MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-shobanc69fd9cb-386c-4580-8cec-ad82a3acab2a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-shobanc69fd9cb-386c-4580-8cec-ad82a3acab2a-415x250-IndiaHerald.jpgనటి శోభన గురించి సినీ ఇండస్ట్రీలో ఎంత చెప్పినా తక్కువే.. అందం, అభినయం,ప్రతిభ, నటన మాత్రమే కాదు అద్భుతమైన నాట్యకారిణి కూడా. తను చేసే నాట్యానికి ఎలాంటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే మన తెలుగు వాళ్లు ఆమెను నాట్యమయూరి అని పిలుచుకుంటుంటారు. అయితే ఈమె వాస్తవానికి మలయాళం నటి. నటనా నాట్యరంగంలో తన ప్రతిభ చూపించిన పద్మిని లలిత రాగిని మేనకోడలు శోభన. 1984వ సంవత్సరంలో "శ్రీమతి కనుక " అనే చిత్రం ద్వారా పరిచయమయ్యింది. ఈ సినిమాలో హీరో సుమన్ నటించారు.. heroin shoban;chiranjeevi;balakrishna;nagarjuna akkineni;padmini;rajinikanth;salman khan;shobhana;abinaya;dulquer salmaan;editor mohan;jeevitha rajaseskhar;jyothika;suman;vikram;geum;cinema;telugu;tamil;marriage;king;hero;king 1;heroine;chandramukhi;anandam;fidaa;chitramఅతను నన్ను మోసం చేశాడు : సీనియర్ నటి శోభన..!అతను నన్ను మోసం చేశాడు : సీనియర్ నటి శోభన..!heroin shoban;chiranjeevi;balakrishna;nagarjuna akkineni;padmini;rajinikanth;salman khan;shobhana;abinaya;dulquer salmaan;editor mohan;jeevitha rajaseskhar;jyothika;suman;vikram;geum;cinema;telugu;tamil;marriage;king;hero;king 1;heroine;chandramukhi;anandam;fidaa;chitramMon, 22 Feb 2021 11:15:00 GMTనటి శోభన గురించి సినీ ఇండస్ట్రీలో ఎంత చెప్పినా తక్కువే.. అందం, అభినయం,ప్రతిభ, నటన మాత్రమే కాదు అద్భుతమైన నాట్యకారిణి కూడా. తను చేసే నాట్యానికి ఎలాంటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే మన తెలుగు వాళ్లు ఆమెను నాట్యమయూరి అని పిలుచుకుంటుంటారు. అయితే ఈమె వాస్తవానికి మలయాళం నటి. నటనా నాట్యరంగంలో తన ప్రతిభ చూపించిన పద్మిని లలిత రాగిని మేనకోడలు శోభన. 1984వ సంవత్సరంలో "శ్రీమతి కనుక " అనే చిత్రం ద్వారా పరిచయమయ్యింది. ఈ సినిమాలో హీరో సుమన్ నటించారు..


ఇక ఆ తర్వాత నాగార్జున హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన రౌడీ అల్లుడు చిత్రంలో నటించి, తన నటనకు అందరూ ఫిదా అయ్యేలా చేసింది. ఇక బాలకృష్ణ హీరోగా వచ్చిన మువ్వగోపాలుడు చిత్రంలో కూడా నటించి, అందరి మన్ననలను పొందింది. అంతటితో ఆపకుండా మరోసారి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తో కూడా రౌడీ గారి పెళ్ళాం, అల్లుడు గారు,గేమ్ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చి పెట్టుకుంది శోభన..

 శోభన సినిమాలతో తెలుగు, తమిళం,మలయాళం ప్రజలను పలకరించింది. తెలుగులో రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా లో జ్యోతిక పాత్రను మలయాళంలో మనిచిత్రంతాజు లో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా ఈ సినిమాకు అవార్డు కూడా లభించింది.  ఈమె 1994 సంవత్సరంలో చెన్నైలో కాలార్పణ అనే సంస్థను స్థాపించి నాట్యాన్ని విస్తరించింది. ఎంతోమంది కళా నైపుణ్యం కలిగిన వారు కళాకారిణులు ఆమె వద్ద నాట్యం నేర్చుకుంటున్నారు. అందులో మరీ ముఖ్యంగా మన తెలుగువారు వుండడం గమనార్హం.

ఆమె వ్యక్తిగత విషయానికొస్తే శోభన కు 50 సంవత్సరాలు వస్తున్నా పెళ్లి చేసుకోలేదు. ఈ విషయం గురించి ఒక ప్రశ్న అడగగా,గతంలో హీరోయిన్ గా ఉన్నప్పుడు ఒక మలయాళీ హీరో ని ప్రేమించాను. అయితే అతను నన్ను మోసం చేయడంతో జీవితంలో ప్రేమకు,పెళ్లి కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు శోభన తెలిపారు. అయితే తను ఒంటరిగా జీవించడం లేదని,ఒక చిన్నారిని దత్తత తీసుకున్నారు.ఆమె ఆలనా, పాలనా చూసుకుంటూ ఆనందంగా ఉంటున్నారు శోభన. శోభన ఇప్పుడు మరోసారి  తన సినీ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించబోతున్నారు." వారనే ఆవశ్యమునూ" అనే సినిమాలో శోభన అతిథి పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించబోతున్నాడు.


కరోనాతో ఇక సహజీవనమే!

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>