PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/elections-srikakulam686f6f12-5d9e-4aa2-a624-b16c237a7951-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/elections-srikakulam686f6f12-5d9e-4aa2-a624-b16c237a7951-415x250-IndiaHerald.jpgహమ్మయ్య.. ఓ పనైపోయింది.. పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి.. అని పార్టీల నేతలు ఊపిరిపీల్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. పంచాయతీ సమరం ముగిసినా.. ఆ వెనుకే.. ఇతర ఎన్నికలూ వరుసలో ఉన్నాయి. వచ్చే నెలలో మున్సిపల్ సమరం జరగబోతోంది. మరి పంచాయతీ సంగ్రామంలో హోరాహోరీ పోరు సాగింది. ఇక పురపాలికలకు ఎలా ఉంటుందో అన్న ఆలోచన నేతల్లో కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో ప్రధానంగా జిల్లాకు చెందిన మంత్రి నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య పోరు ‘నువ్వా-నేనా’ అన్నరీతిలో హోరెత్తింది. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం, గాelections-srikakulam;mp;panchayati;village;minister;aqua;etcherla;tdp;ycp;mantraపురపోరు: శ్రీకాకుళం - వీటికే ఇలా ఉంటే..మరి వాటికో..?పురపోరు: శ్రీకాకుళం - వీటికే ఇలా ఉంటే..మరి వాటికో..?elections-srikakulam;mp;panchayati;village;minister;aqua;etcherla;tdp;ycp;mantraMon, 22 Feb 2021 11:00:00 GMTపంచాయతీ ఎన్నికలు అయిపోయాయి.. అని పార్టీల నేతలు ఊపిరిపీల్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. పంచాయతీ సమరం ముగిసినా.. ఆ వెనుకే.. ఇతర ఎన్నికలూ వరుసలో ఉన్నాయి. వచ్చే నెలలో మున్సిపల్ సమరం జరగబోతోంది. మరి పంచాయతీ సంగ్రామంలో హోరాహోరీ పోరు సాగింది. ఇక పురపాలికలకు ఎలా ఉంటుందో అన్న ఆలోచన నేతల్లో కనిపిస్తోంది.

పంచాయతీ ఎన్నికల్లో  ప్రధానంగా జిల్లాకు చెందిన మంత్రి నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య పోరు ‘నువ్వా-నేనా’ అన్నరీతిలో హోరెత్తింది. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం, గార, జి.సిగడాం, నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాల్లో ఈనెల 21న నాలుగో దశ ఎన్నికలు జరిగాయి. వీటిలో దాదాపు ఎక్కువ మండలాలు మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ఇలాకాలోనే ఉన్నాయి. వైసీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య రసవత్తర పోరు సాగింది. చివరకు అన్ని దశల ఎన్నికల్లోనూ వైసీపీ మెజార్టీ సాధించినా.. కొన్ని మండలాల్లో మాత్రం టీడీపీ మద్దతుదారులు గట్టి పోటీ ఇచ్చారు.

ఇప్పుడు ఇదే ఉత్సాహంతో పురపాలక ఎన్నికలకూ టీడీపీ మద్దతుదారులు సిద్ధమవుతున్నారు. జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు సైతం ఎంపీ రామ్మోహన్‌నాయుడు కూడా నరసన్నపేట నియోజకవర్గంలో ప్రచారం చేశారు. తమ మద్దతుదారులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అటు సొంత నియోజకవర్గంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కూడా  వైసీపీ మద్దతుదారుల తరపున ప్రచారం చేశారు. గ్రామాల్లో ముఖ్య నేతలతో చర్చలు సాగించారు.

ఇక పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల రెబల్స్‌ వణుకు పుట్టించారు. అనేక పంచాయతీల్లో వైసీపీకి రెబల్స్‌ బెంగ పీడించింది. కొన్ని చోట్ల మంత్రుల బంధువులు కూడా రంగంలోకి దిగారు. మరి పంచాయతీ ఎన్నికలకే ఇలా ఉంటే.. మరి ఇక పురపాలకానికి ఎలా ఉంటుందోనంటున్నారు విశ్లేషకులు.   సర్పంచ్ స్థాయికే ఈ రేంజ్‌లో అధికార, విపక్షాల మధ్య పోరాటం ఉంటే.. ఇక మున్సిపల్ ఎన్నికల సంగతేంటో అంటూ ఆశ్చర్యపోతున్నారు.




కరోనాతో ఇక సహజీవనమే!

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>