PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kesineni-nani-has-offer-from-central-76d99153-ba12-4ba9-a61f-7102f4f4af9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kesineni-nani-has-offer-from-central-76d99153-ba12-4ba9-a61f-7102f4f4af9a-415x250-IndiaHerald.jpgటిడిపిలో వివాదంపై ఆ పార్టీ నేత బొండా ఉమా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. టిడిపి లో వర్గ పోరు ఉండదు..‌ చంద్రబాబు వర్గం మాత్రమే ఉంటుంది అని స్పష్టం చేసారు. చిన్న చిన్న వివాదాలు ఉన్నా వాటిని అధినేత పరిష్కరిస్తారు అని ఆయన అన్నారు. ఎవరెన్ని చెప్పినా అధినేత చంద్రబాబు ఆదేశాలను అందరూ గౌరవిస్తారు అని స్పష్టం చేసారు. అనేక మంది పోటీ చేయాలని భావించడం సహజం అని ఆయన అన్నారు. అభ్యర్థుల ఎంపిక లో‌వివాదం ఉంటే చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు అని ఆయన స్పష్టం చేసారు. మేయర్ అభ్యర్థి అనేది ఇంకా నిర్kesineni nani;police;panchayati;minister;tdp;ycp;party;bonda umamaheswara raoకేశినేని నానీకి బొండా ఉమా షాక్కేశినేని నానీకి బొండా ఉమా షాక్kesineni nani;police;panchayati;minister;tdp;ycp;party;bonda umamaheswara raoMon, 22 Feb 2021 21:00:00 GMTపార్టీ నేత బొండా ఉమా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. టిడిపి లో వర్గ పోరు ఉండదు..‌ చంద్రబాబు వర్గం మాత్రమే ఉంటుంది అని స్పష్టం చేసారు. చిన్న చిన్న వివాదాలు ఉన్నా వాటిని అధినేత పరిష్కరిస్తారు అని ఆయన అన్నారు. ఎవరెన్ని చెప్పినా అధినేత చంద్రబాబు ఆదేశాలను అందరూ గౌరవిస్తారు అని స్పష్టం చేసారు. అనేక మంది పోటీ చేయాలని భావించడం సహజం అని ఆయన అన్నారు. అభ్యర్థుల ఎంపిక లో‌వివాదం ఉంటే చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు అని ఆయన స్పష్టం చేసారు.

మేయర్ అభ్యర్థి అనేది ఇంకా నిర్ధారణ కాలేదు అని అన్నారు. అధిష్టానం ఎవరి పేరును సూచిస్తే వారికే మా సహకారం ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. అప్పటి వరకు ఎవరి పేర్లు చెప్పకుండా  నాయకులు ఓపికతో ఉండాలి  అని అన్నారు.  స్వతంత్రం వచ్చాక ఎన్నడూ లేని విధంగా అధికార దుర్వినియోగం ఈ పంచాయతీ ఎన్నికలలో చూశాం అని ఆయన ఆరోపించారు. రౌడీయిజం, దౌర్జన్యం, పోలీసులు అండతో బెదిరించారు అని మండిపడ్డారు. గ్రామ స్థాయిలో యుద్ద వాతావరణం తీసుకొచ్చారు అని ఆరోపణలు చేసారు.

మంత్రి పదవులు పోతాయని ఇష్టారీతిన దౌర్జన్యాలు చేశారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంత జరిగినా అధికారులు ప్రతిపక్ష పార్టీలు విజ్ఞప్తి ని పట్టించుకోలేదు అని మండిపడ్డారు. టిడిపి గెలిచిన పంచాయతీ లను కూడా వైసిపి ఖాతాల్లోకి లాక్కున్నారు అని ఆయన ఆరోపణలు చేసారు. టిడిపి మద్దతుదారులు గణనీయంగా ఈ ఎన్నికలలో గెలిచారు అని అన్నారు. ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైసిపి వ్యవహరించింది అని మండిపడ్డారు. అందరూ కలిసి ఏకమైనా.. ప్రజలు టిడిపి కి పట్టం కట్టారు అని మండిపడ్డారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో వైసిపి  ప్రలోభాలకు ప్రయత్నం చేస్తుంది అని విమర్శలు చేసారు. కాగా కేశినేని నానీ కుమార్తె మేయర్ అభ్యర్ధి అని వార్తలు వస్తున్న తరుణంలో బొండా ఇంకా అభ్యర్ధి ఖరారు కాలేదని అన్నారు.


పెళ్లి మండపాల్లో మార్షల్స్ కాపలా.. 500 దాటారో జాగ్రత్త..!

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>