీని కూడా రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అని చెప్పాల్సిందే. ఈ మూవీ తరువాత రాజమౌళి తీయబోయే సినిమా ఎవరిది అన్న చర్చ అయితే ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో అని ఒక టాక్ ఉంటే ఇపుడు కొత్తగా పవన్ కళ్యాణ్ ని చేర్చి ప్రచారం చేస్తున్నారు. పవన్ రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు. రాజమౌళి తో సినిమా  అంటే కచ్చితంగా రెండేళ్ల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇప్పట్లో అయ్యేది కాకపోయినా ఏదో టైమ్ లో మాత్రం ఈ  కాంబినేషన్ సెట్  అవడం ఖాయమని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. చూడాలి మరి.




కరోనాతో ఇక సహజీవనమే!

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>